AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: వందల అడుగుల ఎత్తులో పారాగ్లైడర్‌ను ఢీ కొన్న విమానం.. వీడియో చూస్తే మతి పోవాల్సిందే!

చాలా మందికి ఇష్టమైన వ్యాపకాల్లో పారాగ్లైడింగ్‌ ఒకటి. ఎత్తైన ప్రదేశాలకు అలా ఎగురుకుంటూ వెళ్లి.. ప్రకృతి అందాలను ఆస్వాధించడానికి పారాగ్లైడింగ్‌కి మించిన ప్రత్యామ్నాయం మరొకటి ఉండదంటే అతిశయోక్తి కాదు. కానీ ఎంత ఆహ్లాదాన్ని ఇస్తుందో దాని వెనక అంతటి ప్రమాదం కూడా దాగా ఉంటుంది. ఏ మాత్రం అప్రమత్తంగా లేకుంటే కొన్ని వందల అడుగుల నుంచి అమాంతం కింద పడిపోయే ప్రమాదం ఉంది..

Viral Video: వందల అడుగుల ఎత్తులో పారాగ్లైడర్‌ను ఢీ కొన్న విమానం.. వీడియో చూస్తే మతి పోవాల్సిందే!
Plane Hits Paraglider Mid Air
Srilakshmi C
|

Updated on: May 25, 2026 | 11:13 AM

Share

ఓ యువతి ఎత్తైన పర్వతాలపై పారాగ్లైడింగ్‌కు వెళ్లింది. గాల్లో విహరిస్తూ ఉండగా.. అటుగా వచ్చిన ఓ విమానం పారాగ్లైడర్‌ను అమాంతం ఢీ కొట్టింది. ఈ ఘటనతో ప్యారాచూట్ మొత్తం చిందరవందరగా చిరిగిపోయింది. దీంతో ఆ ఫ్లైయర్ నేల వైపు గిరగిరా తిరుగుతూ దూసుకెళ్తుండగా.. యువతి చాకచక్యంగా వ్యవహరించి ఎలాంటి అపాయం లేకుండా సురక్షితంగా నేలపై దిగింది. ఇందుకు సంబంధించిన వీడియో దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఉత్తర ఆస్ట్రియాలో పారాగ్లైడింగ్‌కు ప్రసిద్ధి చెందిన ష్మిట్టెన్‌హోహే పర్వతం సమీపంలో శనివారం మధ్యాహ్నం ఈ సంఘటన జరిగింది. సాల్జ్‌బర్గ్ రాష్ట్ర పోలీసుల ప్రకారం..

ఆస్ట్రియన్ ఆల్ప్స్ పర్వతాలపై 44 ఏళ్ల అనుభవజ్ఞురాలైన పారాగ్లైడర్ సబ్రినా తన పారాచూట్‌కు కెమెరాను అమర్చుకుని ప్రయాణిస్తుండగా.. ఒక విహార విమానం అకస్మాత్తుగా ఆమె తలకు కేవలం కొన్ని అడుగుల ఎత్తులో ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆమె పారాచూట్ చిరిగిపోయింది. దీంతో ఆమె గిరగిర తిరుగుతూ నేరుగా నేలపైకి దూసుకెళ్లసాగింది. ఫస్ట్-పర్సన్ ఫుటేజ్‌లో విమానం ఢీకొన్న వెంటనే సగానికి చీలిపోవడం కనిపిస్తుంది. నియంత్రణ కోల్పోవడంతో సబ్రినా వెంటనే గిరగిరా తిరుగుతూ కేకలు వేయడం వీడియోలో చూడొచ్చు. ప్రధాన పారాచూట్ చిరిగిపోవడంతో అప్పటికే ఆమె తన వద్ద ఉన్న రిజర్వ్ పారాచూట్ కోసం చేతితో వెతకడం వీడియోలో కనిపిస్తుంది. కింద పడుతూనే ఆమె దాన్ని తెరవగలిగింది. ఇందుకు సంబంధించిన వీడియో దృశ్యాలు దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. ఆమె తన ఎమర్జెన్సీ పారాచూట్‌ను తెరిచి సురక్షితంగా కిందకు దిగగలిగింది.

