ఏందీ మేడమ్.. సీరియల్లో  పద్దతిగా.. నెట్టింట గత్తరలేపుతున్నారు.. 

Rajitha Chanti

Pic credit - Instagram

22 Jun 2026

బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి జ్యోతి పూర్వాజ్ తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

ఎప్పుడూ ట్రెడిషనల్ అండ్ గ్లామరస్ లుక్స్‌తో ప్రేక్షకులను అలరించే ఈ బ్యూటీ, ఈసారి గులాబీ రంగు చీరలో మెరిసిపోతూ అభిమానులను మంత్రముగ్ధులను చేస్తోంది

ఈ ఫోటోలలో జ్యోతి పూర్వాజ్ లుక్ చూస్తుంటే అచ్చం దేవకన్యలా ఉందంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. లేటేస్ట్ లుక్స్ చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్. 

పలుచటి పింక్ శారీలో తన వయ్యారాలను ప్రదర్శిస్తూ, ఆకట్టుకునే నవ్వులతో ఆమె ఇచ్చిన ఫోజులు కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. ఈ ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి.

సాధారణంగా సీరియల్స్‌లో పద్ధతిగా కనిపించే జ్యోతి, బయట ఇలాంటి గ్లామరస్ ఫోటో షూట్స్‌తో తన ఫాలోయింగ్‌ను మరింత పెంచుకుంటోంది. 

 జ్యోతి పూర్వాజ్ సోషల్ మీడియా వేదికగా ఫ్యాషన్ సెన్స్‌లోనూ ముందుంటోంది. ఆమె ఎంచుకునే దుస్తులు, మేకప్, హెయిర్ స్టైల్ ఎప్పుడూ ట్రెండీగా ఉంటాయి.

ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ లేటెస్ట్ ఫోటో గ్యాలరీని చూస్తుంటే, జ్యోతి తన ఫోటోలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఏమాత్రం తగ్గడం లేదని చెప్పాలి.

ఈ పింక్ శారీ లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది. ప్రస్తుతం సీరియల్స్ మానేసిన జ్యోతి.. ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉంటుంది.