AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇది కదా ఆటంటే.. ఇంగ్లాండ్‌ను వణికిస్తున్న టీమిండియా! చరిత్రకు అతి చేరువలో..

మెన్స్ టీ20 నిరాశ మధ్య, భారత మహిళల క్రికెట్ జట్టు లార్డ్స్‌లో ఇంగ్లాండ్‌పై చారిత్రక టెస్ట్ విజయం సాధించే దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. భారీ లక్ష్యాన్ని నిర్దేశించి, బౌలింగ్‌లో ఆధిపత్యం ప్రదర్శించి హర్మన్ సేన పట్టు సాధించింది. క్రాంతి గౌడ్ 5 వికెట్లు, యస్తికా భాటియా అరంగేట్ర సెంచరీతో అద్భుత ప్రదర్శన చేశారు.

ఇది కదా ఆటంటే.. ఇంగ్లాండ్‌ను వణికిస్తున్న టీమిండియా! చరిత్రకు అతి చేరువలో..
Kranti Gaud Yastika Bhatia
SN Pasha
|

Updated on: Jul 12, 2026 | 9:49 PM

Share

తాజాగా ముగిసిన మెన్స్ టీ20 సిరీస్‌లో టీమిండియా చెత్త ప్రదర్శనతో తీవ్ర నిరాశపరిచిన విషయం తెలిసిందే. అయితే అదే గడ్డపై మన అమ్మాయిలు మాత్రం అదరగొడుతున్నారు. క్రికెట్ మక్కా లార్డ్స్‌లో జరుతున్న ఏకైక టెస్టులో చారిత్రత్మక విజయం దిశగా హర్మన్ సేన దూసుకెళ్లోంది. నాలుగు రోజుల ఈ టెస్టు మ్యాచ్‌లో మూడో రోజే టీమిండియా మ్యాచ్‌పై గట్టి పట్టు సాధించింది. రెండో ఇన్సింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 341 పరుగుల భారీ స్కోర్ చేసిన భారత్ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసి.. ఇంగ్లాండ్‌ ముందు 457 పరుగుల కొండంత లక్ష్యం ఉంచింది.

ఇక రెండో ఇన్నింగ్స్‌కు దిగిన ఇంగ్లాండ్‌కు భారత బౌలర్లు చుక్కలు చూపిస్తున్నారు. కేవలం 59 పరుగులకే సగం జట్టును పెవిలియన్ చేర్చారు. మరో 5 వికెట్లు తీస్తే చాలు.. టీమిండియా కొత్త చరిత్ర లిఖిస్తుంది. లార్డ్స్ వేదికగా తొలి టెస్ట్ విజయం సాధిస్తుంది. ఇటీవలె టీ20 వరల్డ్ కప్ 2026లో సెమీ ఫైనల్ చేరకుండానే నిష్క్రమించిన హర్మన్ సేన ఈ విజయంతో దాన్ని మార్చిపోవచ్చు. పైగా ఇటీవలె ఇండియన్ మెన్స్ టీమ్‌ను ఇంగ్లాండ్ మెన్స్ టీమ్ 0-4తో చిత్తు చిత్తుగా ఓడించి అవమానించారు. ఆ అవమానికి అమ్మాయిలు ఇంగ్లాండ్‌పై ప్రతీకారం తీర్చుకునే అవకాశం కూడా ఉంది. అబ్బాయిలు విఫలమైనా కూడా అమ్మాయిలు అదరగొడుతుండటంతో భారత క్రికెట్ అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు.

చరిత్ర సృష్టించిన క్రాంతి గౌడ్, యస్తికా భాటియా

కాగా, ఈ మ్యాచ్‌లో టీమిండియా యువ క్రికెటర్లు క్రాంతి గౌడ్, యస్తికా భాటియా అద్భుత ప్రదర్శనతో అదరగొట్టారు. ముందుగా ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌‌లో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో క్రాంతి గౌడ్ ఐదు వికెట్ల హాల్ సాధించి ఆకట్టుకుంది. తొలి టెస్టు ఆడుతూ తను ఈ చరిత్ర సృష్టించింది. అలాగే యస్తికా భాటియా రెండో ఇన్నింగ్స్‌లో అద్భుతమైన సెంచరీతో రాణించింది. తనకు తొలి టెస్టు సెంచరీ కాగా, క్రికెట్ మక్కా లార్డ్స్‌లో తొలి టెస్ట్ సెంచరీ చేసిన మహిళా క్రికెటర్‌గా కూడా యస్తికా చరిత్ర లిఖించింది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us