AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ డాన్స్ ఏంటి అమ్మడు..! హ్యాపీ రీ రిలీజ్‌లో రచ్చ చేసిన హీరోయిన్.. థియేటర్ దద్దరిల్లిందిగా

గీతా ఆర్ట్స్ బ్యానర్‌‌పై లవ్ స్టోరీలను హృదయాలకు హత్తుకునేలా తీయడంలో ఎక్స్‌పర్ట్ అయిన కరుణాకర్ హ్యాపీ సినిమాకు దర్శకత్వం వహించారు. మనోజ్ బాజ్‌పేయీ, దీపక్ షిర్కే, బ్రహ్మానందం, కిషోర్ , తనికెళ్ళ భరణి ఇతర ముఖ్య పాత్రలు చేసిన ఈ సినిమా యూత్‌కు బాగా కనెక్ట్ అయ్యింది.

ఆ డాన్స్ ఏంటి అమ్మడు..! హ్యాపీ రీ రిలీజ్‌లో రచ్చ చేసిన హీరోయిన్.. థియేటర్ దద్దరిల్లిందిగా
Actress
Rajeev Rayala
|

Updated on: Jun 14, 2026 | 11:22 AM

Share

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు తెలుగులోనే కాదు ఇప్పుడు ఇండియా వైడ్ గా ఫ్యాన్స్ ను సొంతం చేసుకున్నాడు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోగా విపరీతమైన ఫ్యాన్స్ సొంతం చేసుకున్నాడు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు కేరళలో అల్లు అర్జున్ కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు. అల్లు అర్జున్ నటించిన సినిమాలు మలయాళంలో డబ్ అయ్యి సంచలన విజయాలను సాధించాయి. మనదగ్గర యావరేజ్ అయిన సినిమాలు కూడా కేరళలో వందరోజులకుపైగా ఆడి విజయాలను అందుకున్నాయి. అలాగే హ్యాపీ సినిమా అక్కడ సెన్సేషనల్ హిట్ అయ్యింది. ఇక ఇటీవలే ఈ సినిమాను రీ రిలీజ్ చేశారు. ఈ సినిమాను కేరళ ఫ్యాన్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. థియేటర్స్ మొత్తం ఆడియన్స్ రచ్చ రచ్చ చేస్తున్నారు. హ్యాపీ సినిమాలోని పాటలకు ఆడియన్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు.

ఇది కూడా చదవండి : Jabardasth Vinod: జబర్దస్త్ లేకపోతే ఆ పని చేసేవాడిని.. అసలు విషయం చెప్పిన లేడీ గెటప్ వినోద్

సోషల్ మీడియాలో హ్యాపీ సినిమా థియేటర్స్ లో ఫ్యాన్స్ రచ్చ చేస్తున్న వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఓ హీరోయిన్ హ్యాపీ సినిమా థియేటర్ కు వెళ్లి ఆడియన్స్ కలిసి పాటలకు డాన్స్ చేస్తూ తెగ ఎంజాయ్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇంతకూ ఆ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.? టాలీవుడ్ లో లేటెస్ట్ సెన్సేషన్ గా మారిపోయింది ఆ యంగ్ బ్యూటీ చేసింది తక్కువ సినిమాలే కానీ విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. ఆమె మరెవరో కాదు..

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : ఇప్పుడున్న హీరోల్లో అతనొక్కడే నన్ను ఆంటీ అని పిలుస్తాడు.. జయసుధ ఆసక్తికర కామెంట్స్

అనశ్వర రాజన్.. ఈ అందాల భామ 2017 నుంచి సినిమా ఇండస్ట్రీలో సినిమాలు చేస్తుంది. ఈ అమ్మడు ఎక్కువగా మలయాళంలో సినిమాలు చేసింది. అలాగే తమిళ్ లో రెండు సినిమాలు, హిందీలో ఓ సినిమా చేసింది. ఇక తెలుగులో రోషన్ మేక నటించిన ఛాంపియన్ అనే సినిమాలో నటించింది అనశ్వర రాజన్. ఈ సినిమాతో తెలుగు కుర్రాళ్ల డ్రీమ్  గర్ల్ గా మారిపోయింది. తాజాగా అనశ్వర రాజన్ హ్యాపీ సినిమాను థియేటర్ లో చూసి తెగ ఎంజాయ్ చేసింది. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.

ఇది కూడా చదవండి : అప్పుడు నా సినిమాలో నటించాడు.. ఇప్పుడు స్టార్ హీరో.. అతను ఎంత మారిపోయాడంటే

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us