AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 10 Telugu : గతేడాది వైల్డ్ కార్డ్‏లో రమ్మన్నారు.. ఇప్పుడు కూడా కాల్ వచ్చింది.. సోషల్ మీడియా సెన్సేషన్..

బుల్లితెరపై బిగ్ బాస్ 10 తెలుగు సందడి మొదలైంది. ఇప్పటికే సోషల్ మీడియాలో పలువురు తారలు రాబోతున్నారనే చర్చ నడుస్తుంది. మరోవైపు అగ్నిపరీక్ష కోసం ఛాన్స్ ఇస్తున్నట్లు సామాన్యులకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. త్వరలోనే బిగ్ బాస్ అగ్నీపరీక్ష ప్రసారం డిటైయిల్స్ ప్రకటించనున్నారు.

Bigg Boss 10 Telugu : గతేడాది వైల్డ్ కార్డ్‏లో రమ్మన్నారు.. ఇప్పుడు కూడా కాల్ వచ్చింది.. సోషల్ మీడియా సెన్సేషన్..
Bigg Boss 10 Telugu
Rajitha Chanti
|

Updated on: Jul 12, 2026 | 9:54 PM

Share

సోషల్ మీడియా సెలబ్రిటీ మౌనీషా చౌదరి ఇటీవల ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో తన జీవితంలోని వివిధ కోణాలను, ఇన్‌స్టాగ్రామ్ ప్రయాణం, సంపాదన వివరాలు, భవిష్యత్ ప్రణాళికలను వివరించారు. ఆమె వ్యక్తిత్వం, అందం, సంభాషణ తీరుతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. మౌనీషాను అనుష్క, సమంత వంటి ప్రముఖ తారలతో పోల్చడం గమనార్హం. మౌనీషా హైదరాబాద్‌లో పుట్టి పెరిగినప్పటికీ, గత పదేళ్లుగా USలో నివసిస్తున్నట్లు తెలిపారు. ఆమె భాష, యాస హైదరాబాదీ, ఒంగోలు (తండ్రిది), కర్నూలు (తల్లిది), గుంటూరు (భర్తది), US ప్రభావాల కలయికగా ఉంటుంది. తన కూతురుతో కలిసి USలో నివసిస్తున్న మౌనీషా, తన కుటుంబం హైదరాబాద్‌లో ఉండడంతో తరచుగా వచ్చి వెళ్తుంటానని అన్నారు.

మౌనీషా ఇన్‌స్టాగ్రామ్ ప్రయాణం అనుకోకుండా మొదలైంది. డల్లాస్‌లో ఒకసారి మంచు కురిసినప్పుడు సరదాగా తీసిన ఒక రీల్ ఊహించని విధంగా వైరల్ అయ్యింది. అదే ఆమెకు కంటెంట్ క్రియేటర్‌గా గుర్తింపునిచ్చింది. ఈ రీల్ వెనుక ఎటువంటి ఆలోచన లేదని, అది తన సమయం కాబట్టి జరిగిందని ఆమె నమ్ముతారు. ఆ తర్వాత ఆమె సినీ ప్రమోషన్లలో చురుకుగా పాల్గొన్నారు. విష్ణు మంచు “కన్నప్ప” సినిమా ప్రమోషన్ల నుండి మొదలుపెట్టి, రానా, అడవి శేష్, నవీన్ పొలిశెట్టి వంటి అగ్ర తారల చిత్రాలకు ఆమె ప్రమోషన్లు నిర్వహించారు. నవీన్ పొలిశెట్టితో ఆమె చెప్పిన డైలాగ్ డెలివరీ చాలా వైరల్ అయ్యింది. చిన్నప్పటి నుండి నిరంతరం మాట్లాడే అలవాటు ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో తనకు సహాయపడుతుందని తెలిపారు.

