AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వెండితెరపై మెరుస్తున్న యూ ట్యూబ్ బ్యూటీస్

వెండితెరపై మెరుస్తున్న యూ ట్యూబ్ బ్యూటీస్

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Jun 22, 2026 | 9:30 PM

Share

యూట్యూబ్, షార్ట్ ఫిల్మ్స్, ఫోక్ సాంగ్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న పలువురు తెలుగమ్మాయిలు ఇప్పుడు వెండితెరపై హీరోయిన్లుగా మెరిసేందుకు సిద్ధమవుతున్నారు. వైష్ణవి చైతన్య ‘బేబీ’ విజయంతో స్టార్‌గా మారగా, నాగదుర్గ, దేత్తడి హారిక, దీపిక పిల్లి కూడా వరుసగా సినీ అవకాశాలు అందుకుంటూ టాలీవుడ్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

ఇండస్ట్రీలో ఎవరి టైమ్ ఎప్పుడెలా టర్న్ అవుతుందో చెప్పడం కష్టం. అందుకే ఎవరినీ తక్కువంచనా వేయకూడదు. కావాలంటే చూడండి.. నిన్నమొన్నటి వరకు యూట్యూబ్‌లో షార్ట్ ఫిల్మ్స్, టీవీలో యాంకరింగ్ చేసుకున్న వాళ్లే ఇప్పుడు హీరోయిన్లుగా వచ్చేస్తున్నారు.. టాలెంట్ చూపించడానికి రెడీ అవుతున్నారు. మరి ఎవరా హీరోయిన్లు ఓసారి చూద్దామా..? ఇండస్ట్రీలో ఎవరికి ఎప్పుడు ఎలా బ్రేక్ వస్తుందో చెప్పలేం..? బేబీ అనే ఒక్క సినిమాతో వైష్ణవి చైతన్య జాతకమే మారిపోయింది. అప్పటి వరకు యూ ట్యూబ్‌లో కవర్ సాంగ్స్, షార్ట్ ఫిల్మ్స్ చేసుకునే ఈమె.. బేబీతో హీరోయిన్ అయిపోయారు. ఆ హిట్టుతో వరస ఛాన్సులు అందుకున్నారు. ప్రస్తుతం ఎపిక్‌తో పాటు తమిళంలో ఆర్యతో ఓ సినిమా చేస్తున్నారు. దాంతో పాటు మరో రెండు మూడు ఆఫర్స్ ఉన్నాయి. తాజాగా మరో యూ ట్యూబ్ బ్యూటీ హీరోయిన్ అయిపోయారు. ఆమె ఎవరో కాదు.. ఫోక్ సాంగ్స్‌తో సూపర్ ఫాలోయింగ్ తెచ్చుకున్న నాగదుర్గ. ప్రియదర్శి హీరోగా వంశీ రెడ్డి దర్శకత్వంలో సుకుమార్ రైటింగ్స్, బన్నీ వాస్ కలిసి నిర్మిస్తున్న సినిమాలో నాగదుర్గ హీరోయిన్‌గా ఎంపికయ్యారు. తమిళంలో ఆల్రెడీ లవ్.. ఓ లవ్ అనే సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నారు ఈ బ్యూటీ. యూ ట్యూబ్ బ్యూటీ దేత్తడి హారిక కూడా బేబీ ఫేమ్ సాయి రాజేష్, SKN కలిసి నిర్మిస్తున్న సినిమాతో హీరోయిన్‌గా లాంఛ్ అవుతున్నారు. ఇందులో సంతోష్ శోభన్ హీరోగా నటిస్తున్నారు. యాంకర్ దీపిక పిల్లి గతేడాది ప్రదీప్ హీరోగా నటించిన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయితో హీరోయిన్ అయ్యారు. మొత్తానికి యూ ట్యూబ్ నుంచి నేరుగా వెండితెరపై వెలిగిపోవడానికి వచ్చేస్తున్నారు ఈ తెలుగమ్మాయిలు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఖాళీగా ఓలా.. అయినా ఉబర్‌ కోసం అరగంట వెయిటింగ్‌! బెంగళూరులో వింత ఘటన

11 ఏళ్లకే యూకే యూత్ పార్లమెంట్ సభ్యురాలిగా రికార్డ్‌.. వైజాగ్ టు లండన్ కలశ నాయుడు ప్రయాణం

ఉద్యోగితో రూ. 2.5 లక్షల ఫిట్‌నెస్ బెట్ లో ఓడిన జెరోదా బాస్

ఫోన్‌ దొంగిలించి పారిపోతూ కుప్పకూలిన దొంగ.. క్షణాల్లో ప్రాణాలు గాల్లో..

వీడు మామూలోడు కాదు.. పగలు ఇళ్లకు రంగులు.. రాత్రయితే చాలు..

Published on: Jun 22, 2026 09:29 PM
Follow Us