సీతా ఫలం.. కొండత బలం.. తింటే ఎంత మేలో..

Samatha

12 July 2026

సీతాఫలం మంచి రుచిని ఇస్తాయి. అంతే కాకుండా ఇవి ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తాయి.

సీతాఫలం

అయితే సీతా ఫలం ప్రతి రోజూ ఒకటి తినడం వలన ఇవి శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తాయి. ఆరోగ్య ప్రయోజనాలు కలుగజేస్తాయి.

శక్తి

కాగా, ఇప్పుడు మనం సీతాఫలం తినడం వలన ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి. లాభాలు ఏవో వివరంగా తెలుసుకుందాం.

ప్రయోజనాలు

సీతాఫలంలో సహజమైన గ్లూకోజ్, కార్బోహైడ్రేట్ వంటివి ఎక్కువగా ఉంటాయి. అందువలన వీటిని తినడం వలన శరీరానికి శక్తి అందుతుంది.

గ్లూకోజ్, కార్బోహైడ్రేట్

అంతే కాకుండా వీటిని తినడం వలన రక్తహీనత తగ్గుతుంది. వీటిలో ఐరన్, ఫోలేట్, కాపర్ ఎక్కువగా ఉంటాయి. ఇది హిమోగ్లోబిన్ పెంచుతుంది.

రక్తహీనత

గుండె ఆరోగ్యానికి కూడా ఇది చాలా మంచిది. ఇందులో పొటాషియం, మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. అందువలన ఇది బీపీ కూడా కంట్రోల్ చేస్తాయి.

గుండె ఆరోగ్యం

అంతే కాకుండా సీతాఫలం తినడం వలన ఇది జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అందువలన ఇది జీర్ణక్రియ సాఫీగా సాగేలా చేస్తుంది.

జీర్ణక్రియ

సీతాఫలంలో విటమిన్ ఏ, విటమిన్ సి ఎక్కువగా ఉంటాయి. అందువలన వీటిని తినడం వలన చర్మం నిగారింపుగా తయారు అవుతుంది. జుట్టు పెరుగుతుంది.

చర్మం నిగారింపు