Andhra Pradesh: ఏపీలో ఈ నెల 26న హాలీడే.. ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఎక్కడెక్కడంటే..
ఏపీ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల క్రమంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 26వ తేదీన సెలవు ప్రకటించింది. అయితే ఈ సెలవు రాష్ట్రవ్యాప్తంగా వర్తించదు. కేవలం ఎన్నికలు జరిగే ప్రాంతంలో మాత్రమే వర్తిస్తుంది. ఈ నెల 26న 23 స్థానాలకు పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి.

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల క్రమంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 26వ తేదీన సెలవు ప్రకటించింది. 23 పట్టణ స్థానిక సంస్థల పరిధిలో ఈ సెలవు వర్తించనుంది. ఆ రోజున ఎన్నికలు జరిగే కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల పరిధిలో సెలవులు ఇచ్చింది. ప్రభుత్వ కార్యాలయాలతో పాటు స్థానిక ప్రభుత్వ సంస్థల ఉద్యోగులు, ప్రైవేట్ సంస్థల ఉద్యోగులకు ఈ సెలవు ప్రకటిస్తున్నట్లు ఉత్తర్వుల్లో జారీ చేసింది. ప్రతీఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ఈ సెలవు ప్రకటించాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికలు జరగనున్న 23 ప్రాంతాల్లో తప్పనిసరిగా ఈ ఆదేశాలు అమలు అయ్యేలా చూడాలని సూచించింది.
నవంబర్ 26వ తేదీన ఏపీలోని 4 నగరపాలక సంస్థలు, 19 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 23 పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఆయా ప్రాంతాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్, విద్యాసంస్థలకు ఈ సెలవు వర్తించనుంది. ప్రతీఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేలా అవకాశం కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. వేతనంతో కూడిన సెలవు ప్రకటించాలని ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్రవ్యాప్తంగా మిగతా ప్రాంతాల్లో యథావిధిగా కార్యకలాపాలు కొనసాగనున్నాయి. మిగతా ప్రాంతాలకు ఈ సెలవు వర్తించదు.
శ్రీకాకుళం, కాకినాడ, రాజమహేంద్రవరం, మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థలతో పాటు 19 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు నవంబర్ 26న పోలింగ్ నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. అలాగే ఇదే రోజు 26 జిల్లాల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటలకు పోలింగ్ జరగనుంది. అటు ప్రభుత్వ శాఖలకు చెందిన వాహనాలను ఎన్నికల విధుల కోసం జిల్లా కలెక్టర్లకు అందించాలని ప్రభుత్వం మరో ఉత్తర్వుల్లో పేర్కొంది.
