AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ హీరోకు కథ చెప్పడానికి వెళ్తే.. అలా మాట్లాడాడు.. కోపంతో అక్కడి నుంచి వచ్చేశా.: ఎస్వీ కృష్ణారెడ్డి

ఎస్.వీ కృష్ణారెడ్డి .. తెలుగు సినిమా చరిత్రలో మల్టీటాలెంటెడ్ డైరెక్టర్స్‌లో కృష్ణారెడ్డి ఒకరు. ఎన్నో అద్భుతమైన సినిమాలు అందించారు కృష్ణారెడ్డి. ఫ్యామిలీ సినిమాలకు ఆయన పెట్టింది పేరు. అలీతో యమలీల‌లాంటి సినిమా చేసి సూపర్ హిట్ అందుకున్నారు ఎస్.వీ కృష్ణారెడ్డి .

ఆ హీరోకు కథ చెప్పడానికి వెళ్తే.. అలా మాట్లాడాడు.. కోపంతో అక్కడి నుంచి వచ్చేశా.: ఎస్వీ కృష్ణారెడ్డి
Sv Krishnareddy
Rajeev Rayala
|

Updated on: Jun 21, 2026 | 7:01 AM

Share

1993లో విడుదలైన “రాజేంద్రుడు గజేంద్రుడు” చిత్రం తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసింది. ఈ సినిమాతో దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు. ఈ వినోదాత్మక చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. రాజేంద్రప్రసాద్, సౌందర్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా నిర్మాణ వెనుక దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు. గతంలో ఒక ఇంటర్వ్యూలో ఆయన ఆ అనుభవాలను పంచుకున్నారు. రాజేంద్రుడు గజేంద్రుడుకు ముందు, ఎస్వీ కృష్ణారెడ్డి తాను ఒక హీరోగా, మరో తమిళ నటుడితో కలిసి ఒక ద్విపాత్రాభినయ కథను రూపొందించాలని అనుకున్నారు. మాతృదేవోభవ వంటి విజవంతమైన చిత్రాలను అందించిన అజయ్ శాంతి దర్శకుడిగా, సత్యానంద్ రచయితగా ఎంపికయ్యారు. ఈ ప్రాజెక్టు కోసం పాటలు కూడా రికార్డ్‌ చేశారు. అయితే, ఆ సమయంలో చిరంజీవి ఇచ్చిన సలహా మేరకు, తమకు అది సరైన సమయం కాదని భావించి ఆ ప్రాజెక్టును పూర్తిగా విరమించుకోవాల్సి వచ్చిందని కృష్ణారెడ్డి అన్నారు.

ఆ తర్వాత, రాజేంద్రుడు గజేంద్రుడు కథకు ప్రాణం పోయాలని నిర్ణయించుకున్నారు. మొదట రాజేంద్రప్రసాద్‌ను సంప్రదించినప్పుడు, ఆయన కథకు అంగీకరించినప్పటికీ, కొత్త దర్శకుడిగా ఎస్వీ కృష్ణారెడ్డి అనుభవంపై కొంత సందేహం వ్యక్తం చేశారు. ప్రఖ్యాత ల్యాండ్‌డ్రాయింగ్ ఆర్టిస్ట్ జయదేవ్ చేత సన్నివేశాల బొమ్మలు వేయించి, ప్రతి సన్నివేశాన్ని క్షుణ్ణంగా వివరించినప్పటికీ, రాజేంద్రప్రసాద్ అప్పటికే నన్ను కాకుండా వేరే దర్శకుడిని చూస్తే బావుంటుందేమో అని తన అభిప్రాయాన్ని చెప్పారని కృష్ణారెడ్డి గుర్తు చేసుకున్నారు.

రాజేంద్రప్రసాద్‌లోని ఈ సందేహాన్ని గమనించిన ఎస్వీ కృష్ణారెడ్డి , ఒకవేళ రాజేంద్రప్రసాద్ ఒప్పుకోకపోతే, నరేష్‌ దగ్గరకు వెళ్తాను అని ధీమా వ్యక్తం చేశారు. అప్పటికి మంచి హిట్స్‌లో ఉన్న నరేష్‌ను సంప్రదించారు. కథ వినిపించి, అడ్వాన్సు ఇవ్వడానికి సిద్ధంగా ఉండగా, నరేష్ ఒక షరతు విధించారు. సినిమా బడ్జెట్ ఎక్కువ అవుతుంది. డబ్బింగ్‌ స్టేజ్‌కు వచ్చేసరికి నిర్మాతల దగ్గర డబ్బులు ఉండవు సార్, అందుకే నా పారితోషికం డబ్బింగ్‌కు ముందే క్లియర్ చేయాలి అని నరేష్‌ కోరారట. దీనిపై ఎస్వీ కృష్ణారెడ్డి తీవ్రంగా స్పందిస్తూ, “డబ్బింగ్‌కు డబ్బులు లేని పరిస్థితి వస్తుందని తెలిస్తే, అలాంటి సినిమా చేయడమే వద్దు సార్” అని కరాఖండిగా చెప్పి, అడ్వాన్స్‌ను ఇవ్వకుండా, ప్రాజెక్టును రద్దు చేసుకున్నానని చెప్పి అక్కడి నుంచి వచ్చేశారట.. నరేష్‌తో ఒప్పందం కుదరకపోవడంతో, ఎస్వీ కృష్ణారెడ్డి మళ్లీ రాజేంద్రప్రసాద్‌ను సంప్రదించారు. అంతకు ముందు కొబ్బరి బొండం వంటి విజవంతమైన చిత్రాలను కలిసి చేసిన నేపథ్యం ఉండటంతో, రాజేంద్రప్రసాద్ ఈసారి సినిమా చేయడానికి ఓకే అన్నారట. ఈ సినిమా నిర్మాణంలో రాజేంద్రప్రసాద్‌, ఏనుగు మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా పండిందని, రాజేంద్రప్రసాద్‌ ఎలిఫెంట్‌తో ఎంత అందంగా నటించారని కృష్ణారెడ్డి ప్రశంసించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us