AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చనిపోయి ఎక్కడున్నాడో మహానుభావుడు..! తినడానికి తిండి లేదు అంటే కారునిండా సరుకులు తెచ్చి ఇచ్చాడు..

రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన శివ సినిమాతోనే ఉత్తేజ కూడా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో కమెడియన్ గా, సహాయక నటుడిగా మెప్పించాడు. కేవలం నటుడిగానే కాకుండా స్క్రీన్ రైటర్ గా, డైలాగ్ రైటర్ గా, డబ్బింగ్ ఆర్టిస్టుగానూ సత్తా చాటారు ఉత్తేజ్.

చనిపోయి ఎక్కడున్నాడో మహానుభావుడు..! తినడానికి తిండి లేదు అంటే కారునిండా సరుకులు తెచ్చి ఇచ్చాడు..
Uttej
Rajeev Rayala
|

Updated on: Jun 14, 2026 | 8:26 AM

Share

ప్రముఖ నటుడు ఉత్తేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించేవారు ఉత్తేజ్. ఈ మధ్యకాలంలో ఉత్తేజ్ సినిమాల్లో పెద్దగా యాక్టివ్ గా లేరు. కాగా గతంలో ఓ ఇంటర్వ్యూలో దివంగత హాస్యనటుడు వేణు మాధవ్ గొప్ప మనసును, అరుదైన మానవతా దృక్పథాన్ని పంచుకున్నారు. సినీ పరిశ్రమలో మనుషులు ఎలా ఉంటారు అనేదానికి ఒక ఉదాహరణగా వేణు మాధవ్ కు సంబంధించిన ఒక సంఘటనను ఆయన వివరించారు. ఒకసారి వేణు మాధవ్ ఒక సినిమా షూటింగ్‌లో ఉండగా, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ఒక తోటి నటుడు ఆయనను కలిశాడట. సినిమాల్లో బిజీగా ఉన్న వేణు మాధవ్‌ను రెండు సీన్లు ఇవ్వమని, అలాగే ఏదైనా ఆర్థిక సహాయం చేయమని ఆ నటుడు కోరాడట. తన కుటుంబం చాలా కష్టాల్లో ఉందని చెప్పుకొని బాధపడ్డాడట ఆ నటుడు.

ఇది కూడా చదవండి : Jabardasth Vinod: జబర్దస్త్ లేకపోతే ఆ పని చేసేవాడిని.. అసలు విషయం చెప్పిన లేడీ గెటప్ వినోద్

అయితే వేణు మాధవ్ ముందుగా అతనికి లంచ్ ఏర్పాటు చేసి, భోజనం చేయమని చెప్పారట. లంచ్ బ్రేక్ తర్వాత, ఆ నటుడి పరిస్థితి గురించి ఉత్తేజ్‌తో ఆరా తీశారు. హైదరాబాద్ లోని గణపతి కాంప్లెక్స్ దగ్గర ఉంటాడని, ఎంతో కొంత సాయం కోరుతున్నాడని ఉత్తేజ్ చెప్పగా, వేణు మాధవ్ సాయం చేస్తానని మాట ఇచ్చి షూటింగ్ చేసుకున్నాడట.. అయితే ఆ నటుడు వేణు మాధవ్ నుంచి డబ్బు సాయం కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు. షూటింగ్ ప్యాకప్ అయిన తర్వాత, వేణు మాధవ్ ఉత్తేజ్‌ను పిలిచి తన ఇన్నోవా కారు వెనుక డోర్ తెరిచి చూపించారట. ఆసమయంలో ఉత్తేజ్ ఆశ్చర్యపోయారు. ఆ కారు నిండా రెండు బస్తాల బియ్యం, పది కిలోల కందిపప్పు, పది కిలోల పెసరపప్పు, అలాగే అల్లం, వెల్లుల్లి, ఉప్పు వంటి నిత్యావసర వస్తువులు నిండి ఉన్నాయి. ఇవన్నీ దాదాపు రెండు నుండి మూడు నెలల పాటు ఒక కుటుంబానికి సరిపడా గ్రాసరీస్.

