నన్ను హీరో అని చెప్పి.. తర్వాత కథ మార్చేశారు.. అందుకే సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది..
నందమూరి ఫ్యామిలీ నుంచి చాలా మంది హీరోలు ముఖ్యంగా బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ హీరోలుగా సక్సెస్ అయ్యారు. అలాగే తారక రత్న, హరికృష్ణ కూడా హీరోలుగా చేసి ఆకట్టుకున్నారు. అలాగే నందమూరి చైతన్య కృష్ణ కూడా హీరోగా సినిమాలు చేశారు.

నందమూరి చైతన్య కృష్ణ గతంలో ఒక ఇంటర్వ్యూలో తన సినీ రంగ ప్రవేశం, వ్యక్తిగత ప్రయాణంపై పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. సుమారు 20 సంవత్సరాలుగా తెర వెనుక ఉండిపోవడానికి గల కారణాలను ఆయన స్పష్టంగా వివరించారు. ఈ కాలంలో నటన వైపు దృష్టి సారించకపోవడానికి రెండు ప్రధాన కారణాలను పేర్కొన్నారు. మొదటి కారణం తన కుటుంబ వారసత్వ వ్యాపారం. చైతన్య కృష్ణ తాతగారు 1968లో నిర్మించిన రామ్మకృష్ణ 70ఎమ్ఎమ్ థియేటర్ నిర్వహణ బాధ్యతలు తన తండ్రి చూసుకున్న తర్వాత, ఆ బాధ్యతలను తాను స్వీకరించారని తెలిపారు. కుటుంబ ఆస్తిని జాగ్రత్తగా చూసుకోవాలనే ఉద్దేశ్యంతో థియేటర్ నిర్వహణపై దృష్టి సారించాల్సి వచ్చిందని పేర్కొన్నారు. రెండవ, ముఖ్యమైన కారణం తన తొలి సినిమా దమ్‌తో ఎదురైన చేదు అనుభవం.
ఇది కూడా చదవండి : కుర్రాళ్ల ఆల్ టైం ఫేవరెట్ మూవీ.. పెట్టింది రూ.4కోట్లు వచ్చింది రూ. 110కోట్లు.. ఇండస్ట్రీని షేక్ చేసిన చిన్న సినిమా
రాధికా బ్యానర్‌లో నిర్మించిన ఈ చిత్రంలో తనకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని, ఆ సినిమాను సరిగ్గా తీయడం రాలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మొదట, ఈ సినిమాలో తాను ముగ్గురు విద్యార్థులకు హీరో టైప్ పాత్రలు, జగపతి బాబుకి సమానమైన పాత్రలో నటిస్తానని చెప్పారని తెలిపారు. అయితే, షూటింగ్ ప్రక్రియలో తనకు తెలియకుండానే కథ మారిపోయిందని, ముగ్గురు విద్యార్థులను నాయకులుగా చేసి, అంతా గందరగోళం చేశారని చైతన్య కృష్ణ వివరించారు. ఈ మార్పుల వల్ల సినిమా ఫ్లాప్ అవ్వడమే కాకుండా, తన మొదటి చిత్రం అనుభవం చాలా బాధాకరంగా మారిందని అన్నారు. ఇది తనను ఎంతో నిరాశకు గురి చేసిందని, ఈ సంఘటన తర్వాత థియేటర్ వ్యాపారంపై మరింత దృష్టి పెట్టినట్లు తెలిపారు.
ఇది కూడా చదవండి : ఇంటర్వెల్ సీన్ మార్చేశారు.. కట్ చేస్తే ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టేసింది
ఆ తర్వాత, 2013-14 మధ్య కాలంలో సినీ పరిశ్రమ ఒక సంక్షోభాన్ని ఎదుర్కొందని చైతన్య కృష్ణ గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో పరిశ్రమలో హిట్లు చాలా తక్కువగా ఉండేవని, బడ్జెట్లు భారీగా పెరిగిపోయేవని, పైరసీ ప్రభావం కూడా తీవ్రంగా ఉండేదని ఆయన చెప్పారు. మంచి కథలు లభించనప్పుడు తాను నటనకు దూరంగా ఉండడమే మంచిదని నిర్ణయించుకున్నానని వివరించారు. కుటుంబ ఆస్తుల పంపకం గురించి మాట్లాడుతూ, తన తాతగారి ఆస్తులలో హోటళ్ళు, థియేటర్లు, స్టూడియోలు ఉన్నప్పటికీ, తనకు వారసత్వంగా రామ్మకృష్ణ 70ఎమ్ఎమ్ థియేటర్ మాత్రమే లభించిందని నందమూరి చైతన్య కృష్ణ స్పష్టం చేశారు. ఈ వారసత్వాన్ని జాగ్రత్తగా చూసుకోవడం తన బాధ్యతగా భావించినట్లు ఆయన తెలిపారు.
ఇది కూడా చదవండి : ఆ డాన్స్ ఏంటి అమ్మడు..! హ్యాపీ రీ రిలీజ్‌లో రచ్చ చేసిన హీరోయిన్.. థియేటర్ దద్దరిల్లిందిగా
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




