- Telugu News Photo Gallery Cricket photos Team India Player Sanju Samson is 1 run away from completing 1000 runs as a wicketkeeper in T20I after ind vs nz t20i world cup 2026
ఒకే ఒక్క అడుగు.. ధోని ఎలైట్ లిస్ట్‌లో సంజు శాంసన్.. రెండో భారతీయుడిగా భారీ రికార్డ్?
Sanju Samson, T20 World Cup 2026 Final: స్టార్ వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్ సంజు సామ్సన్ 2026 టీ20 ప్రపంచ కప్ ఫైనల్‌లో ఒక భారీ రికార్డును సృష్టించగలడు. గతంలో ఎంఎస్ ధోని మాత్రమే ఈ ఘనతను సాధించాడు. ఆ లిస్ట్ ఏంటో ఓసారి చూద్దాం..
Updated on: Mar 08, 2026 | 3:53 PM

2026 టీ20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో స్టార్ వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్ సంజు శాంసన్‌పై భారత అభిమానులు ఎక్కువగా ఫోకస్ చేశారు. ఈ క్రమంలో సంజూ శాంసన్ ప్రత్యేక జాబితాలో చోటు సంపాదించవచ్చు.

సంజు శాంసన్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. టీం ఇండియాకు కీలక మ్యాచ్ విన్నర్‌గా నిరూపించుకుంటున్నాడు. ఇప్పుడు అతను ఎంఎస్ ధోని లాంటి ఘనతను సాధించే అవకాశం ఉంది. అలా చేయడానికి అతనికి ఒకే ఒక పరుగు అవసరం.

సంజు శాంసన్‌పై ఫైనల్ మ్యాచ్‌లో ఒక పరుగు చేసిన వెంటనే టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో వికెట్ కీపర్‌గా 1,000 పరుగులు చేరుకుంటాడు. ఈ ఘనత సాధించిన రెండవ భారత వికెట్ కీపర్‌గా అతను నిలుస్తాడు. గతంలో, ధోని మాత్రమే ఈ ఘనత సాధించాడు. అతను వికెట్ కీపర్‌గా 1,617 టీ20ఐ పరుగులు చేశాడు.

సంజు శాంసన్ తన టీ20 అంతర్జాతీయ కెరీర్‌లో ఇప్పటివరకు 1,310 పరుగులు చేశాడు. వీటిలో ఐదు అర్ధ సెంచరీలు, మూడు సెంచరీలు సహా 999 పరుగులు మాత్రమే వికెట్ కీపర్‌గా సాధించాడు.

2026 టీ20 ప్రపంచ కప్‌లో సంజు శాంసన్ మొత్తం నాలుగు మ్యాచ్‌లు ఆడి 77.33 సగటుతో 232 పరుగులు చేశాడు. మునుపటి రెండు మ్యాచ్‌లలో అతను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా కూడా ఎంపికయ్యాడు. ముఖ్యంగా, సంజు 201.73 స్ట్రైక్ రేట్‌తో ఈ పరుగులు చేశాడు.
