AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ ముగ్గురు హీరోలు కలసి ప్రభాస్‌ని కార్నర్ చేస్తున్నారా..!

ఆ ముగ్గురు హీరోలు కలసి ప్రభాస్‌ని కార్నర్ చేస్తున్నారా..!

Lakshminarayana Varanasi, Editor - TV9 ET
| Edited By: |

Updated on: Mar 08, 2026 | 3:47 PM

Share

ఈ దసరా పండగ తెలుగు బాక్సాఫీస్‌ను షేక్ చేయనుంది. బాలకృష్ణ, ప్రభాస్, వెంకటేష్, నాగార్జున వంటి అగ్రతారల చిత్రాలు ఈసారి బరిలో దిగుతున్నాయి. బడ్జెట్ రికవరీకి దసరా సరైన సమయం కావడంతో, పలు పెద్ద సినిమాలు విడుదల కానున్నాయి. అభిమానులకు ఇది పూనకాలు తెప్పించే పండుగ కానుంది. స్టార్స్ ప్లానింగ్, రిలీజ్ వివరాలు ఇక్కడ చూడండి.

ఈసారి దసరా నిరుడు లెక్కుండదు అని నాని చెప్పినట్లే.. నిజంగానే ఈసారి పండక్కి మోత మోగిపోయేలా కనిపిస్తుంది. బడ్జెట్ రికవరీకి ఇదే పర్ఫెక్ట్ సీజన్ కావడంతో సీనియర్స్ నుంచి పాన్ ఇండియన్ స్టార్స్ వరకు ఎవరికి వాళ్లు దసరా బరిలో దిగబోతున్నారు. మరి రాబోయే విజయదశమికి థియేటర్లలో సందడి చేయబోతున్న ఆ క్రేజీ లైనప్ ఏంటో.. ఏ హీరో మాస్టర్ ప్లాన్ ఎలా ఉందో ఓసారి చూద్దాం.. వీరసింహారెడ్డి తర్వాత గోపీచంద్ మలినేని, బాలయ్య చేస్తున్న సినిమా షూట్ ఆగస్ట్ నాటికి పూర్తి కానుంది. 5 నెలల్లోనే ఈ సినిమాను పూర్తి చేసి దసరాకు పక్కాగా తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. సెప్టెంబర్ నుంచి హరీష్ శంకర్‌తో సంక్రాంతి టార్గెట్‌గా మరో కొత్త సినిమాను బాలయ్య మొదలు పెట్టనున్నారు. ఇది కూడా 4 నెలల్లోనే పూర్తి కానుందని తెలుస్తుంది. వెంకటేష్, త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న ఆదర్శ కుటుంబం సినిమా షూట్ కూడా మే వరకు పూర్తి చేసి దసరాకే రిలీజ్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. ఇందులో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇక రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ఫౌజీ షూటింగ్ మరో 40 రోజులే బ్యాలెన్స్ ఉంది. ఇది కూడా దసరాకే రానుంది. బడ్జెట్ రికవరీకి దసరానే మంచి సీజన్ అని మేకర్స్ డిసైడ్ అయ్యారు. నాగార్జున 100వ సినిమాను జూన్ నాటికి పూర్తి చేసేలా ఉన్నారు దర్శకుడు రా కార్తీక్. ఇది దసరాకు రావడం దాదాపు ఖాయం. ఆగస్ట్ నుంచి సంక్రాంతి టార్గెట్‌గా సోగ్గాడే చిన్నినాయన పార్ట్ 3 పనుల్లో బిజీ కానున్నారు నాగ్. ఇలా మన హీరోలంతా ఒకేసారి పక్కా స్కెచ్‌తో దసరా బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి వస్తుండటంతో ఫ్యాన్స్‌కు ఈ పండుగకు పూనకాలు గ్యారెంటీ అనిపిస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Trisha: త్రిష అను నేను.. 15 ఏళ్ళ క్రితం నుండే రాజకీయ ప్రవేశం కోసం రంగం సిద్ధం చేసిందా

టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్: కంటెంట్ కోసం భారీ బడ్జెట్

జాతర.. ఇది మాస్ జాతర అంటున్న స్టార్ హీరోలు

కంటెంట్ ఉన్నపుడు భయమేలా.. 100 కాదు 200 కోట్లు పెడదాం..!

Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్‌ విషయం లో అలా చేయడం.. లాభమా.. ? నష్టమా..?

Follow Us