సాయిబాబా ఆలయాలకు నిధులు ఇవ్వలేమంటూ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. తిరుమల శ్రీవాణి ట్రస్ట్ నిధులను హిందూ ఆలయాల నిర్మాణాలకే ఉపయోగిస్తామని, సాయిబాబా ఆలయాలకు ఆగమ శాస్త్ర విధానాలు పాటించనందున, అన్య మతస్తులు కూడా సందర్శిస్తున్నందున నిధులు కేటాయించలేమని ఆయన స్పష్టం చేశారు.