AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఉద్యోగాల కోసం ఎదురుచూసే వారికి గుడ్‌న్యూస్.. 15,982 పోస్ట్‌లకు నోటిఫికేషన్!

రాష్ట్రంలో అంగన్‌వాడీ పోస్ట్‌ల కోసం ఎదురుచూస్తున్న వారికి ఇదో గుడ్‌న్యూస్ అనే చెప్పాలి. తాజాగా రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే జిల్లాల్లోని ఐసీడీఎస్ ప్రాజెక్టుల వారీగా మొత్తం 15,982 ఖాళీలను గుర్తించిన శిశుసంక్షేమ శాఖ.. త్వరలోను ఈ ఖాళీల భర్తీని నోటీఫికేషన్ విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది.

Telangana: ఉద్యోగాల కోసం ఎదురుచూసే వారికి గుడ్‌న్యూస్.. 15,982 పోస్ట్‌లకు నోటిఫికేషన్!
Ts Anganwadi Notification 2026
Anand T
|

Updated on: Jun 23, 2026 | 8:55 AM

Share

రాష్ట్రంలో అంగన్‌వాడీ పోస్టుల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఇదొక శుభవార్త. తాజాగా రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే జిల్లాల్లోని ఐసీడీఎస్ (ICDS) ప్రాజెక్టుల వారీగా మొత్తం 15,982 ఖాళీలను మహిళా శిశు సంక్షేమ శాఖ గుర్తించింది. త్వరలోనే ఈ ఖాళీల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కానుంది.ఇప్పటికే పెద్దపల్లి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో అంగన్‌వాడీ టీచర్లు, సహాయకుల (హెల్పర్స్) పోస్టులకు ఆయా జిల్లాల కలెక్టర్లు నోటిఫికేషన్లు జారీ చేశారు. త్వరలోనే మిగిలిన అన్ని జిల్లాల్లో కూడా ఇదే తరహాలో ఉద్యోగ ప్రకటనలు విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక

అంగన్‌వాడీ ఉద్యోగుల ఎంపిక కోసం ఈసారి ప్రభుత్వం సరికొత్త విధానాన్ని అమలు చేస్తోంది. గతంలో కంటే భిన్నంగా.. అంగన్‌వాడీ టీచర్, సహాయకుల పోస్టుల భర్తీకి ఇంటర్మీడియట్ విద్యార్హతతో పాటు ఇంటర్వ్యూను తప్పనిసరి చేసింది. ఈ విధానంలోనే పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం ఇప్పటికే అనుమతులు కూడా ఇచ్చింది. ఈ మేరకు ఇంటర్వ్యూ విధానానికి అనుమతి తెలుపుతూ జీవో నెం.4, మార్కుల వెయిటేజీకి సంబంధించి జీవో నెం.6ను ప్రభుత్వం జారీ చేసింది.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఖాళీలు

ఇక రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఖాళీలు చూసుకుంటే.. మల్టీజోన్‌-1 పరిధిలో మొత్తం 20,584 అంగన్‌వాడీ కేంద్రాలు ఉండగా.. వీటిలో టీచర్‌ పోస్ట్‌ 1,853, సహాయకుల పోస్ట్‌లు- 7,737 ఉన్నాయి. ఇక మల్టీజోన్‌-2 పరిధిలో చూసుకుంటే.. ఇక్కడ మొత్తం 15,197 అంగన్‌వాడీ కేంద్రాలు ఉండగా.. వీటిలో టీచర్‌ పోస్ట్‌లు 1,247, సహాయకుల పోస్ట్‌లు- 5145 ఖాళీగా ఉన్నాయి.

అంగన్‌వాడీ ఉద్యోగాలకు కావలసిన అర్హతలు

  • స్థానికత: దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత గ్రామం లేదా వార్డులో స్థానికులై ఉండాలి.

  • ప్రత్యేక ప్రాంతాలు: గిరిజన, ఆదివాసీ తండాలు, గూడేలలోని పోస్టులకు స్థానిక ఎస్సీ, ఎస్టీ మహిళలు మాత్రమే అర్హులు.

  • విద్యార్హత: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు తప్పనిసరిగా ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి.

  • ఎంపిక విధానం: జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు జరుగుతాయి.

  • ఇంటర్వ్యూ మార్కులు: ఇంటర్వ్యూకు మొత్తం 10 మార్కులు కేటాయించారు. అభ్యర్థుల ప్రతిభ ఆధారంగా ఈ మార్కులను ఇస్తారు

