AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కుర్రాళ్ల ఆల్ టైం ఫేవరెట్ మూవీ.. పెట్టింది రూ.4కోట్లు వచ్చింది రూ. 110కోట్లు.. ఇండస్ట్రీని షేక్ చేసిన చిన్న సినిమా

చిన్న సినిమా.. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై భారీ సంచలనం సృష్టించింది. కుల వివక్షత పేరుతో జరిగే నేరాలను ఆధారంగా చేసుకుని తెరకెక్కించిన మూవీ అది. కేవలం రూ.4 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ. 110 కోట్లకు పైగా వసూలు చేసి రికార్డు సృష్టించింది.

కుర్రాళ్ల ఆల్ టైం ఫేవరెట్ మూవీ.. పెట్టింది రూ.4కోట్లు వచ్చింది రూ. 110కోట్లు.. ఇండస్ట్రీని షేక్ చేసిన చిన్న సినిమా
Movie News
Rajeev Rayala
|

Updated on: Jun 14, 2026 | 12:57 PM

Share

ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు ప్రేక్షకుల మనసుల్లో ఎప్పటికి గుర్తుండి పోతాయి. ఇప్పటికే ఎన్నో కల్ట్ క్లాసిక్ సినిమాలు ఇండస్ట్రీలో ఉన్నాయి. కేవలం బడా సినిమాలు, భారీ బడ్జెట్ సినిమాలు మాత్రమే కాదు చిన్న సినిమాలుగా వచ్చి సంచలనాలు క్రియేట్ చేసినవి చాలానే ఉన్నాయి. ముఖ్యంగా ప్రేమకథా చిత్రాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. యువతీయువకులను కట్టిపడేసిన సినిమాల విషయానికొస్తే కోకొల్లలుగా ఉన్నాయి. ప్రతి భాషలో ఎక్కువ శాతం సక్సెస్ అయ్యే సినిమాలు ప్రేమ కథలే.. ఆ లిస్ట్‌లో బోలెడన్ని సినిమాలు ఉన్నాయి. వాటిలో ఈ సినిమా ఒకటి. ఈ సినిమా కేవలం రూ. 4 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కింది. కానీ విడుదలైన తర్వాత సెన్సేషనల్ హిట్ గా నిలిచి ఏకంగా రూ. 100కోట్లకు పైగా వసూల్ చేసింది.  అంతే కాదు ఈ సినిమాలోని సాంగ్స్ చాలా పాపులర్ అయ్యాయి. అన్ని పాటలు ఆణిముత్యాలే..

ఇది కూడా చదవండి : Jabardasth Vinod: జబర్దస్త్ లేకపోతే ఆ పని చేసేవాడిని.. అసలు విషయం చెప్పిన లేడీ గెటప్ వినోద్

ఆ సినిమా మరేదో కాదు.. సైరాట్. తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా పెద్దగా తెలియపోవచ్చు కానీ మరాఠీలో ఈ సినిమా భారీ హిట్. మరాఠి సినిమా అయినప్పటికీ బాషాతో సంబంధం లేకుండా ప్రేక్షకులందరిని ఆకట్టుకుంది. అందమైన ప్రేమకథగా తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో ఒక ఊపు ఊపేస్తోంది. ఆకాష్ తోసర్, రింకు రాజ్ గురు హీరో, హీరోయిన్స్ గా నటించి మెప్పించారు. అలాగే ఈ సినిమాలో హీరో హీరోయిన్స్ కూడా ప్రేక్షకుల మనసుల్లో ఎప్పటికీ గుర్తుండి పోతారు ముఖ్యంగా హీరోయిన్.. తొలి చిత్రంతోనే కోట్లాది మంది అభిమాను హృదయాలను గెలుచుకుంది హీరోయిన్ రింకు రాజ్ గురు.

ఇది కూడా చదవండి : ఇప్పుడున్న హీరోల్లో అతనొక్కడే నన్ను ఆంటీ అని పిలుస్తాడు.. జయసుధ ఆసక్తికర కామెంట్స్

ఓ గ్రామంలోని పెద్ద రాజకీయ ఫ్యామిలీకి చెందిన హీరోయిన్, అదే గ్రామంలో పేద కుటుంబంలో జన్మించిన హీరో ఇద్దరూ ప్రేమలో పడతారు. కానీ వారిద్దరి ప్రేమ కారణంగా ఆ ఊర్లో అల్లర్లు జరుగుతాయి. ఇద్దరూ తమ గ్రామం నుంచి పారిపోయి హైదరాబాద్‌కు చేరుకుంటారు. ఆతర్వాత వీరి జీవితంలో ఏం జరిగింది అనేది మిగతా కథ. ఈ సినిమాను చాలా అద్భుతంగా తెరకెక్కించారు. 2016లో విడుదలై దాదాపు రూ.110 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ప్రస్తుతం ఈ మూవీ జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమాను చూడకపోతే తప్పక చూడండి అస్సలు మిస్ అవ్వవద్దు..

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : అప్పుడు నా సినిమాలో నటించాడు.. ఇప్పుడు స్టార్ హీరో.. అతను ఎంత మారిపోయాడంటే

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర