AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Rates: బంగారం కొనాలనుకుంటున్నారా..? హైదరాబాద్‌లో తులం ధర ఎంతుందంటే..

ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు, డిమాండ్ తో బంగారం, వెండి ధరలు గతంలో ఎన్నడూ లేని విధంగా భారీగా పెరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సోమవారం ధరలు పెరగగా.. మంగళవారం బంగారం ధరలు తగ్గాయి.. పలు వెబ్‌సైట్ల ఆధారంగా.. రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకోండి..

Gold Rates: బంగారం కొనాలనుకుంటున్నారా..? హైదరాబాద్‌లో తులం ధర ఎంతుందంటే..
Gold Price
Shaik Madar Saheb
|

Updated on: May 27, 2026 | 6:38 AM

Share

బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి.. ఇటీవల రేట్లు రికార్డు స్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత క్రమంగా దిగివస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు, డిమాండ్ తో బంగారం, వెండి ధరలు గతంలో ఎన్నడూ లేని విధంగా భారీగా పెరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సోమవారం ధరలు పెరగగా.. మంగళవారం బంగారం ధరలు తగ్గాయి.. పలు వెబ్‌సైట్ల ఆధారంగా.. బుధవారం (మే 27, 2026 ) ఉదయం ఆరు గంటల వరకు నమోదైన ధరల ప్రకారం.. దేశీయంగా బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి.

24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములపై రూ. 10 మేర తగ్గి.. రూ.1,58,880 గా ఉంది.

22 క్యారెట్ల పసిడి రేటు 10 గ్రాములపై రూ.10 తగ్గి రూ.1,45,640 గా ఉంది.

వెండి కిలోపై రూ.100 మేర తగ్గి రూ.2,84,900 లు గా ఉంది.

అయితే.. ప్రాంతాల వారీగా బంగారం, వెండి ధరల్లో వ్యాత్యాసం ఉంటుంది.

ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా..

హైదరాబాద్‌లో గోల్డ్ 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,58,880, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,45,640 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,94,900 ఉంది.

విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.1,58,880, 22 క్యారెట్ల గోల్డ్ 10గ్రాముల ధర రూ.1,45,640 ఉంది. వెండి కిలో ధర రూ.2,94,900 ఉంది.

ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర రూ.1,59,030, 22 క్యారెట్ల ధర రూ.1,45,790 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,84,900 ఉంది.

ముంబైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,58,880, 22 క్యారెట్ల ధర రూ.1,45,640 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,84,900 లుగా ఉంది.

చెన్నైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,60,680, 22 క్యారెట్ల ధర రూ.1,47,290 ఉంది. వెండి కిలో ధర రూ.2,94,900 ఉంది.

బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,58,880, 22 క్యారెట్ల ధర రూ.1,45,640 ఉంది. వెండి కిలో ధర రూ.2,84,800 లుగా ఉంది.

కాగా.. బంగారం, వెండి ధరలు అన్ని నగరాల్లో ఒకే విధంగా ఉండవు. స్థానిక డిమాండ్, సరఫరా, అలాగే రాష్ట్ర పన్నులు, తదితర అంశాల ప్రకారం ఎప్పటికప్పుడు మారుతుంటాయి.. అందుకే అన్ని ప్రధాన నగరాల్లో కూడా ధరల్లో వ్యత్యాసాలు ఉంటాయి. ఒకవేళ మీకు బంగారం, వెండి ధరల లేటెస్ట్ అప్‌డేట్ గురించి తెలుసుకోవాలంటే ఈ మొబైల్ నెంబర్‌కు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us