వేసవిలో రాగానే అందరికీ తొలుత గుర్తుకొచ్చేది మామిడిపండ్లు. అందరూ వీటిని తినడానికి ఎక్కువగా ఇష్టపడతారు. అలాగే ఈ కాలంలో తాటి ముంజలు కూడా చాలా ఫేమస్
TV9 Telugu
వేసవి కాలంలో లభించే ఈ ముంజలు శరీరానికి చల్లదనాన్ని ఇవ్వడంతోపాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. ముంజలు తాటిచెట్టు నుండి లభ్యమవుతాయి. ముంజలు పెద్ద కొబ్బరికాయలా కనిపిస్తాయి
TV9 Telugu
ముంజల లోపల తెల్లని రంగులో గుజ్జు ఉంటుంది. ఇవి నీటి శాతం ఎక్కువగా కలిగి లిచి పండు కంటే మృదువుగా ఉంటాయి. ముంజలు తాజా కొబ్బరి నీటి రుచిని కలిగి తక్కువ గాఢంగా ఉంటాయి
TV9 Telugu
వేసవిలో వచ్చే వడదెబ్బ, డీహైడ్రేషన్ నుండి బయటపడడానికి వీటిని ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. ఇవి ఎక్కువ కాలం లభించవు. మార్చి నుండి జూన్ వరకు మాత్రమే లభిస్తాయి. వీటిలో నీటి శాతం ఎక్కువగా ఉండడం వల్ల త్వరగా పాడవుతాయి
TV9 Telugu
ఇక వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు కలుగుతుందని చెప్పవచ్చు. వీటిలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. కనుక శరీరానికి అవసరమైన నీటిని అందించడంలో ఇవి ఎంతో సహాయపడతాయి
TV9 Telugu
వీటిలో సహజ చక్కెరలు ఉంటాయి కనుక ముంజలను తీసుకోవడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది. ముంజల్లో ఫైబర్, ప్రోటీన్, విటమిన్ ఎ, సి, ఇ, కె లతో పాటు ఐరన్, ఫాస్పరస్, పొటాషియం వంటి పోషకాలు ఉంటాయి
TV9 Telugu
ఆయుర్వేదంలో తాటిపండును శరీర ఉష్ణాన్ని తగ్గించే పండుగా పేర్కొంటారు. వీటిని తీసుకోవడం వల్ల ఆమ్లత్వం, హీట్ రాషెస్, డీహైడ్రేషన్ వల్ల కలిగే తలనొప్పి వంటి సమస్యలు తగ్గుతాయి
TV9 Telugu
వీటిలో తక్కువ క్యాలరీలు ఉంటాయి కనుక వేసవిలో తేలికపాటి స్నాక్స్ గా వీటిని తీసుకోవచ్చు. అలాగే ముంజలను కొన్న రోజే వీటిని తినడం మంచిది. ముంజలపై ఉండే సన్నని తెల్ల తొక్కను తీసేసి తినడం మంచిది