AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మంగళవారం నాడు కొత్త పనులు ప్రారంభించవచ్చా? శాస్త్రం ఏం చెబుతోంది?

Tuesday auspiciousness: మంగళవారం గురించి ప్రచారంలో ఉన్న అపోహలకు భిన్నంగా, నిజానికి ఇది మంచి పనులకు అనువైన రోజు అని శాస్త్రం చెబుతోంది. ఈ రోజున చేసే శుభ కార్యాలు, పెట్టుబడులు, కొనుగోళ్లు మరింత వృద్ధి చెందుతాయని పురాణాలు సూచిస్తున్నాయి. మంచి పనులు ప్రారంభించడానికి ప్రత్యేక ముహూర్తాలు చూడనవసరం లేదు.

మంగళవారం నాడు కొత్త పనులు ప్రారంభించవచ్చా? శాస్త్రం ఏం చెబుతోంది?
Tuesday Auspiciousness
Rajashekher G
|

Updated on: Jun 22, 2026 | 10:10 PM

Share

సాధారణంగా మంగళవారం అనగానే చాలామందికి ఒక రకమైన అశుభ భావన కలుగుతుంది. మంగళవారం నాడు ఏ పనులు ప్రారంభించినా అరిష్టమని, ఆ రోజున మంచి కార్యాలను చేయకూడదని తరతరాలుగా ఒక నమ్మకం ప్రచారంలో ఉంది. దీనికి ప్రధాన కారణం, గతంలో పెద్దలు చెప్పిన మాటలను అపార్థం చేసుకోవడమే. పనికిమాలిన, చెడు పనులు చేయవద్దని చెప్పినప్పుడు, దానిని మంగళవారమే పనికిరాదని తప్పుగా అర్థం చేసుకున్నారు. దీనితో ప్రజలు మంగళవారం అంటే భూత ప్రేత పిశాచాలు తిరిగే రోజేమో అని భయపడిపోయారు.

మంచి పనులనే చేయాలి..

అయితే, శాస్త్రం మాత్రం దీనికి పూర్తిగా విరుద్ధంగా చెబుతోంది. మంగళవారం నాడు మంచి పనులనే చేయాలని స్పష్టంగా సూచిస్తుంది. ఈ రోజున మనం చేసే శుభ కార్యాలు, పెట్టుబడులు, కొనుగోళ్లు శుభాన్ని, వృద్ధిని తీసుకువస్తాయని పురాణాలు చెబుతున్నాయి. ఉదాహరణకు, మంగళవారం నాడు బ్యాంకులో కొంత డబ్బు వేస్తే, త్వరలోనే మళ్లీ ఎక్కువ డబ్బులు వేసే అవకాశం కలుగుతుందట. అదే విధంగా, ఈ రోజున ఒక జత గాజులు కొనుక్కుంటే, త్వరలో ఇంకో జత సౌభాగ్యకరమైన గాజులను కొనుక్కునే యోగం వస్తుందని పెద్దలు చెబుతారు.

ఏ పనులకు దూరం ఉండాలి..?

చెడు పనులు, పనికిమాలిన పనులు చేయకూడదు కానీ, మంచి పనులు మంగళవారం రోజున బ్రహ్మాండంగా ప్రారంభించవచ్చని శాస్త్రం సారాంశం. మంచి పనులు చేయడానికి మంచి ముహూర్తం చూడనవసరం లేదు. మంచి పనిని ఎప్పుడైనా ప్రారంభించవచ్చని ఈ ఆధ్యాత్మిక ప్రవచనం స్పష్టం చేస్తోంది. ఈ సందేశం మంగళవారం గురించిన అపోహలను తొలగిస్తుంది.

ఇవి కూడా చదవండి

మంగళవారం హనుమాన్ పూజ..

హిందూ సంప్రదాయంలో మంగళవారం హనుమంతుడికి అత్యంత ప్రీతికరమైన రోజుగా భావిస్తారు. ఈ రోజు హనుమాన్ పూజ, హనుమాన్ చాలీసా పారాయణం, సింధూరార్చన చేయడం వల్ల ధైర్యం, ఆత్మవిశ్వాసం, శత్రు బాధల నుంచి రక్షణ లభిస్తుందని విశ్వాసం. మంగళవారం హనుమంతుడిని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తే జీవితంలో సానుకూల మార్పులు, విజయాలు, శుభఫలితాలు కలుగుతాయని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి.

Follow Us