ఇది కూడా చదవండి : ఇప్పుడున్న హీరోల్లో అతనొక్కడే నన్ను ఆంటీ అని పిలుస్తాడు.. జయసుధ ఆసక్తికర కామెంట్స్

వేణు మాధవ్ ఉత్తేజ్‌తో మాట్లాడుతూ, ఇవన్నీ కలిపి సుమారు ఇరవై వేల రూపాయల లోపే అవుతాయి. కానీ, నేను ఈ ఆర్టిస్ట్‌కు ఇరవై ఐదు వేల రూపాయలు డబ్బుగా ఇస్తే, అవి ఒకటి రెండు రోజుల్లో ఖర్చైపోతాయి. అప్పుడు మళ్లీ అతని భార్య పిల్లలు ఆకలితోనే ఉంటారు. అందుకే, వారికి నిత్యావసరాలు అందిస్తే, కనీసం మూడు నెలల పాటు వారికి భోజనానికి ఎలాంటి లోటు ఉండదు. ఇది నేను చేసే అసలైన సహాయం అని చెప్పారు. అది విని ఉత్తేజ్ ఆశ్చర్యానికి లోనయ్యారట. వేణు మాధవ్  ఆలోచనాత్మకమైన, ఆచరణాత్మకమైన సహాయం ఉత్తేజ్‌ను ఎంతగానో ఆకట్టుకుంది. కేవలం డబ్బు ఇచ్చి చేతులు దులుపుకోకుండా, అవసరంలో ఉన్నవారికి నిజమైన భరోసా కల్పించిన వేణు మాధవ్ ఉదారత, ఆయనలోని మానవత్వాన్ని చాటిచెప్పిందని ఉత్తేజ్ తెలిపారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : అప్పుడు నా సినిమాలో నటించాడు.. ఇప్పుడు స్టార్ హీరో.. అతను ఎంత మారిపోయాడంటే

Venu Madhav

Venu Madhav

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
తినడానికి తిండి లేదు అంటే కారునిండా సరుకులు తెచ్చి ఇచ్చాడు..
తినడానికి తిండి లేదు అంటే కారునిండా సరుకులు తెచ్చి ఇచ్చాడు..
అమ్మాయి పిలిచిందని వెళ్లాడు..తిరిగి శవమై వచ్చిన టెకీ! ఏం జరిగిందో
అమ్మాయి పిలిచిందని వెళ్లాడు..తిరిగి శవమై వచ్చిన టెకీ! ఏం జరిగిందో
పోలీసులు అరెస్ట్ చేస్తే ఆ హీరో ఒక్క ఫోన్ కాల్ చేసి విడిపించారు
పోలీసులు అరెస్ట్ చేస్తే ఆ హీరో ఒక్క ఫోన్ కాల్ చేసి విడిపించారు
వందరోగాలను తరిమికొట్టే మునగాకు పొడి..ఎలా చేయాలో తెలుసా?
వందరోగాలను తరిమికొట్టే మునగాకు పొడి..ఎలా చేయాలో తెలుసా?
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు రాసినవారికి బిగ్ అప్డేట్.. ఫలితాల తేదీ
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు రాసినవారికి బిగ్ అప్డేట్.. ఫలితాల తేదీ
హమ్మయ్య.. ఏపీ, తెలంగాణలోని ఈ ప్రాంతాల్లో వర్షాలు..
హమ్మయ్య.. ఏపీ, తెలంగాణలోని ఈ ప్రాంతాల్లో వర్షాలు..
జెమిమా రోడ్రిగ్స్‌కు వాచ్‌మెన్ వార్నింగ్!
జెమిమా రోడ్రిగ్స్‌కు వాచ్‌మెన్ వార్నింగ్!
పవన్ కల్యాణ్‌పై చెడు అభిప్రాయం లేదు..ఆయన సినిమాలో విలన్‌గా చేస్తా
పవన్ కల్యాణ్‌పై చెడు అభిప్రాయం లేదు..ఆయన సినిమాలో విలన్‌గా చేస్తా
యూట్యూబ్‌ను ఊపేస్తున్న ఫోక్ సాంగ్..
యూట్యూబ్‌ను ఊపేస్తున్న ఫోక్ సాంగ్..
రాత పరీక్ష లేకుండా ఉద్యోగం పొందే ఛాన్స్.. APలో 529 ఉద్యోగాలు
రాత పరీక్ష లేకుండా ఉద్యోగం పొందే ఛాన్స్.. APలో 529 ఉద్యోగాలు