అనేక మందికి ఆసక్తి కలిగించే ఇన్‌స్టాగ్రామ్ ఆదాయం గురించి మౌనీషా స్పష్టతనిచ్చారు. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వచ్చే ప్రత్యక్ష మోనటైజేషన్ చాలా తక్కువని, కేవలం 1-2 డాలర్లు మాత్రమేనని ఆమె వివరించారు. ఆమెకు ప్రధాన ఆదాయం బ్రాండ్ ప్రమోషన్లు, డీల్స్ ద్వారానే వస్తుందని, ఇది ఫాలోవర్లు, వ్యూస్ సంఖ్య ఆధారంగా నిర్ణయించబడుతుందని పేర్కొన్నారు. మౌనీషాకు టీవీ రంగంలోకి ప్రవేశించాలని బలమైన ఆకాంక్ష ఉందని అన్నారు. యాంకరింగ్ చేయాలని, ఒక టాక్ షోను నిర్వహించాలని, కుటుంబ ప్రేక్షకులకు మరింత చేరువ కావాలని ఆమె కోరుకుంటున్నానని అన్నారు. ప్రముఖ రియాలిటీ షో నుండి తనకు గత సీజన్‌లో వైల్డ్ కార్డ్, ఈ సంవత్సరం కూడా అవకాశం వచ్చిందని, కానీ చిన్న కుమార్తె ఉండడం వల్ల, సమయం కుదరకపోవడం వల్ల ర్ణయం తీసుకోలేదని తెలిపారు. ఈసారి కూడా కాల్ వచ్చిందని.. అయితే వెళ్లాలి అనే నిర్ణయం తీసుకోలేదని అన్నారు. అంటే ఈసారి బిగ్ బాస్ షోలో సందడి చేయడం ఖాయమని తెలుస్తుంది.

ఎక్కువ మంది చదివినవి : Trending Song: అప్పట్లో ఈ సాంగ్ ట్రెండ్ సెట్టర్.. 90’s కుర్రాళ్ల మతులు పోగొట్టిన పాట.. ఇప్పటికీ క్రేజ్ మామూలుగా లేదుగా.

మౌనీషా చౌదరీ..

ఎక్కువ మంది చదివినవి : Cinema : ఒక గది.. ఐదుగురు మనుషులు.. ప్రతి సీన్ వణుకుపుట్టిస్తుంది.. ఓటీటీని షేక్ చేస్తున్న మైండ్ బ్లోయింగ్ మూవీ..

Follow Us
వాళ్లను కరివేపాకుల్లా తీసిపారేస్తావా.. గంభీర్‌ను ఏకిపారేసిన జాఫర్
వాళ్లను కరివేపాకుల్లా తీసిపారేస్తావా.. గంభీర్‌ను ఏకిపారేసిన జాఫర్
అరచేతిలో అన్ని పోస్టల్ సేవలు, డాక్ సేవతో ఇంటి నుంచే..!
అరచేతిలో అన్ని పోస్టల్ సేవలు, డాక్ సేవతో ఇంటి నుంచే..!
రూ.10 లక్షల పెట్టుబడికి 10 ఏళ్లలో భారీ లాభాలు ఇచ్చేది ఏది?
రూ.10 లక్షల పెట్టుబడికి 10 ఏళ్లలో భారీ లాభాలు ఇచ్చేది ఏది?
టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్లు
టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్లు
జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు రంగం సిద్ధం..!
జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు రంగం సిద్ధం..!
బాగా పండిన అరటిపండ్లను పారేస్తున్నారా?ఇలా టేస్టీగా రీయూజ్ చేయండి!
బాగా పండిన అరటిపండ్లను పారేస్తున్నారా?ఇలా టేస్టీగా రీయూజ్ చేయండి!
ఆకట్టుకుంటున్న రంభ ఊర్వశి మేనక ట్రైలర్
ఆకట్టుకుంటున్న రంభ ఊర్వశి మేనక ట్రైలర్
టీమిండియాలో చోటు లేదంటూ ఛీ కొట్టారు.. సెంచరీతో ఇచ్చిపడేశాడుగా..
టీమిండియాలో చోటు లేదంటూ ఛీ కొట్టారు.. సెంచరీతో ఇచ్చిపడేశాడుగా..
మార్నింగ్‌ బ్రేక్‌ఫాస్ట్‌లో ఓట్స్‌ తింటున్నారా? ఇది తెలుసుకోండి!
మార్నింగ్‌ బ్రేక్‌ఫాస్ట్‌లో ఓట్స్‌ తింటున్నారా? ఇది తెలుసుకోండి!
మళ్లీ అదే జోరు.. తులం బంగారం ధరపై ఎంత పెరిగిందో తెలుసా..?
మళ్లీ అదే జోరు.. తులం బంగారం ధరపై ఎంత పెరిగిందో తెలుసా..?