AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలుగులో తిరుగులేని హీరోయిన్.. వెంకీ, బాలయ్య, నాగ్‌లతో నటించింది కానీ.. చిరంజీవితో ఒక్క సినిమా కూడా చేయలేదు

సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా రాణించాలని చాలా మంది ట్రై చేస్తుంటారు. హీరోల సరసన సినిమాలు చేయాలనీ చాలా మంది హీరోయిన్స్ తో కోరుకుంటూ ఉంటారు. ఓ హీరోయిన్ మాత్రం నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ లతో నటించింది కానీ చిరంజీవితో మాత్రం హీరోయిన్ గా చేయలేదు.

తెలుగులో తిరుగులేని హీరోయిన్.. వెంకీ, బాలయ్య, నాగ్‌లతో నటించింది కానీ.. చిరంజీవితో ఒక్క సినిమా కూడా చేయలేదు
Chiranjeevi
Rajeev Rayala
|

Updated on: Jun 16, 2026 | 11:09 AM

Share

చాలా మంది హీరోయిన్స్ లిమిట్స్ తో ఉంటారు.. అంటే తమకన్నా పెద్ద వయసున్న హీరోలతో నటించం అని కండీషన్స్ పెట్టుకుంటూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రం ఎవరితోనైనా సినిమాలు చేసి మెప్పిస్తుంటారు. సీనియర్ హీరోలు, యంగ్ హీరోలు అని లేకుండా అందరి సరసన నటిస్తుంటారు. అలాగే కొంతమంది హీరోయిన్స్ తండ్రి కొడుకులతో కూడా హీరోయిన్స్ గా నటించి అలరించారు. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న అందాల భామ ఇండస్ట్రీలోనే తోప్ హీరోయిన్. ఆమెతో నటించాలని హీరోలు కూడా వెయిట్ చేస్తుంటారు. తెలుగులో ఎంతో మంది యంగ్ హీరోలతో, స్టార్ హీరోలతో హీరోయిన్ గా నటించిన ఆమె ఒక్క మెగాస్టార్ చిరంజీవి సరసన మాత్రం నటించలేదు. ఇంతకూ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా.?

పైన మనం మాట్లాడుకున్న హీరోయిన్ వెంకటేష్, బాలకృష్ణ, నాగార్జున లాంటి హీరోల సరసన హీరోయిన్ గా సినిమాలు చేసింది. కానీ మెగాస్టార్ తో మాత్రం ఆమె సినిమాలు చేయలేదు. ఆమె మరెవరో కాదు అందాల భామ అనుష్క శెట్టి. తెలుగులో అనుష్క తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకుంది. ఆమె నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. ఇక అరుంధతి రుద్రమదేవి సినిమాలతో స్టార్ డమ్ తెచ్చుకుంది. అలాగే బాహుబలి సినిమా ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో ఎంతో క్రేజ్ తెచ్చుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఇవి కూడా చదవండి

బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్  అయ్యింది అనుష్క. కాగా ఈ అమ్మడు బాలయ్య బాబుతో ఒక్క మగడు సినిమాలో హీరోయిన్ గా చేసింది. నాగార్జునతో సూపర్, డాన్, డమరుకం, రగడ ఇలా పలు సినిమాల్లో నటించింది. అలాగే వెంకటేష్ తో చింతకాయల రవి సినిమాలో నటించింది. కానీ చిరంజీవితో మాత్రం హీరోయిన్ గా చేయలేదు. స్టాలిన్ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ లో మెరిసింది. అలాగే సైరా సినిమాలో చిన్న పాత్రలో అలా మెరిసి ఇలా మాయం అయ్యింది. అంతే కాని ఆమె హీరోయిన్ గా సినిమాలు చేయలేదు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us