AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

FasTag: మీ ఫాస్టాగ్ పని చేయడం లేదా..? ఈ చిన్న పని చేస్తే మీ ప్రాబ్లం క్లియర్..

మీ వాహనంపై అతికించిన ఫాస్టాగ్ పని చేయడం లేదా..? టోల్ గేట్ల వద్ద స్కానింగ్ అవ్వడం లేదా..? టోల్ ఫీజు చెల్లించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా..? అయితే కేంద్ర ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. ఫాస్టాగ్ పనిచేయనప్పుడు ఏం చేయాలనే సూచనలు కూడా జారీ చేసింది.

FasTag: మీ ఫాస్టాగ్ పని చేయడం లేదా..? ఈ చిన్న పని చేస్తే మీ ప్రాబ్లం క్లియర్..
Fasttag
Venkatrao Lella
|

Updated on: May 26, 2026 | 2:46 PM

Share

టోల్ గేట్ల వద్ద రద్దీని తగ్గించేందుకు, వాహనదారుల సమయం ఆదా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఫాస్టాగ్ తప్పనిసరి చేసింది. టోల్ ప్లాజాల వద్ద నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు ఇటీవల నగదు చెల్లింపులను నిషేధించింది. కేవలం ఫాస్టాగ్ లేదా యూపీఐ ద్వారా టోల్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. డిజిటల్ ఇండియాలో భాగంగా కేంద్రం ఇటీవల ఈ నిర్ణయానికి శ్రీకారం చుట్టింది. అయితే ఫాస్టాగ్ పని చేయకపోతే ఏం చేయాలి? అనే ప్రశ్న చాలమందికి ఉంటుంది. అలాంటప్పుడు టోల్ ఛార్జి ఎలా చెల్లించాలి? అని చాలామంది డౌట్ పడుతుంటారు. అలాంటి దానికి సమాధానాలు ఇందులో చూద్దాం.

ఎప్పుడెప్పుడు పని చేయవంటే..?

-వెహికల్స్ విండ్ షీల్డ్ తరచుగా శుభ్రం చేసుకుంటూ ఉండాలి

-కొంతమంది విండ్ షిల్డ్‌న గట్టిగా రుద్దడం వల్ల ఫాస్టాగ్‌లోని ఆర్‌ఎఫ్‌ఐడీ చిప్ దెబ్బతినడం వల్ల టోల్ గేట్ల వద్ద స్కానర్లు రీడ్ చేయడంలో సమస్యలు తలెత్తుతాయి.

-ఇక ఎండ, దుమ్మ, ధూళి, వర్షం లాంటి సమయాల్లో చిప్‌ను స్కానర్లు రీడ్ చేయలేవు. ఇలాంటి సమయంలో టోల్ ప్లాజాల వద్ద ఆలస్యం అవుతుంది

-ఇక చాలా ఏళ్ల నుంచి ఉపయోగిస్తున్న పాత ఫాస్టాగ్‌లు సరిగ్గా పనిచేయవు

-ఐదేళ్లకుపైబడి ఉపయోగిస్తున్న ఫాస్టాగ్‌లు పనిచేయవు

-తరచుగా ఫాస్టాగ్ స్కాన్ సమస్యలు ఎదుర్కొంటన్నా మీరు దానిని మార్చుకోవాలి

ఏం చేయాలంటే..?

-మీరు ఫాస్టాగ్‌లో తరచుగా సమస్యలు ఎదర్కొంటుంటే మీకు ఫాస్టాగ్ జారీ చేసిన బ్యాంకులను సంప్రదించండి

-మీ ఫాస్టాగ్ స్థానంలో కొత్తది తీసుకోండి

-కొత్త ఫాస్టాగ్ తీసుకోవడం వల్ల మీ సమస్య తీరుతుంది. టోల్ గేట్ల వద్ద స్కానర్ రీడింగ్ సమస్యలు ఉండవు

ఈ పనులు చేయకండి

-అద్దంపై ఫాస్టాగ్ ఉన్న ప్రాంతాన్ని గట్టిగా రుద్దకండి

-ఫాస్టాగ్ తీసి మళ్లీ అతికించడం లేదా వంచడం లాంటి పనులు చేయకండి

-ఇక ఫాస్టాగ్‌పై ఇతర సన్ ఫిల్మ్‌లు, స్టిక్కర్లు ఉంచకండి

Follow Us