AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అప్పుడు నాతో కలిసి హోటల్‌లో పని చేశాడు.. ఇప్పుడు పెద్దస్టార్ అయ్యాడు.. కలిస్తే ఎలా ఉంటాడంటే

జబర్దస్త్ రాము తన సినీ ప్రస్థానాన్ని, అలాగే జబర్దస్త్ నటుడితో తన పాత స్నేహాన్ని గుర్తుచేసుకున్నారు. ఆ నటుడి ఎదుగుదలపై ఆనందం వ్యక్తం చేస్తూ, ఫోన్ కాల్స్ ఎత్తని విషయంపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. జబర్దస్త్ నుండి బయటకుఎందుకు వచ్చాడో కూడా వివరించాడు.

అప్పుడు నాతో కలిసి హోటల్‌లో పని చేశాడు.. ఇప్పుడు పెద్దస్టార్ అయ్యాడు.. కలిస్తే ఎలా ఉంటాడంటే
Jabadasth Ramu
Rajeev Rayala
|

Updated on: Jun 16, 2026 | 10:05 AM

Share

జబర్దస్త్ రాము తన కామెడీతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాడు. కానీ ఆతర్వాత జబర్దస్త్ నుంచి తప్పుకున్నాడు రాము. అలాగే పలు సినిమాల్లోనూ నటించి మెప్పించారు రాము. గతకొంతలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నాడు రాము. కాగా గతంలో ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ ప్రయాణం, సహనటుడు సుడిగాలి సుధీర్‌తో తన అనుబంధం, జబర్దస్త్ నుంచి బయటకు రావడం, అలాగే సినిమా అవకాశాల కోసం చేస్తున్న ప్రయత్నాల గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. రాము తన కెరీర్ బిగినింగ్ గురించి మాట్లాడుతూ.. ఇంటర్ పూర్తయిన తర్వాత రామోజీ ఫిలిం సిటీలో హోటల్ ఇండస్ట్రీలో వెయిటర్‌గా చేరి, అసిస్టెంట్ మేనేజర్ స్థాయికి ఎదిగి రాజీనామా చేశానని తెలిపారు. ఆ సమయంలో తన జీతం కేవలం 850 రూపాయలు మాత్రమేనని, ప్రమోషన్లు ఇస్తున్నా వద్దని చెప్పి తన స్థానాన్ని ఇంకొకరికి ఇచ్చానని చెప్పారు. అదే సమయంలో సుడిగాలి సుధీర్ కూడా రామోజీ ఫిలిం సిటీలో అదే హోటల్ లో క్లోజప్ మెజీషియన్‌గా పనిచేసేవాడని, అప్పటి నుంచీ తామిద్దరం మంచి స్నేహితులమని గుర్తు చేసుకున్నారు.

సుధీర్ ప్రస్తుత స్టార్‌డమ్ గురించి రాము చాలా గర్వంగా మాట్లాడారు. సుధీర్ ఒక పెద్ద స్టార్, హీరో, డిజిటల్, సోషల్ మీడియాలో భయంకరమైన ఫ్యాన్ బేస్ ఉన్నప్పటికీ, అతడు మొదటి నుంచీ డౌన్ టు ఎర్త్ వ్యక్తి అని రాము పేర్కొన్నారు. సుధీర్, వేణు, టింకూతో కలిసి తాను మొదటి స్కిట్ ప్రాక్టీస్ చేసిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. సుధీర్ పదిమందికి ఆదర్శంగా ఎదుగుతున్నప్పుడు తమకు కూడా సంతోషంగా ఉంటుందని రాము అన్నారు. సుధీర్ ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేయడం లేదనే ఫిర్యాదుపై రాము తనదైన అభిప్రాయాన్ని వెల్లడించారు. “మన పనిలో మనం బిజీగా ఉన్నాం. నా ఫోన్ ఎత్తలేదు అని కంప్లైంట్ చేయడం కన్నా నిన్ను నిన్నుగా గుర్తించే వ్యక్తులతో మీరు జర్నీ చేయండి ప్లీజ్” అని సలహా ఇచ్చారు. సుధీర్ ఫోన్ చేస్తే ఎత్తకపోవడని చాలా కారణాలు ఉండొచ్చు. బిజీగా ఉంటాడు. జబర్దస్త్ నుండి బయటకు వచ్చేటప్పుడు రాకెట్ రాఘవ తనను ఆపడానికి ప్రయత్నించిన విషయాన్ని రాము వెల్లడించారు.

రాఘవతో తనకున్న బంధం, తన మానసిక స్థితిని అర్థం చేసుకున్నారని తెలిపారు. తన వల్ల ఎవరూ ఇబ్బంది పడకూడదని, అలాగే ఇతరులను ఇబ్బంది పెట్టే రకం కాదని రాము అన్నారు. ఒక ఆశయం కోసం బయటకు వెళ్తున్నానని, సినిమా ప్రయత్నాలు చేయాలని నిర్ణయించుకున్నానని వివరించారు. ఈ రోజుకూ రాకెట్ రాఘవ తనకు ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు కాల్ చేస్తారని, తమ మధ్య అదే నమ్మకం, అండర్‌స్టాండింగ్, గౌరవం ఉన్నాయని రాము స్పష్టం చేశారు. రాకెట్ రాఘవ జబర్దస్త్ నుండి ఎందుకు బయటకు వెళ్లలేదనే ప్రశ్నకు రాము తన విశ్లేషణను పంచుకున్నారు. రాఘవ కుటుంబ బాధ్యతలు, భవిష్యత్తు గురించి ఆలోచించే వ్యక్తి అని, గతంలో బుల్లితెర, బిగ్ స్క్రీన్ ప్రయత్నాల్లో పూర్తి స్థాయి మద్దతు లభించలేదని అన్నారు. రాఘవ తెలివైన వ్యక్తి అని, ఉన్నత విద్యావంతుడని, అందుకే బయటకు వెళ్లిన తర్వాత ఎదురయ్యే సవాళ్లను అర్థం చేసుకుని, ప్రస్తుతం లభించిన అవకాశాన్ని వదులుకోకూడదని నిర్ణయించుకుని ఉంటారని రాము తెలిపారు. రాఘవ స్కిట్‌లలో బూతులు, డబుల్ మీనింగ్స్, బాడీ షేమింగ్ ఉండవని, నాణ్యమైన హాస్యాన్ని అందిస్తారని రాము ప్రశంసించారు.

Sudigali Sudheer

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us