AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

16 ఏళ్లకే హీరోయిన్.. మూడో చిత్రంతోనే సంచలనం.. కట్ చేస్తే 350కి పైగా సినిమాలు చేసిన స్టార్

కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన జ్యోతి చిత్రం 50 వసంతాలు పూర్తి చేసుకుంది. సహజనటి జయసుధ అద్భుత నటనతో అలరించిన ఈ సినిమా, దర్శకుడిగా రాఘవేంద్రరావు సినీ ప్రస్థానంలో ఒక మలుపు. ఈ సినిమా తర్వాత జయసుధ కెరీర్ స్పీడ్ అందుకుంది.

16 ఏళ్లకే హీరోయిన్.. మూడో చిత్రంతోనే సంచలనం.. కట్ చేస్తే 350కి పైగా సినిమాలు చేసిన స్టార్
Actress
Rajeev Rayala
|

Updated on: Jun 09, 2026 | 1:00 PM

Share

తెలుగు సినిమా చరిత్రలో కొన్ని చిత్రాలు ఎప్పటికీ నిలిచిపోతాయి. అలాంటి చిత్రాల్లో 1976లో విడుదలైన జ్యోతి ఒకటి. ఈ చిత్రం ఇటీవలే 50 వసంతాలు పూర్తి చేసుకుని, తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. సినీ విశ్లేషకులు చిలకపాటి శ్రీకాంత్ ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సినిమా ఎన్.టి. రామారావు గారి అడవి రాముడు, కృష్ణ గారి పాడి పంటలు వంటి అప్పట్లో బ్లాక్‌బస్టర్‌లుగా నిలిచిన చిత్రాలతో సమానంగా 50 వసంతాలు పూర్తి చేసుకోవడం విశేషం. జ్యోతి చిత్రం కె. రాఘవేంద్రరావు దర్శకుడిగా తీసిన రెండవ సినిమా. ఆయన తొలి చిత్రం బాబు (శోభన్ బాబు హీరోగా) కమర్షియల్ గా విజయం సాధించలేకపోయింది. అప్పట్లో కె. విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన జీవనజ్యోతి (శోభన్ బాబు, వాణిశ్రీ ప్రధాన పాత్రల్లో) సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడం చూసి రాఘవేంద్రరావు ఇంప్రస్ అయ్యారు. మహిళా ప్రేక్షకులు థియేటర్లకు పెద్ద ఎత్తున వస్తుండటం, లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు ఉన్న ఆదరణను ఆయన గమనించారు. ఈ ప్రభావంతో రాఘవేంద్రరావు డా. సి. ఆనందరామం రచించిన మమతల కోవెల నవలను జ్యోతి చిత్రంగా తెరకెక్కించారు.

ఈ చిత్రంలో జయసుధ టైటిల్ రోల్ జ్యోతిగా అద్భుతమైన నటనను ప్రదర్శించారు. అప్పుడు ఆమె వయసు 17 ఏళ్లు మాత్రమే మురళీమోహన్ ప్రేమించిన రవి పాత్రలో, గుమ్మడి వెంకటేశ్వరరావు (రాజయ్య), అల్లు రామలింగయ్య, రావి గోపాలరావు, గిరిబాబు వంటి నటులు కీలక పాత్రల్లో ఒదిగిపోయారు. ముఖ్యంగా, జె.వి. సోమయాజులు ఒక చిన్న పాత్రలో కనిపించడం చాలా మందికి తెలియని విషయం. జ్యోతి పాత్ర పరివర్తన, రాజయ్య కుటుంబంలోకి ఆమె రాక, ఆ కుటుంబాన్ని చక్కదిద్దే ఆమె ప్రయత్నం, చివరికి తను అల్పాయుష్కురాలు అని తెలిసి తనువు చాలించడం వంటి సన్నివేశాలు ప్రేక్షకులను కదిలించాయి. జయసుధ సహజనటిగా పేరు ప్రఖ్యాతలు పొందడానికి జ్యోతి చిత్రం ఒక ముఖ్య కారణం. ఈ సినిమా విజయంతో సిరిమల్లె పువ్వల్లే నవ్వు వంటి పాటలు థియేటర్లను ప్రేక్షకులతో నింపేశాయి.

