AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Prices Today: బంగారం ధరల్లో భారీ కుదుపు..పేలిన మరో బాంబ్.. మళ్లీ అదే తీరు..

బంగారం, వెండి ధరల్లో భారీ కుదుపు మళ్లీ మొదలైంది. మొన్నటివరకు భారీగా దిగొచ్చిన ధరలు.. ఇప్పుడు మళ్లీ పెరుగుదల దిశగా దూసుకెళ్తున్నాయి. అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాలు దీనికి కారణంగా నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల గోల్డ్ రేట్లలో స్థిరత్వం కనిపించడం లేదు.

Gold Prices Today: బంగారం ధరల్లో భారీ కుదుపు..పేలిన మరో బాంబ్.. మళ్లీ అదే తీరు..
Gold Prices
Venkatrao Lella
|

Updated on: Nov 24, 2026 | 12:19 PM

Share

బంగారం కొనుగోలు చేయాలని చూస్తున్నారా.. అయితే ఇది చేదువార్త. పసిడి ధరలు మళ్లీ ఆకాశాన్నంటుతున్నాయి. గత వారంలో గోల్డ్ రేట్లు భారీగా పడిపోయి 9 నెలల కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. తులం బంగారంపై ఏకంగా రూ.13 వేలు తగ్గింది. కానీ కొత్త వారంలో సోమవారం నుంచి ధరలు ఎగబాకుతున్నాయి. అసలే పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి పరిణామం మింగుడు పడటం లేదు. గత వారంతో భారీగా డౌన్ కావడంతో.. నెలలో కూడా పడిపోతాయోమోనని అందరూ ఊహించారు. కానీ వరుస తగ్గదులకు బ్రేక్ పడటంతో నిరాశ చెందుతున్నారు. వరుసగా రెండో రోజు మంగళవారం కూడా ధరలు పుంజుకున్నాయి. మార్కెట్లు ప్రారంభమయ్యాక ధరల్లో మార్పలు చోటుచేసుకున్నాయి. నవంబర్ 24వ తేదీన దేశంలోని వివిధ ప్రధాన నగరాల్లో లేటెస్ట్ ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

నవంబర్ 24న గోల్డ్ ధరలివే..

-హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,27,800కు చేరుకుంది. ఇవాళ ఒక్కరోజే రూ.1240 పెరిగింది. ఇక 22 క్యారెట్ల రేటు రూ.1,17,150 వద్ద కొనసాగుతుండగా.. మంగళవారం ఏకంగా రూ.1150 మేర పుంజుకుంది. విజయవాడ, విశాఖపట్నంలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

-దేశ రాజధాని ఢిల్లీలో గోల్డ్ రేట్లలో మార్పులు ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,27,900 వద్ద కొనసాగుతుండగా.. నేడు రూ.1190 మేర పెరిగాయి. 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,17,300గా ఉంది.

-చెన్నై, బెంగళూరు నగరాల్లో 24 క్యారెట్ల బంగారం రేటు రూ.1,27,800, 22 క్యారెట్ల ధర రూ.1,17,150 వద్ద పలుకుతోంది.

సిల్వర్ ధరలు ఇవే..

బంగారంతో పోలిస్తే సిల్వర్ ధరలు మాత్రం భిన్నంగా కొనసాగుతున్నాయి. గోల్డ్ రేట్లు పెరుగుతుండగా.. వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇవాళ కూడా వెండి ధరలు స్ధిరంగా ఉన్నాయి. ధరల్లో ఎలాంటి మార్పులు లేవు. ప్రస్తుతం చెన్నైలో కిలో వెండి ధర రూ.1.75 లక్షల వద్ద కొనసాగుతోంది. హైదరాబాద్, ఢిల్లీలోననూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. బెంగళూరులోనూ ఇదే విధంగా స్థిరంగా ఉన్నాయి. అయితే అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాల వల్ల పసిడి ధరల్లో స్ధిరత్వం నెలకొనడం లేదు. ఫెడ్ వడ్డీ రేట్లను వచ్చే నెలలో ప్రకటించనుంది. అంతేకాకుండా అమెరికా ద్రవ్యోల్బణానికి సంబంధించి నివేదిక కూడా రానుంది. ఈ అంశాలు బంగారానికి మరింత ఆకర్షణను పెంచుతున్నట్లు ఆర్ధిక రంగ నిపుణులు చెబుతున్నారు.

Follow Us