AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పుట్టుమచ్చ, పద్మినీ జాతి స్త్రీ.. ఎన్నిసార్లు చూసిన బోరు కొట్టని కల్ట్ క్లాసిక్ మూవీ

దర్శకుడు వంశీ గారి కెరీర్‌లో ఎన్నో సినిమాలు క్లాసిక్స్ గా నిలిచాయి. వాటిలో ఈ సినిమా ఒకటి. ఆయన కెరీర్ లోనే ఈ సినిమా ఓ మైలు రాయిగా నిలిచింది. ఈ చిత్రం అఖండ విజయం సాధించింది. దీని రూపకల్పన, ఆసక్తికరమైన సంఘటనలు ఒక్కసారి చూద్దాం.!

పుట్టుమచ్చ, పద్మినీ జాతి స్త్రీ.. ఎన్నిసార్లు చూసిన బోరు కొట్టని కల్ట్ క్లాసిక్ మూవీ
Movie News
Rajeev Rayala
|

Updated on: Jun 15, 2026 | 12:55 PM

Share

తెలుగు సినిమా చరిత్రలో దర్శకుడు వంశీ తనదైన ముద్ర వేసుకున్నారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన ఎన్నో సినిమాలు సూపర్ హిట్స్ గా నిలిచాయి. తమ మార్క్ సినిమాలతో వంశీ ఎన్నో వండర్స్ చేశారు. వంశీ దర్శకత్వంలో వచ్చిన సినిమాల్లో లేడీస్ టైలర్ చిత్రం ఒక కల్ట్ క్లాసిక్‌గా నిలిచిపోయింది. ఈ సినిమా వెనుక వంశీ కెరీర్ ప్రయాణం, అనేక ఆసక్తికర సంఘటనలు దాగి ఉన్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సినీ విశ్లేషకులు చిల్లగట్టు శ్రీకాంత్  లేడీస్ ట్రైలర్ సినిమా గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. చిరంజీవి గారితో మంచుపల్లకితో దర్శకుడిగా పరిచయం అయిన వంశీ, ఆ తర్వాత సితార, అన్వేషణ వంటి విజయవంతమైన చిత్రాలతో తన ప్రత్యేకతను చాటుకున్నారు. అయితే, ఆలాపన వంటి ప్రయోగాత్మక చిత్రం వాణిజ్యపరంగా నిరాశపరిచింది. ఈ సమయంలో, వంశీ తన తదుపరి సినిమాపై తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నారు. నిర్మాత వేమూరు సత్యనారాయణ, శ్రావంతి రవికిషోర్ వంటి నిర్మాతలు వంశీని ఆదుకోవడానికి ముందుకు వచ్చారు.

ఇది కూడా చదవండి : కుర్రాళ్ల ఆల్ టైం ఫేవరెట్ మూవీ.. పెట్టింది రూ.4కోట్లు వచ్చింది రూ. 110కోట్లు.. ఇండస్ట్రీని షేక్ చేసిన చిన్న సినిమా

క్రైమ్ థ్రిల్లర్ సౌందర్య లహరి కథతో కమలహాసన్‌ను కలిసినా, ఆయన డేట్లు అందుబాటులో లేకపోవడంతో వంశీ మళ్ళీ మొదటికి వచ్చారు. ఈ క్రమంలో, తనికెళ్ళ భరణితో కలిసి విజయవాడలో కొత్త కథా చర్చలు జరుపుతున్నప్పుడు, రైల్వే ప్లాట్‌ఫామ్‌పై అనుకోకుండా కనిపించిన ఒక సిగరెట్ ప్యాకెట్‌పై లేడీస్ టైలర్ అనే పేరును రాసి, దానిని సినిమా టైటిల్‌గా రిజిస్టర్ చేయించారు. అక్కడి నుంచి లేడీస్ టైలర్ కథా ప్రయాణం మొదలైంది. ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్‌ను హీరోగా ఎంచుకోవడానికి వంశీ గారు పట్టుబట్టారు. రాజేంద్ర ప్రసాద్ కి అప్పటికే మంచుపల్లకిలో ఒక పాత్ర ద్వారా వంశీకి పరిచయం ఉంది. సినిమాలో ముఖ్యమైన “కుడి తొడ మీద పుట్టుమచ్చ ఉన్న పద్మిని జాతి స్త్రీ” డైలాగ్ తో పాటు, తనికెళ్ళ భరణి రాసిన కామెడీ ట్రాక్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భరణి గారి జా భాష ప్రయోగం, డైలాగులలోని విరుపు చిత్రం విజయానికి ఎంతగానో దోహదపడ్డాయి.

ఇది కూడా చదవండి : ఇంటర్వెల్ సీన్ మార్చేశారు.. కట్ చేస్తే ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టేసింది

ఇళయరాజా సంగీతం లేడీస్ టైలర్ చిత్రానికి ఆయువుపట్టు. గోపీలోల, హాయమ్మా హాయమ్మా, పొరపాటిది గ్రహపాటిది వంటి పాటలు ప్రేక్షకుల మదిలో నిలిచిపోయాయి.నటీనటుల ఎంపిక కూడా ఈ చిత్ర విజయానికి దోహదపడింది. అర్చన, వై.విజయ, దీప, సంధ్య (నటి) వంటి వారు తమ పాత్రలలో ఒదిగిపోయారు. జట్కా సీను పాత్ర కోసం బర్మా బజార్‌లో సెంట్ సీసాలు అమ్ముకునే కర్ణ అనే వ్యక్తిని వంశీ ఎంపిక చేయడం విశేషం. తనికెళ్ళ భరణి కానిస్టేబుల్ పాత్రలో అద్భుతంగా నటించారు. ఈ పాత్రను మొదట నూతనప్రసాద్‌తో చేయించాలని అనుకున్నా, ఆయన బిజీగా ఉండటం వల్ల భరణి గారు ఆ పాత్రను పోషించారు. లేడీస్ టైలర్ కేవలం ఒక విజయవంతమైన సినిమా మాత్రమే కాదు, వంశీ కళాత్మక దృష్టికి, కష్ట సమయాలలో కూడా నిలబడిన ధైర్యానికి నిదర్శనం. ఇది తెలుగు సినిమా చరిత్రలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది, నేటికీ హాస్య ప్రియులను, సంగీత ప్రియులను అలరిస్తూనే ఉంది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : ఆ డాన్స్ ఏంటి అమ్మడు..! హ్యాపీ రీ రిలీజ్‌లో రచ్చ చేసిన హీరోయిన్.. థియేటర్ దద్దరిల్లిందిగా

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
సగ్గుబియ్యం వడలు.. ఇలా చేస్తే తింటే వంద రోగాలు మాయం!
సగ్గుబియ్యం వడలు.. ఇలా చేస్తే తింటే వంద రోగాలు మాయం!
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి