AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇండస్ట్రీలో నాకు ఆమె తల్లితో సమానం.. నాకు లైఫ్ ఇచ్చింది: తాగుబోతు రమేష్

నటుడు తాగుబోతు రమేష్ తన సినీ ప్రయాణం గురించి, ముఖ్యంగా దర్శకులు సుకుమార్, నందిని రెడ్డిల పాత్ర గురించి వివరించారు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన జగడం తన మొదటి సినిమా అని, 300-400 మంది ఆడిషన్లలో తాను ఎంపికయ్యానని తెలిపారు. సుకుమార్ గారు తన టాలెంట్‌ను గుర్తించి అనేక సినిమాలలో అవకాశాలు కల్పించారని, నాన్నకు ప్రేమతో వంటి పెద్ద సినిమాలో స్టైలిష్ పాత్ర ఇచ్చి తనను లండన్ తీసుకెళ్లారని గుర్తుచేసుకున్నారు.

ఇండస్ట్రీలో నాకు ఆమె తల్లితో సమానం.. నాకు లైఫ్ ఇచ్చింది: తాగుబోతు రమేష్
Thagubothu Ramesh
Rajeev Rayala
|

Updated on: Nov 24, 2026 | 11:50 AM

Share

ప్రముఖ కమెడియన్ తాగుబోతు రమేష్ తన సినీ ప్రయాణం, అందుకు తోడ్పడిన కీలక వ్యక్తుల గురించి ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. తన కెరీర్‌లో దర్శకులు సుకుమార్, నందిని రెడ్డి, కృష్ణవంశీ, రాజమౌళిల పాత్రను ప్రస్తావిస్తూ, తన టాలెంట్‌ను గుర్తించి అవకాశాలు కల్పించినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఆ తర్వాత ఆయన అందుకున్న నంది అవార్డు తనకు ఎంతటి గుర్తింపును, సంతోషాన్ని ఇచ్చిందో వివరించారు. రమేష్ తన మొదటి సినిమా జగడంలో సుకుమార్ దర్శకత్వంలో అవకాశం రావడాన్ని గొప్ప విషయంగా అభివర్ణించారు. 300-400 మంది ఆడిషన్లలో ఎంపికవడం, ఆ వన్ ఇయర్ సుకుమార్ టీమ్‌లో ఉండటం తన అదృష్టంగా భావించారు. గోదావరిఖనిలో తన మొదటి సినిమాకు కట్టిన బ్యానర్‌లను ఆయన ఇంకా మర్చిపోలేనని అన్నారు. సుకుమార్ తన కెరీర్‌లో 100 పర్సెంట్ లవ్, కుమారి 21ఎఫ్, నాన్నకు ప్రేమతో వంటి పలు సినిమాలలో అవకాశం కల్పించారని గుర్తు చేసుకున్నారు.

నందిని రెడ్డి దర్శకత్వంలో వచ్చిన అలా మొదలైంది సినిమా తనకు లైఫ్ ఇచ్చిందని రమేష్ తెలిపారు. ఈ సినిమాతోనే తాగుబోతు రమేష్ అనే పేరు స్థిరపడిందని, ఇప్పటికీ ఆ స్థాయి సినిమా తనకు మళ్ళీ రాలేదని అన్నారు. ఇండస్ట్రీలో తన తల్లి నందిని రెడ్డి అని, తాను లేకుండా ఆమె సినిమా చేయదని చెప్పడం ద్వారా ఆమెతో తన అనుబంధాన్ని వెల్లడించారు. తన కెరీర్‌ను ప్రారంభించిన కృష్ణవంశీ గారి మహాత్మ గురించి కూడా ప్రస్తావించారు. తాగుబోతు పాత్రలకు పరిమితం కావడం పట్ల తాను ఫ్రస్ట్రేషన్‌కు గురయ్యానని రమేష్ చెప్పారు. ఈ సమయంలోనే సుకుమార్ గారు నాన్నకు ప్రేమతో సినిమాలో స్టైలిష్, ఇంగ్లీష్ మాట్లాడే పాత్ర ఇచ్చి లండన్ తీసుకెళ్లారని తెలిపారు. ఈ పాత్ర తనలోని వేరియేషన్‌ను చూపడానికి ఒక గొప్ప అవకాశం అని భావించారు. త్రూఅవుట్ స్టైలిష్‌గా కనిపించడం, ఇంగ్లీష్ డైలాగులు చెప్పడం తనకు మొదటిసారి అని వివరించారు. సుకుమార్ తనను ఎప్పుడూ ప్రోత్సహించేవారని, “టైమ్ వస్తుందిరా, నీకు డిఫరెంట్ రోల్స్ కూడా వస్తాయి” అని చెప్పేవారని గుర్తుచేసుకున్నారు.

తానుఅందుకున్న నంది అవార్డు తన జీవితంలో ఒక ముఖ్యమైన మైలురాయి అని రమేష్ పేర్కొన్నారు. గతంలో తన పాత్రలు అంత బలంగా లేవని, అందుకే తాను ఇంటర్వ్యూలు ఇవ్వడానికి ఇష్టపడేవాడిని కాదని, కానీ ఇప్పుడు ప్రభుత్వం తనను గుర్తించి నంది అవార్డు ఇవ్వడం తన ప్రయాణానికి అర్థం చేకూర్చిందని అన్నారు. “మనకు సినిమాలు లేనప్పుడు ఏం మాట్లాడతాం?” అని ప్రశ్నిస్తూ, అవార్డు వచ్చిన తర్వాత మాట్లాడటం సముచితంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. మహాత్మ సినిమా సమయంలో స్నేహితుడు మధు, దర్శకుడు చారి చెప్పిన “మన పని మాట్లాడాలి, మనం మాట్లాడొద్దు” అనే సూక్తిని ఆయన గుర్తు చేసుకున్నారు. ఇండస్ట్రీలో అవసరం ఉన్నప్పుడు మాత్రమే గుర్తించి, అవసరం లేనప్పుడు పక్కకు పెట్టే వాస్తవికతను చారి గారు చెప్పిన ఉదాహరణతో పంచుకున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us