ఇవి కూడా చదవండి

ఆస్ట్రియా పోలీసులు హెలికాప్టర్‌లో స్పందించి వైద్య పరీక్షల కోసం ఆమెను స్థానిక విమానాశ్రయానికి తరలించారు. మోటారు విమానం ప్రొపెల్లర్ పారాగ్లైడర్‌ను తీవ్రంగా దెబ్బతీయడంతో అనుభవజ్ఞురాలైన ఆ పారాగ్లైడర్ తన రిజర్వ్ పారాచూట్‌ను తెరచి ప్రాణాలను కాపాడుకుందని పోలీసులు మీడియాకు తెలిపారు. ఈ ఘటనలో చిన్న గాయాలు, కమిలిన గుర్తులు మినహా తనకు తీవ్రమైన గాయాలేమీ కాలేదని ఆమె ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ‘నేను ఇక్కడ కూర్చుని ఇది టైప్ చేస్తున్నానంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. ఒళ్లంతా కొన్ని చిన్న గాయాలు, కమిలిన గుర్తులు తప్ప నిజంగా నాకేమీ జరగలేదు’ అని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో జర్మన్ భాషలో రాసింది. ఈఘటనకు సంబంధించిన ఫుటేజ్ సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. ఈ వీడియో చూసిన నిటిజన్‌లు ఆమె ధైర్యాన్ని పొగడకుండా ఉండలేకపోతున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Follow Us
మూడేళ్లు ఆ డైరెక్టర్ ఇంటి చుట్టూ తిరిగా..
మూడేళ్లు ఆ డైరెక్టర్ ఇంటి చుట్టూ తిరిగా..
వాస్తు టిప్స్ : ఇంటి ముందు సపోటా చెట్టు ఉండటం మంచిదేనా?
వాస్తు టిప్స్ : ఇంటి ముందు సపోటా చెట్టు ఉండటం మంచిదేనా?
రూ.1కే అన్‌లిమిటెడ్ కాల్స్, ఇంటర్నెట్.. ఇలాంటి ఆఫర్ ఎక్కడా ఉండదు.
రూ.1కే అన్‌లిమిటెడ్ కాల్స్, ఇంటర్నెట్.. ఇలాంటి ఆఫర్ ఎక్కడా ఉండదు.
విశ్వక్‌సేన్ 'కల్ట్' షూటింగ్ పూర్తి.. గ్రాండ్ రిలీజ్ ఎప్పుడంటే?
విశ్వక్‌సేన్ 'కల్ట్' షూటింగ్ పూర్తి.. గ్రాండ్ రిలీజ్ ఎప్పుడంటే?
అదృష్టం అంటే ఇదే! రూ.2,800 పెయింటింగ్‌కు వేలంలో రూ.13 కోట్ల ధర!
అదృష్టం అంటే ఇదే! రూ.2,800 పెయింటింగ్‌కు వేలంలో రూ.13 కోట్ల ధర!
చివరి చివరి కోరిక తీరకుండానే కన్నుమూసిన సింగీతం
చివరి చివరి కోరిక తీరకుండానే కన్నుమూసిన సింగీతం
భక్తులకు బిగ్‌ అలర్ట్.. ఇకపై తిరుమలలోకి ఈ వాహనాలకు నో ఎంట్రీ!
భక్తులకు బిగ్‌ అలర్ట్.. ఇకపై తిరుమలలోకి ఈ వాహనాలకు నో ఎంట్రీ!
లక్కంటే బుమ్రా, దూబేదే..ఫైనల్ వస్తే చాలు వీరు కప్పు కొట్టాల్సిందే
లక్కంటే బుమ్రా, దూబేదే..ఫైనల్ వస్తే చాలు వీరు కప్పు కొట్టాల్సిందే
దసరా సెలవుల్లో జాలీగా.. తెలంగాణలో తప్పక చూడాల్సిన ప్రదేశాలివే
దసరా సెలవుల్లో జాలీగా.. తెలంగాణలో తప్పక చూడాల్సిన ప్రదేశాలివే
అప్పులు ఇవ్వడానికి, తీసుకోవడానికి ఏ రోజులు మంచివి?..
అప్పులు ఇవ్వడానికి, తీసుకోవడానికి ఏ రోజులు మంచివి?..