శ్రీలీల గ్లామర్ సీక్రెట్ ఇదే.. ఆ ఒక్క అలవాటే తనను మార్చేసిందట!
22-06-2026
Pic credit - Instagram
Phani Ch
శ్రీలీల గురించి తెలుగు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు.. మొన్నటి వరకు చేతినిండా సినిమాలతో కెరీర్ పరంగా దూసుకెళ్లింది ముద్దుగుమ్మ.
ఓవైపు ఎంబీబీఎస్ చదువుతూనే మరోవైపు టాప్ హీరోల సరసన ఆఫర్స్ సొంతం చేసుకుంటూ టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది.
మొదటి సినిమాతోనే మంచి హాట్ టాపిక్ గా మారింది. ఆ తర్వాత మాస్ మహారాజ్ "ధమాకా" టాలీవుడ్ నిజమైన ధమాకా అనిపించుకుంది.
టాలీవుడ్ క్రేజీ బ్యూటీ శ్రీలీల అందం, ఎనర్జీ వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటో తెలుసా? ముంబైలో జరిగిన యోగా దినోత్సవ వేడుకల్లో ఆమె స్వయంగా ఈ ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది.
శ్రీలీల తన గ్లామర్ మరియు అద్భుతమైన ఫిట్‌నెస్ కోసం రోజూ చేసే ఒక చిన్న అలవాటే తనను ఇంత అందంగా, ఆరోగ్యంగా ఉంచుతోందని అభిమానులతో పంచుకుంది.
ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. రోజూ కేవలం 15 నుండి 20 నిమిషాలు యోగా సాధన చేయడమే తన ఫిట్‌నెస్ సీక్రెట్. ఇది తన జీవితాన్ని పూర్తిగా మార్చేసిందని చెప్పింది.
యోగా అనేది కేవలం శరీరానికి సంబంధించిన వ్యాయామం మాత్రమే కాదని, అది మనసుకు కూడా ఎంతో ప్రశాంతతను, గొప్ప శక్తిని ఇస్తుందని శ్రీలీల వివరించింది.