AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Vieo: ‘ఐఫోన్‌ కోసం.. ఎమోషనల్ బ్లాక్‌ మెయిల్‌’ కన్నతల్లి కళ్లల్లో కన్నీళ్ల సుడిగుండాలు

తల్లిదండ్రులు అడిగింది కొనివ్వలేదనీ.. పిల్లలు మారం చేయడం.. దాదాపు ప్రతి ఇంట్లో ఉండే సీనే. నయానో భయానో పిల్లల ఏడుపు మాన్పించి వారిని డైవర్ట్‌ చేస్టుంటారు అమ్మానాన్నలు. కానీ కొన్ని పెంకి రకాలు ఉంటాయి. ఎంత కొట్టినా.. తిట్టినా అడిగింది తెచ్చి ఇచ్చేవరకూ మొండిపట్టు వీడరు. అన్నం తినకపోవడం, స్కూల్‌కి వెళ్లకపోవడం.. వంటి నిరసనలు చేస్తుంటారు. దీంతో తల్లిదండ్రులే ఓ మెట్టు దిగి.. కన్న బిడ్డ ముఖంలో..

Viral Vieo: 'ఐఫోన్‌ కోసం.. ఎమోషనల్ బ్లాక్‌ మెయిల్‌' కన్నతల్లి కళ్లల్లో కన్నీళ్ల సుడిగుండాలు
Son Emotionally Blackmail Mother To Buy Iphone
Srilakshmi C
|

Updated on: Aug 19, 2024 | 11:47 AM

Share

తల్లిదండ్రులు అడిగింది కొనివ్వలేదనీ.. పిల్లలు మారం చేయడం.. దాదాపు ప్రతి ఇంట్లో ఉండే సీనే. నయానో భయానో పిల్లల ఏడుపు మాన్పించి వారిని డైవర్ట్‌ చేస్టుంటారు అమ్మానాన్నలు. కానీ కొన్ని పెంకి రకాలు ఉంటాయి. ఎంత కొట్టినా.. తిట్టినా అడిగింది తెచ్చి ఇచ్చేవరకూ మొండిపట్టు వీడరు. అన్నం తినకపోవడం, స్కూల్‌కి వెళ్లకపోవడం.. వంటి నిరసనలు చేస్తుంటారు. దీంతో తల్లిదండ్రులే ఓ మెట్టు దిగి.. కన్న బిడ్డ ముఖంలో సంతోషం చూసేందుకు కొనిచ్చే స్థోమత లేకపోయినా అప్పోసప్పో చేసి బిడ్డ కళ్లల్లో ఆనందం నింపుతారు. ఈ వీక్‌ పాయింట్‌ను పట్టేసిన ఓ పెంకి కొడుకు ఎలాగైనా తాను ఆశపడింది కొనిపించాలని పెద్ద డ్రామానే ఆడాడు. అంతే ఇంటికెళ్లి తల్లిని తనకు లక్షల విలువ చేసే ఐఫోన్‌ కావాలని అడిగాడు. రెక్కాడితే గానీ డొక్కాడని ఆ తల్లి ఐఫోన్‌ ధరెంతో తెలుసుకుని నోరెళ్లబెట్టింది. దీంతో కొనేందుకు సుతారం ఒప్పుకోలేదు.

కానీ సదరు కొడుకు మాత్రం ఎలాగైనా తల్లితో ఐఫోన్‌ కొనిపించాలని ఇంట్లో అన్నం తినడం మానేశాడు. ఇలా ఏకంగా మూడు రోజులు నిరాహార దీక్ష చేసి కన్న తల్లిని క్షోభపెట్టాడు. కాలం చేసిన భర్త, మాట వినని కొడుకును చూసి ఆ తల్లి మనోవేదన పడింది. గుడి మెట్లపై పువ్వులు అమ్ముకుని నాలుగు రూపాయలు సంపాదించే ఆ తల్లి కొడుకు కడుపు మాడ్చుకోవడం చూసి తట్టుకోలేకపోయింది. అంతే తాను రూపాయి.. రూపాయి.. పోగేసి బ్యాంకులో దాచిన డబ్బును తీసుకొచ్చి కొడుకుకు ఇచ్చింది. ఐతే అంత డబ్బు కొడుక్కి ఇస్తే చెడు వ్యసనాలు చేస్తాడేమోనని భయపడి, కొడుకుని వెంట బెట్టుకుని ఫోన్‌ కొనేందుకు షోరూంకు వెళ్లింది. అక్కడ ఆ తల్లీకొడుకుల వీడియోను జర్నలిస్ట్ అభిషేక్ అనే వ్యక్తి చిత్రించి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ వీడియోలో కొడుకు ముఖం వెయ్యి వోల్టుల బల్బులా వెలిగిపోతుంటే.. తల్లి మాత్రం పెళ్లుభికి వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ ఉండటం వీడియోలో కనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి

‘ఈ అబ్బాయి తల్లి ఐఫోన్‌ కొనివ్వడం లేదని ఆహారం తినడం మానేశాడు. గుడి బయట పూలు అమ్ముకునే తల్లి చివరకు కొడుక్కి ఐఫోన్ కొనడానికి డబ్బు ఇచ్చింది. మితిమీరిన ప్రేమ పిల్లలను నాశనం చేస్తుంది. ఎక్కడెక్కడ గీత గీయాలి అనేది తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాలి. ఇలాంటి పిల్లలు తల్లిదండ్రుల ప్రేమకు అనర్హులు అనే క్యాప్షన్‌ కూడా ఇచ్చాడు. ఇక వీడియో చూసిన నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అవమానకరం!!! అమ్మ నీ కొడుక్కి డబ్బులు ఇవ్వొద్దు. బదులుగా చెప్పుతో కొట్టి ఆకలితో అలమటించేలా చేస్తేనే బుద్ది వస్తుంది. ఇలాంటి స్వార్థపరులు తమ దురాశ కోసం తల్లిదండ్రులను అమ్ముకోవడానికి కూడా వెనుకాడరంటూ ఓ నెటిజన్‌ తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. మీ సగం నెల వేతనం కంటే ఎక్కువ ధరున్న ఫోన్‌ను ఎప్పుడూ కొనకండని మరో యూజర్‌ హితవు పలికాడు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..