AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Credit Card: క్రెడిట్ కార్డు వాడుతున్నారా..? ఒక్కసారి ఇలా చేస్తే మీ డబ్బులు ఆదా..

క్రెడిట్ కార్డులు ఎలా వాడాలనేది తెలియక చాలామంది సతమతమవుతుంటారు. ఎలా పడితే అలా వాడుతూ నష్టోపోతుంటారు. కొంతమంది అప్పుల్లో చిక్కుకుని ఇబ్బంది పడుతుంటారు. అయితే క్రెడిట్ కార్డును స్మార్ట్‌గా వాడటం వల్ల డబ్బులు ఆదా చేసుకోవచ్చు. అదెలా అనేది ఇప్పుడు చూద్దాం.

Credit Card: క్రెడిట్ కార్డు వాడుతున్నారా..? ఒక్కసారి ఇలా చేస్తే మీ డబ్బులు ఆదా..
Credit Card
Venkatrao Lella
|

Updated on: May 26, 2026 | 3:21 PM

Share

ఇటీవల ఎవరి చేతుల్లో చూసినా క్రెడిట్ కార్డు కనిపిస్తుంది. ఆర్ధిక అవసరాల దృష్ట్యా ఇటీవల వీటి వినియోగం పెరిగిపోయింది. అయితే కొంతమంది ఎలా పడితే అలా వాడి అప్పుల పాలవుతున్నారు. కానీ కొన్ని చిట్కాలు పాటించడం వల్ల క్రెడిట్ కార్డు ద్వారా డబ్బులు ఆదా చేసుకోవచ్చు. అనేక ఆఫర్లు, డిస్కౌంట్లు, రివార్డ్ పాయింట్లు వంటివి ఉపయోగించుకోవడం వల్ల ఈ కార్డుల ద్వారా డబ్బులు ఆదా చేసుకోవచ్చు. వీటి ద్వారా డబ్బులు ఎలా ఆదా చేసుకోవాలనే కొన్ని ట్రిక్స్ ఇప్పుడు చూద్దాం.

మీ అవవసరాలకు తగ్గట్లు ఎంచుకోండి

మీ అవసరాలు, ఖర్చులకు తగ్గట్లు ఏ క్రెడిట్ కార్డు తీసుకోవాలనేది నిర్ణయించుకోవాలి. మీరు ఇంట్లో నిత్యావసర సరుకుల కోసం ఎక్కువ ఖర్చు చేస్తుంటే వాటిపై ఎక్కువ ఆఫర్లు, డిస్కౌంట్స్, రివార్డ్ పాయింట్స్, క్యాష్‌బ్యాక్ ఇచ్చే క్రెడిట్ కార్డును ఎంచుకోండి. దీని వల్ల నిత్యావసర సరుకులపై మీకు అయ్యే ఖర్చు ఆదా చేసుకోవచ్చు. ఇక దుస్తులపై ఎక్కువ ఖర్చు చేస్తుంటే షాపింగ్స్‌పై ఆఫర్లు ఉండే కార్డును తీసుకోండి. ఇక మీరు ప్రయాణాలు ఎక్కువ చేస్తుంటే ట్రావెల్ క్రెడిట్ కార్డు తీసుకోండి. దీని వల్ల హోటల్ బుకింగ్స్, విమాన టికెట్లు, రెస్టారెంట్ బిల్లులపై డబ్బులు ఆదా అవుతాయి. ఇలా మీ ఖర్చులకు తగ్గట్లు ఆఫర్లు ఇచ్చే కార్డులను తీసుకోండి

జీరో పర్సంటేజ్ ఏపీఆర్

కొన్ని సంస్థలు క్రెడిట్ కార్డు జారీ చేసినప్పుడు ప్రారంభంలో చేసే కొనుగోళ్లపై జీరో పర్సంటేజ్ ప్రారంభ ఏపీఆర్‌ను అందిస్తున్నాయి. దాదాపు 6 నుంచి 21 నెలల పాటు ఈ ఆప్షన్ కల్పిస్తున్నాయి. దీని వల్ల మీరు చేసే కొనుగోళ్లపై ఎలాంటి వడ్డీ చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఇలాంటప్పుడు మీ డబ్బు ఆదా అవుతుంది. ఇక కొన్ని క్రెడిట్ కార్డు సంస్థలు వివిధ షాపింగ్, బ్రాండ్లతో ఒప్పందం కుదుర్చుకుంటాయి. ఇలాంటి సమయంలో ఆయా బ్రాండ్లపై క్రెడిట్ కార్డు ద్వారా ట్రాన్సాక్షన్ చేస్తే భారీ తగ్గింపులు వర్తిస్తాయి.

Follow Us