AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad Rain: అర్ధరాత్రి నుంచి నగరంలో జడివాన.. చిరుజల్లులకు పులకరింత!

అధిక ఉష్ణోగ్రతలు, ఉక్కపోత, వడగాలలుతో సతమతమవుతున్న నగరవాసులకు అర్ధరాత్రి కురిసిన జడివాన కాస్త ఉపశమనం లభించింది. ఉరుములు, మెరుపులతో కుడిన వాన నగరంలోని పలు ప్రాంతాల్లో కురిసింది. వర్షం దాటికి పలు చోట్ల విద్యుత్ అంతరాయం కలిగింది. రోడ్లన్నీ జలమయం అయ్యాయి..

Hyderabad Rain: అర్ధరాత్రి నుంచి నగరంలో జడివాన.. చిరుజల్లులకు పులకరింత!
Heavy Rain In Hyderabad
Srilakshmi C
|

Updated on: May 27, 2026 | 7:24 AM

Share

హైదరాబాద్‌, మే 27: హైదరాబాద్‌ నగర వ్యాప్తంగా పలు చోట్ల మంగళవారం అర్ధరాత్రి నుంచి భారీ వర్షం దంచికొడుతుంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం నగరంలో కురుస్తోంది. కుత్బుల్లాపూర్‌, మియాపూర్‌, చందానగర్‌, లింగంపల్లి, గచ్చిబౌలి, మాదాపూర్‌, రాయదుర్గం తదితర ప్రాంతాల్లో భరీగా వర్షం పడుతోంది. దీంతో రోడ్లన్ని జలమయ్యాయి. రోడ్లపై వాహనాల రద్దీ పెద్దగా లేకపోవడంతో ట్రాఫిక్ అంతరాయం కలగలేదు.

ఎక్కువ మంది చదివినది: ‘లీక్ జరగలేదు, అంతా పారదర్శకం’.. మెగా డీఎస్సీ 2025 పేపర్ లీక్ ఆరోపణలపై విద్యాశాఖ క్లారిటీ

మరోవైపు వర్షానికి విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. రోహిణీ కార్తి ప్రభావంతో గత రెండు రోజులుగా నిప్పుల కుంపటిలా ఉన్న నగరం తాజా జల్లులతో చల్లబడింది. ఎండలకు తల్లడిల్లిపోయిన ప్రజలకు కాస్త ఉపశమనం లభించినట్లైంది. ఉమ్మడి మెదక్‌ జిల్లాల్లోనూ వర్షం దంచికొడుతుంది. ఉరుములు, మెరుపులతో వర్షం కురుస్తుండడంతో సంగారెడ్డిలో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగింది. దీంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఎక్కువ మంది చదివినది: ముంచుకొస్తున్న ‘ఎల్‌నినో’ ముప్పు.. తలకిందులు కానున్న రుతుపవన వ్యవస్థ! సైంటిస్టుల సీరియస్ వార్నింగ్

రైతులు ఆరు బయట ఆరబెట్టిన ధాన్యం తడిచిపోయింది. ఉమ్మడి జిల్లాలోని పలు కొనుగోలు కేంద్రాల్లోనూ వర్షానికి ధాన్యం తడిచిపోయింది. నగరంతోపాటు రాష్ట్రంలోని పలు జిల్లాలలో అర్థరాత్రి భారీగా వర్షం కురిసింది. సంగారెడ్డి, కరీంనగర్, రంగారెడ్డి, సిద్దిపేట తదితర జిల్లాలలో భారీగా జల్లులు కురిశాయి. సిద్దిపేట జిల్లా ముత్స్యాలో అత్యధికంగా 12.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us