AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సింపుల్ టిప్స్ తో హోటల్ స్టైల్ స్పాంజ్ లాంటి ఇడ్లీలు.. ఇంట్లోనే చేసేయండి చక చకా

దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన, ఆరోగ్యకరమైన ఉదయం బ్రేక్‌ఫాస్ట్ ఇడ్లీ. అయితే చాలా మంది ఇళ్లల్లో ఇడ్లీలు చేసినప్పుడు అవి రాళ్లలాగా గట్టిగా వస్తుంటాయి. అలా గట్టిగా ఉంటే ఎవరైనా ఇడ్లీ తినడానికి ఇష్టపడతారా? అస్సలు ఇష్టపడరు. అదే హోటళ్లలో అయితే ఇడ్లీలు మల్లెపూవుల్లా తెల్లగా, స్పంజ్ లాగా ఎంతో మెత్తగా, సాఫ్ట్ గా ఉంటాయి. అందుకే అక్కడ ప్లేట్లకు ప్లేట్లు లాగించేస్తారు.

Phani CH
| Edited By: |

Updated on: Jul 12, 2026 | 10:09 PM

Share
మనం కూడా హోటల్ స్టైల్ లో ఇంట్లోనే మెత్తటి ఇడ్లీలను ఎలా తయారు చేసుకోవాలో, అందుకు పర్ఫెక్ట్ ఇడ్లీ పిండిని ఏ చిట్కాలతో సిద్ధం చేసుకోవాలో ఇప్పుడు మనం ఈ కథనం ద్వారా వివరంగా తెలుసుకుందాం. ఈ పర్ఫెక్ట్ కొలతలను పాటిస్తే మీ ఇంట్లో కూడా ఇడ్లీలు దూది లాగా వస్తాయి. ఈ పర్ఫెక్ట్ ఇడ్లీ పిండి తయారీ కోసం మనం ఇడ్లీలు చేసుకోవడానికి ముందు రోజే ప్రాసెస్ ప్రారంభించాలి. ఇందుకు ఒక గ్లాసు మినపగుళ్లను ఒక బౌల్ లోకి తీసుకోవాలి. మినపప్పుపై పాలిష్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, దానిని రెండు మూడు సార్లు నీళ్లతో శుభ్రంగా కడగాలి.

1 / 5
ఇలా కడిగిన తర్వాత అందులో కేవలం పావు టీస్పూన్ మెంతులను మాత్రమే జోడించాలి. ఒక గ్లాసు మినపప్పుకు పావు టీస్పూన్ మెంతులు పర్ఫెక్ట్ గా సరిపోతాయి, ఎక్కువ వేస్తే పిండి చేదవుతుంది. ఇప్పుడు తగినన్ని నీళ్లు పోసి మినపప్పును నాలుగు నుండి ఐదు గంటల పాటు బాగా నానబెట్టుకోవాలి. మినపప్పు ఎంత బాగా నానితే ఇడ్లీలు అంత సాఫ్ట్ గా వస్తాయి.

2 / 5
మరోవైపు ఒక గ్లాసు మినపగుళ్లకు మూడు గ్లాసుల ఇడ్లీ రవ్వను ఒక పెద్ద పాత్రలోకి తీసుకోవాలి. ఒకవేళ మీరు మినపగుళ్లకు బదులుగా పొట్టు తీసిన బద్ద మినపప్పు వాడుతుంటే, ఒక గ్లాసు పప్పుకు రెండు గ్లాసుల ఇడ్లీ రవ్వ మాత్రమే పోసుకోవాలి. ఈ కొలతను ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. ఇడ్లీ రవ్వను కూడా రెండు మూడు సార్లు నీళ్లతో శుభ్రంగా కడగాలి. ఇలా కడగడం వల్ల రవ్వలోని మురికి పోయి ఇడ్లీలు మల్లెపూవుల్లా తెల్లగా వస్తాయి. మినపప్పును మిక్సీ పట్టుకునే ముందు రవ్వలో నీళ్లు పోసి పక్కన పెట్టుకుంటే సరిపోతుంది, దీనిని గంటల కొద్దీ నానబెట్టాల్సిన అవసరం లేదు.

3 / 5
ఐదు గంటల తర్వాత నానిన మినపప్పులోని నీటిని పూర్తిగా వంపేసి, మరోసారి కడిగి మిక్సీ జార్ లోకి తీసుకోవాలి. ఇక్కడ ముఖ్యమైన చిట్కా ఏంటంటే, మినపప్పును మిక్సీలో వేసినప్పుడు రెండు నిమిషాల్లోనే మెత్తగా అయిపోతుంది, కానీ అంతటితో ఆపకూడదు. కంటిన్యూగా ఐదు నుండి ఎనిమిది నిమిషాల పాటు మిక్సీని తిప్పుతూనే ఉండాలి. ఆలా తిప్పడం వల్ల పిండి రోట్లో రుబ్బిన పిండి లాగా ఎంతో సాఫ్ట్ గా, ఎక్కువ క్వాంటిటీతో ప్లఫ్ఫీగా వస్తుంది. ఈ పిండిని ఒక ఎయిర్ టైట్ ప్లాస్టిక్ కంటైనర్ లోకి తీసుకోవాలి. ప్లాస్టిక్ కంటైనర్ లో పిండి త్వరగా పులియడం అవుతుంది. వర్షాకాలం, చలికాలంలో సాయంత్రం ఐదు గంటలకే మిక్సీ పట్టుకోవాలి, అదే ఎండాకాలం అయితే రాత్రి పడుకునే ముందు మిక్సీ పట్టుకోవాలి.

4 / 5
ఇప్పుడు నానిన ఇడ్లీ రవ్వను చేత్తో గట్టిగా పిండుకుంటూ నీరు లేకుండా మినపిండి ఉన్న కంటైనర్ లో వేయాలి. ఈ రెండింటినీ చేత్తో బాగా కలుపుకుని రాత్రంతా అలాగే పులియనివ్వాలి. మరుసటి రోజు ఉదయానికి పిండి రెట్టింపు పరిమాణంలో ఎయిర్ బబుల్స్ తో చక్కగా పులుస్తుంది. పిండి ఇలా పులిస్తేనే ఇడ్లీలు సాఫ్ట్ గా వస్తాయి. ఇప్పుడు ఇందులో అర టీస్పూన్ ఉప్పు వేసి కలిపి, ఇడ్లీ పాత్రలకు కొద్దిగా ఆయిల్ రాసి పిండిని పెట్టాలి. పాత్రల్లో పిండిని నిండుగా పెట్టకుండా కాస్త తక్కువగా పెట్టాలి, అప్పుడే అవి పొంగి లావుగా వస్తాయి. స్టాండ్ పెట్టేటప్పుడు ఒకదానిపై ఒకటి హోల్స్ వచ్చేలా సెట్ చేసి, ఇడ్లీ పాత్రలో అర లీటర్ నీరు పోసి ఎనిమిది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో ఉడికించాలి . అంతే హోటల్ స్టైల్ సాఫ్ట్ ఇడ్లీలు సిద్ధం. 

5 / 5
Follow Us