Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ విషయం లో అలా చేయడం.. లాభమా.. ? నష్టమా..?
ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు టికెట్ రేట్లు పెంచడంపై నిర్మాతలు సందిగ్ధంలో ఉన్నారు. మార్చి 19న విడుదల కానున్న ఈ చిత్రంపై ధురంధర్ 2 పోటీ ప్రభావం చూపుతుంది. గతంలో ధరలు పెంచినప్పుడు వచ్చిన ప్రతికూల స్పందన, ధురంధర్ 2 సాధారణ రేట్లతో అందుబాటులో ఉండటం వల్ల ప్రేక్షకులు అధిక ధరలు చెల్లించకపోవచ్చు. ఈ బాక్సాఫీస్ వార్‌లో టికెట్ రేట్లే విజేతను నిర్ణయించే అవకాశం ఉంది.
ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు టికెట్ రేట్లు పెంచుతారా..? ఒకవేళ పెంచితే ఆడియన్స్ ఆ రేట్లు పెట్టి చూస్తారా..? ఇదివరకు రేట్లు పెంచితే మరో ఆప్షన్ లేదు ఆడియన్స్‌కు.. కానీ ఈసారి అలా కాదు..! ధురంధర్ 2 రూపంలో మరో ఆప్షన్ ఉంది. మరి ఈ టికెట్ రేట్ల పాలిటిక్స్, బాక్సాఫీస్ క్లాష్ ఎవరికి ప్లస్ కాబోతోందో.. ఎవరికి మైనస్ కాబోతోందో చూద్దామా..? మార్చి 19న బాక్సాఫీస్ దగ్గర ఉస్తాద్, ధురంధర్ 2 మధ్య పోరు మామూలుగా ఉండదు.. కానీ ఉస్తాద్ నిర్మాతలు టికెట్ రేట్లు పెంచితే మాత్రం నెగెటివ్ రెస్పాన్స్ వచ్చే ప్రమాదం లేకపోలేదు. ఎందుకంటే అదే రోజున రెగ్యులర్ రేట్లతో థియేటర్లలోకి ధురంధర్ 2 రూపంలో ప్రేక్షకులకు ఒక బెస్ట్ ఆల్టర్‌నేటివ్ ఆప్షన్ స్పష్టంగా కనిపిస్తోంది. ఒకవేళ ధురంధర్ 2 కూడా రేట్ల పెంపు కోరితే సిచ్యువేషన్ మారుతుంది. టికెట్ రేట్ల పెంపు కోసం ఉస్తాద్ నిర్మాతలు ప్రభుత్వాల దగ్గరికి వెళ్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఏపీలో ఎలాంటి ఇబ్బందీ లేకపోయినా తెలంగాణలో పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. ముఖ్యంగా తెలంగాణ టికెట్ రేట్ల పెంపు విషయంలో కోర్ట్ చాలా సీరియస్‌గా ఉండటం ఉస్తాద్ నిర్మాతలకు ఇప్పుడు ఒక అతిపెద్ద సవాల్‌గా మారిపోయింది. అన్నింటికి మించి గతంలో OG సినిమాకు కూడా ఇలాగే భారీగా రేట్లు పెంచడంతో ఆడియన్స్ నుంచి నెగిటివ్ రెస్పాన్స్ వచ్చింది.. సినిమా చూడాలనుకున్నా.. రేట్ల కారణంగా ఫ్యామిలీ ఆడియన్స్ రాలేదు. ఇది ఓపెనింగ్స్‌పై ప్రభావం చూపించింది కూడా. పైగా ధురంధర్ 2 లాంటి పోటీ ఉన్నప్పుడు ఉస్తాద్ కూడా హైక్స్ లేకుండా రెగ్యులర్ రేట్లతో రావడమే మంచిదేమో..? ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకుని నిర్మాతలు రెగ్యులర్ రేట్లకే ఓకే అంటారా లేక బడ్జెట్ సాకుతో రిస్క్ చేసి మరీ టికెట్ రేట్లు పెంచుతారా అన్నది ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా మార్చి 19న జరగబోయే ఈ రెండు భారీ సినిమాల వార్ మాత్రం బాక్సాఫీస్ దగ్గర కేవలం కంటెంట్ ఆధారంగానే కాకుండా టికెట్ రేట్ల ఆధారంగానే విజేతను డిసైడ్ చేసేలా కనిపిస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Virosh Wedding: ఇన్‌స్టాలో విరోష్ వెడ్డింగ్ సాంగ్ కొత్త రికార్డ్..
వాడు చేసిన పనికి.. భయంతో అడవిలో రాత్రంతా గడిపిన మహిళ
ఆదర్శ సర్పంచ్.. పదవి 'పక్కనపెట్టి'.. చెత్త ట్రాక్టర్ పట్టి !!
ఒరే ఫ్లాష్ మాన్.. వీడేం దొంగ బాబూ.. సీసీ కెమెరాకు చిక్కకూడదనీ
ఎండ ఎక్కువగా ఉందని ఏసీ ఆన్ చేయబోతే.. బయటికొచ్చిన పాములు
ఏటా రూ.4 కోట్ల సంపాదన.. NRI జంట పొదుపు మంత్రం ఇదే
ఆడంబరం లేదు.. అంతా ఆరోగ్యమే.. సేంద్రియ పెళ్లి గురించి మీకు తెలుసా
వానరాలకు 'త్రిశూలం' టాటూ.. అసలు కారణం ఇదే

