AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చాలా మందితో సినిమాలు చేశా.. కానీ ఆ ఇద్దరు హీరోలతో నటించలేదు.. ఛాన్స్‌లు వచ్చినా మిస్ అయ్యా..

గౌతమి.. 90వ దశకంలో స్టార్‌ హీరోయిన్‌గా వెలుగొందిన ఈమె గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్‌లోని నిడదవోలుకు చెందిన ఆమె టాలీవుడ్‌, కోలీవుడ్‌లోని స్టార్‌ హీరోల సరసన నటించింది. శ్రీనివాస కల్యాణం, బామ్మ మాట బంగారు బాట, పల్లెటూరి మొగుడు, సంకల్పం తదితర తెలుగు సినిమాల్లో ఆమె అభినయం అందరినీ ఆకట్టుకుంది.

చాలా మందితో సినిమాలు చేశా.. కానీ ఆ ఇద్దరు హీరోలతో నటించలేదు.. ఛాన్స్‌లు వచ్చినా మిస్ అయ్యా..
Gautami
Rajeev Rayala
|

Updated on: Jun 21, 2026 | 1:30 PM

Share

స్టార్ హీరోల సరసన హీరోయిన్ ఛాన్స్ అంటే అందాల భామలు ఎగిరి గంతేస్తారు. స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తే దశ తిరిగిపోతుందని చాలా మంది ముద్దుగుమ్మలు ఎదురుచూస్తూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రం డేట్స్ అడ్జెస్ట్ అవ్వడం కుదరక ఛాన్స్ లు మిస్ చేసుకున్న వారు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ స్టార్ హీరోయిన్ కూడా చాలా మంది హీరోలతో నటించింది కానీ మెగాస్టార్ చిరంజీవితో మాత్రం ఒక్క సినిమా కూడా చేయలేదు. అలా అని ఆమెకు ఛాన్స్ రాలేదు అనుకోకండి. మూడుసార్లు ఛాన్స్ వచ్చినా కూడా ఆమెకు మెగాస్టార్ తో నటించే అదృష్టం రాలేదు ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.? గతంలో ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. డేట్స్ అడ్జస్ట్ కాకపోవడం.. రజనీకాంత్ సినిమాకు ఇచ్చిన కమిట్‌మెంట్ కారణంగా ఆమె చిరుతో నటించే అవకాశాలను వదులుకోవాల్సి వచ్చిందని ఆమె చెప్పుకొచ్చారు.

అందుకు ముందు సినిమాలకు కమిట్ అవ్వడం వల్ల చిరుతో ఛాన్స్ లు మిస్ అయ్యాను. ఇదే విషయంపై చిరంజీవిని కలిసి చెప్పాలని ఉందని అన్నారు. ఆమె మరెవరో కాదు హీరోయిన్ గౌతమి. తెలుగు, తమిళంలో ఎన్నో సినిమాల్లో నటించిన ఆమె.. చిరంజీవితో ఒక్క సినిమా కూడా చేయలేకపోయారు. ఒకానొక సమయంలో చిరంజీవి తనపై అసంతృప్తిగా ఉన్నారని, అందుకు కారణం తాను ఆయనతో మూడు చిత్రాలకు నో చెప్పడమేనని గౌతమి తెలిపారు. దానికి కారణం సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాకు ముందుగా కమిట్ అవ్వడం వల్ల, డేట్లు క్లాష్ కావడంతో ఈ అవకాశాలను వదులుకోవాల్సి వచ్చిందని ఆమె చెప్పుకొచ్చారు.

ఒకసారి ఒక సినిమాకు కమిట్ అయిన తర్వాత, ఏ కారణం చేతనైనా డేట్లను మార్చడం లేదా వేరే సినిమాకు కేటాయించడం తాను ఎప్పుడూ చేయలేదని గౌతమి స్పష్టం చేశారు. మంచి చిత్రాలను కోల్పోయినా.., తన వృత్తిపరమైన నిబద్ధతను ఎప్పుడూ రాజీ పడలేదని తెలిపారు. ఈ విషయంపై చిరంజీవికి వ్యక్తిగతంగా వివరించే అవకాశం లభిస్తుందని ఆశిస్తున్నట్లు గౌతమి చెప్పుకొచ్చింది. బాలకృష్ణతో కూడా కలిసి నటించలేదని, అయితే సౌత్ ఇండియన్ స్టార్స్‌లో చాలా మందితో పనిచేశానని ఆమె వివరించారు. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us