AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఏపీకి 7 వేల కోట్ల సాయం అందించండి.. నిర్మలా సీతారామన్‌తో సీఎం చంద్రబాబు భేటీ

వరుస తుఫాన్ల దెబ్బకు అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్‌కు తక్షణమే అండగా నిలవాలని కేంద్ర ప్రభుత్వాన్ని సీఎం చంద్రబాబు కోరారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయిన చంద్రబాబు.. రాష్ట్రానికి రూ. 7 వేల కోట్ల తక్షణ సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించి పలు కీలక అంశాలపై ఈ భేటీలో చర్చించారు.

Andhra Pradesh: ఏపీకి 7 వేల కోట్ల సాయం అందించండి.. నిర్మలా సీతారామన్‌తో సీఎం చంద్రబాబు భేటీ
Ap Cm Chandrababu Meets Nirmala Sitharaman
Gopikrishna Meka
| Edited By: |

Updated on: Nov 17, 2026 | 6:42 PM

Share

వరుస తుఫాన్లు, ఎల్‌నినో పరిస్థితులతో అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకోవాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశమైన సీఎం చంద్రబాబు.. రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు, వరద నష్టాలు మరియు వివిధ ప్రాజెక్టులకు నిధుల కేటాయింపుపై విస్తృతంగా చర్చించారు. ఇటీవల రాష్ట్రాన్ని కుదిపేసిన అర్నబ్, మురసు తుఫాన్ల వల్ల రాష్ట్రానికి రూ.7 వేల కోట్లకు పైగా భారీ నష్టం వాటిల్లినట్లు సీఎం స్పష్టం చేశారు. ప్రాథమిక అంచనాల వివరాలను ఇప్పటికే కేంద్రానికి సమర్పించినట్లు గుర్తుచేస్తూ, ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో ఆదుకునేందుకు వీలుగా కేంద్రం నుంచి తక్షణ ఆర్థిక సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు.

తుఫాన్ల తాకిడితో తీవ్రంగా దెబ్బతిన్న ఏపీ

రెండు భారీ తుఫాన్ల ప్రభావంతో వ్యవసాయ రంగం తీవ్రంగా నష్టపోయిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఎల్‌నినో పరిస్థితులు ఉన్నప్పటికీ, రైతులను ఆదుకునేందుకు పట్టిసీమ ద్వారా సాగునీరు అందించామని.. అయితే దురదృష్టవశాత్తు తుఫాన్ల తాకిడికి చేతికి వచ్చిన పంట నీటిపాలైందని వివరించారు. ముఖ్యంగా తీర ప్రాంతాల్లో విద్యుత్ వ్యవస్థతో పాటు మౌలిక వసతులు భారీగా దెబ్బతిన్నాయని తెలిపారు. నష్టాలను అంచనా వేసేందుకు ఇప్పటికే కేంద్ర బృందాలు రాష్ట్రంలో పర్యటించాయని, వీలైనంత త్వరగా నివేదిక అందిస్తాయని పేర్కొన్నారు. రాష్ట్రానికి తక్షణ సాయం అందితే ఆర్థికంగా ఎంతో వెసులుబాటు కలుగుతుందని తెలిపారు.

రాయలసీమ హార్టికల్చర్ హబ్, విశాఖ ఎకనామిక్ రీజియన్‌పై చర్చ

ఈ భేటీలో రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికలపై కూడా ప్రధానంగా చర్చ జరిగింది. విశాఖ, అమరావతి, తిరుపతి రీజియన్ల వారీగా సమగ్ర ఆర్థికాభివృద్ధికి ప్రణాళికలు రూపొందించినట్లు సీఎం తెలిపారు. రాయలసీమ ప్రాంత అభివృద్ధికి కీలకమైన ఈ హబ్‌కు సంబంధించి ఇప్పటికే కేంద్ర ఆర్థిక మంత్రి శంకుస్థాపన చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ ప్రాజెక్టులో భాగంగా గ్రామాలకు రోడ్ల నెట్‌వర్క్, ఇరిగేషన్ అభివృద్ధి, డ్రిప్ ఇరిగేషన్ వంటి పనులకు అవసరమైన నిధులను విడుదల చేయాలని కోరారు. విశాఖ రీజియన్ శరవేగంగా అభివృద్ధి చెందుతోందని, దీనికి కేంద్రం మరింత సహకారం అందిస్తే అభివృద్ధి వేగం పుంజుకుంటుందని చెప్పారు. అలాగే ఇటీవల విశాఖలో విజయవంతంగా ముగిసిన సీఐఐ భాగస్వామ్య సదస్సులో తీసుకున్న నిర్ణయాలు, వచ్చిన పెట్టుబడుల వివరాలను నిర్మలా సీతారామన్‌కు వివరించారు.

Follow Us