AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ జీతం ఎంతో తెలుసా..? ఈ లెక్కలు తెలిస్తే నోరెళ్లబెడతారు..

తమిళనాడులోని ఒక సాధారణ మధ్యతరగతి గది నుండి.. సిలికాన్ వ్యాలీలోని గూగుల్ సామ్రాజ్యం వరకు.. సుందర్ పిచాయ్ ప్రస్థానం ఎందరికో ఆదర్శం. అయితే ఇప్పుడు ఆయన అందుకోబోతున్న జీతం వింటే మాత్రం ఎవరైనా కళ్లు తేలేయాల్సిందే. జీతం అంటే లక్షల్లోనో, కోట్లలోనో ఉంటుందని అనుకుంటారు. కానీ మన గూగుల్ బాస్ సుందర్ పిచాయ్ రేంజ్ వేరు. ఆయన జీతం ఎంతంటే..?

గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ జీతం ఎంతో తెలుసా..? ఈ లెక్కలు తెలిస్తే నోరెళ్లబెడతారు..
Google Ceo Sundar Pichai Salary
Krishna S
|

Updated on: Mar 08, 2026 | 5:59 PM

Share

ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ మరోసారి వార్తల్లో నిలిచారు. 2004లో గూగుల్‌లో ఒక సాధారణ మేనేజర్‌గా చేరిన సుందర్ పిచాయ్.. గూగుల్ క్రోమ్, ఆండ్రాయిడ్ వంటి కీలక ప్రాజెక్టులను విజయవంతంగా నడిపించి 2015లో గూగుల్ సీఈఓగా బాధ్యతలు చేపట్టారు. 2019 నుండి ఆల్ఫాబెట్ సీఈఓగా కూడా కొనసాగుతున్నారు. ఆల్ఫాబెట్ సంస్థ ప్రకటించిన కొత్త వేతన సవరణల ప్రకారం.. పిచాయ్ రాబోయే మూడేళ్లలో సుమారు రూ.6,300 కోట్ల భారీ ఆదాయాన్ని అందుకోబోతున్నారు. తమిళనాడులోని ఒక మధ్యతరగతి కుటుంబం నుండి గూగుల్ సామ్రాజ్య అధినేతగా ఎదిగిన ఆయన ప్రస్థానంలో ఇది మరో మైలురాయి. చాలామంది ఇది కేవలం నెలవారీ జీతం అనుకుంటారు, కానీ ఈ రూ. 6,300 కోట్లు వివిధ విభాగాల నుండి లభించే లాభాల సమాహారం.

ఆదాయం ఎలా వస్తుందంటే?

సుందర్ పిచాయ్ అందుకునే ఈ భారీ మొత్తం కేవలం జీతం మాత్రమే కాదు.. వివిధ రూపాల్లో ఆయనకు అందనుంది. రాబోయే మూడేళ్ల కాలానికి కలిపి దాదాపు రూ. 60 కోట్ల బేసిక్ శాలరీ వస్తుంది. కంపెనీ పనితీరు ఆధారంగా ఆల్ఫాబెట్ నుండి రూ.2,300 కోట్ల విలువైన షేర్లు, గూగుల్ సెల్ఫ్ డ్రైవింగ్ టెక్నాలజీ విభాగం వేమోలో పిచాయ్‌కు ఉన్న వాటా ద్వారా రూ.2,300 కోట్లు లభించే అవకాశం ఉంది. డ్రోన్ డెలివరీ సర్వీస్ విభాగం ద్వారా మరో రూ.750 కోట్లు ఆదాయం రానుంది. ఇవి కాకుండా మరో రూ.800 కోట్ల ఆదాయం స్టాక్ వెస్టింగ్ రూపంలో చేరనుంది.

గూగుల్ తన జెమిని వంటి ఏఐ మోడల్స్‌తో మైక్రోసాఫ్ట్, ఓపెన్ ఏఐ వంటి సంస్థలతో పోటీ పడుతోంది. ఈ క్లిష్ట సమయంలో కంపెనీని సమర్థవంతంగా నడిపిస్తున్నందుకు, భవిష్యత్తు ప్రాజెక్టులైన వేమో, వింగ్ వంటి వాటిని లాభాల బాట పట్టించినందుకు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు ఈ భారీ ప్రోత్సాహకాన్ని ఖరారు చేశారు.

Follow Us