మరిన్ని కెరీర్ అండ్ ఉద్యోగ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
అద్భుతమైన హెల్త్ ఫీచర్లతో బోట్‌ నుంచి స్మార్ట్‌ వేరబుల్‌
అద్భుతమైన హెల్త్ ఫీచర్లతో బోట్‌ నుంచి స్మార్ట్‌ వేరబుల్‌
తెలుగులో బ్యాన్ చేశారు.. కట్ చేస్తే.. బిగ్ బాస్‏లోకి ఎంట్రీ..
తెలుగులో బ్యాన్ చేశారు.. కట్ చేస్తే.. బిగ్ బాస్‏లోకి ఎంట్రీ..
డీమార్ట్ ఊహించని నిర్ణయం.. వాటి దెబ్బకు 7 నగరాల్లో షట్టర్ క్లోజ్
డీమార్ట్ ఊహించని నిర్ణయం.. వాటి దెబ్బకు 7 నగరాల్లో షట్టర్ క్లోజ్
'కన్నీళ్లతో మా బాధను ముడిపెట్టొద్దు'.. జానకి మనవరాలు ఎమోషనల్
'కన్నీళ్లతో మా బాధను ముడిపెట్టొద్దు'.. జానకి మనవరాలు ఎమోషనల్
కొబ్బరి నూనె తలస్నానానికి ముందా, తర్వాతా వాడాలా? జుట్టు ఆరోగ్యంగా
కొబ్బరి నూనె తలస్నానానికి ముందా, తర్వాతా వాడాలా? జుట్టు ఆరోగ్యంగా
ముద్రగడ పద్మనాభం మృతి.. పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్!
ముద్రగడ పద్మనాభం మృతి.. పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్!
ఎంతకు తెగించార్రా.. మఫ్టీ పోలీసుల పేరుతో రైతుల నిలువుదోపిడీ..
ఎంతకు తెగించార్రా.. మఫ్టీ పోలీసుల పేరుతో రైతుల నిలువుదోపిడీ..
కళ్లు కాయలుకాసేలా ఎదురుచూస్తే.. కాసేపైనా ఆడకపోతిరి!
కళ్లు కాయలుకాసేలా ఎదురుచూస్తే.. కాసేపైనా ఆడకపోతిరి!
కోర్టులో జడ్జి కుర్చీపైనే క్షుద్రపూజలు, ఆవాలు చల్లుతూ చేతబడి..
కోర్టులో జడ్జి కుర్చీపైనే క్షుద్రపూజలు, ఆవాలు చల్లుతూ చేతబడి..
'బలగం' మూవీని రిజెక్ట్ చేసిన హీరోలు, హీరోయిన్స్ ఎవరో తెలుసా?
'బలగం' మూవీని రిజెక్ట్ చేసిన హీరోలు, హీరోయిన్స్ ఎవరో తెలుసా?
రజినీ హిట్ మంత్రం ఇదే.. ప్రతి సినిమాలో స్టార్‌ల సైన్యమే!
రజినీ హిట్ మంత్రం ఇదే.. ప్రతి సినిమాలో స్టార్‌ల సైన్యమే!
100 ఏళ్ళ తెలుగు ఇండస్ట్రీలో సమంత అరుదైన రికార్డ్
100 ఏళ్ళ తెలుగు ఇండస్ట్రీలో సమంత అరుదైన రికార్డ్
జపాన్‌లో తెలుగు హీరోలదే మ్యాజిక్.. ‘ధురంధర్’ ఎందుకు తేలిపోయింది?
జపాన్‌లో తెలుగు హీరోలదే మ్యాజిక్.. ‘ధురంధర్’ ఎందుకు తేలిపోయింది?
టికెట్ రేట్లే హిట్ మంత్రమా? ‘లెనిన్’తో మళ్లీ మొదలైన టాలీవుడ్ చర్చ
టికెట్ రేట్లే హిట్ మంత్రమా? ‘లెనిన్’తో మళ్లీ మొదలైన టాలీవుడ్ చర్చ
స్టైల్ మార్చేస్తున్న లెక్కల మాస్టారు.. చరణ్ కోసం కొత్త ప్లాన్!
స్టైల్ మార్చేస్తున్న లెక్కల మాస్టారు.. చరణ్ కోసం కొత్త ప్లాన్!
ఆలయ గర్భగుడి తెరవగానే షాకింగ్‌ దృశ్యం..
ఆలయ గర్భగుడి తెరవగానే షాకింగ్‌ దృశ్యం..
మనిషి ఊపిరి ఆగిపోయే చోట అద్భుతం మహా శాస్త్రవేత్తలకే సవాల్
మనిషి ఊపిరి ఆగిపోయే చోట అద్భుతం మహా శాస్త్రవేత్తలకే సవాల్
బీఎస్‌ఎన్‌ఎల్‌ సంచలనం.. సరికొత్త శాటిలైట్‌ ఫోన్‌ వచ్చేసింది
బీఎస్‌ఎన్‌ఎల్‌ సంచలనం.. సరికొత్త శాటిలైట్‌ ఫోన్‌ వచ్చేసింది
పాతికేళ్ల తర్వాత అప్పు తీర్చడానికి కేరళ నుంచి తెలంగాణకు
పాతికేళ్ల తర్వాత అప్పు తీర్చడానికి కేరళ నుంచి తెలంగాణకు
స్కూటీ ఇంజిన్‌లో వింతశబ్దాలు..తృటిలో తప్పిన ప్రమాదం
స్కూటీ ఇంజిన్‌లో వింతశబ్దాలు..తృటిలో తప్పిన ప్రమాదం