జయసుధ తన కెరీర్ అంతటా గొప్ప నటిగా వెలుగొందారు. పండంటి కాపురంతో బాలనటిగా రంగప్రవేశం చేసి, జ్యోతి, కె. బాలచందర్ ఇది కథ కాదు, దాసరి నారాయణరావు శివరంజని వంటి చిత్రాలతో స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు. హీరోయిన్‌గా, అక్కగా, తల్లిగా, అత్తగా, అమ్మమ్మగా ఇలా ప్రతి వయసులో, ప్రతి సందర్భంలో స్త్రీ పోషించే పాత్రలను తెరపై అత్యంత సమర్థవంతంగా చూపించిన అద్భుతమైన నటి జయసుధ. ఆమె 350కి పైగా చిత్రాల్లో నటించినప్పటికీ, ఇప్పటివరకు పద్మ పురస్కారాలు, రఘుపతి వెంకయ్య నాయుడు పురస్కారాలు వంటివి లభించకపోవడం తెలుగు సినిమా అభిమానులకు బాధ కలిగించే విషయం.

Jayasudha

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
16 ఏళ్లకే హీరోయిన్..మూడో చిత్రంతోనే సంచలనం..
16 ఏళ్లకే హీరోయిన్..మూడో చిత్రంతోనే సంచలనం..
హోర్ముజ్ జలసంధిలో కుప్పకూలిన అమెరికా పవర్‌ఫుల్ హెలికాప్టర్!
హోర్ముజ్ జలసంధిలో కుప్పకూలిన అమెరికా పవర్‌ఫుల్ హెలికాప్టర్!
ప్రపంచంలోనే అత్యంత రద్దీ రైల్వే స్టేషన్ ఇదే..!
ప్రపంచంలోనే అత్యంత రద్దీ రైల్వే స్టేషన్ ఇదే..!
తొలి మ్యాచ్‌లో తుస్సు మనిపించిన వైభవ్..!
తొలి మ్యాచ్‌లో తుస్సు మనిపించిన వైభవ్..!
విమానంలో పొగ తాగడం నేరం.. మరి టాయిలెట్‌లో ఆ 'యాష్ ట్రే' ఎందుకు?
విమానంలో పొగ తాగడం నేరం.. మరి టాయిలెట్‌లో ఆ 'యాష్ ట్రే' ఎందుకు?
ఓరీ దేవుడో.. గర్భనిరోధక ఇంజెక్షన్ తీసుకుంటే కంటి చూపు గోవిందా!
ఓరీ దేవుడో.. గర్భనిరోధక ఇంజెక్షన్ తీసుకుంటే కంటి చూపు గోవిందా!
పా..పా..పాము పార్క్‌ చేసిన బైక్‌లోకి దూరి హల్‌చల్‌..జరిగింది ఇదే
పా..పా..పాము పార్క్‌ చేసిన బైక్‌లోకి దూరి హల్‌చల్‌..జరిగింది ఇదే
బంగారం ధరలను రోజూ ఎవరు డిసైడ్ చేస్తారు..? గంటల్లోనే రేట్లు..
బంగారం ధరలను రోజూ ఎవరు డిసైడ్ చేస్తారు..? గంటల్లోనే రేట్లు..
మంచు కొండలను చీల్చుకుంటూ శాశ్వత పరిష్కారం ‘జోజిలా టన్నెల్’!
మంచు కొండలను చీల్చుకుంటూ శాశ్వత పరిష్కారం ‘జోజిలా టన్నెల్’!
ఒక కప్పు పచ్చి శనగపప్పు.. రెండు టమాటాలతో కర్రీ చేస్తే చపాతీల్లోకి
ఒక కప్పు పచ్చి శనగపప్పు.. రెండు టమాటాలతో కర్రీ చేస్తే చపాతీల్లోకి