AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇలాంటి డాక్టర్‌ కూడా ఉన్నారా..? 42ఏళ్లుగా 5 రూపాయలకే వైద్యం.. పేదల దేవుడు

ఇతను ఫీజు కేవలం ఐదు రూపాయలు మాత్రమే వసూలు చేస్తున్నప్పటికీ పేదల నుండి ఆ ఐదు రూపాయలు కూడా తీసుకోడట. అంతేకాదు.. తను తీసుకుంటున్న ఐదు రూపాయల ఫీజు కూడా మందులు కొనుగోలు చేసి నిరుపేద రోగులకు పంపిణీ చేస్తున్నాడు. దీంతో ఆయనను ఆ ప్రాంత ప్రజలు ఎంతో గౌరవిస్తారు. సమాజం పట్ల ఆయనకున్న అంకితభావానికి గానూ ఆయనకు ప్రజల్లో ఎనలేని గౌరవం ఉంది.

ఇలాంటి డాక్టర్‌ కూడా ఉన్నారా..? 42ఏళ్లుగా 5 రూపాయలకే వైద్యం.. పేదల దేవుడు
5 Rs Doctor
Jyothi Gadda
|

Updated on: Aug 19, 2024 | 11:07 AM

Share

నేటి కాలంలో డాక్టర్ వద్దకు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి.. ఎందుకంటే.. చికిత్స మాట దేవుడెరుగు.. కానీ, డాక్టర్‌ ఫీజు వింటేనే ముందుగా మన తల తిరుగుతుంది. ఇక ఆ టెస్టు, ఈ టెస్టు అంటూ మన జేబు ఖాళీ అవ్వాల్సిందే.. లేదంటే క్రెడిట్‌ కార్డు బ్యాలెన్స్‌ సున్నా కావాల్సిందే.. కానీ, ఇలాంటి కాలంలో కూడా కేవలం 5 రూపాయలకే పేషెంట్లను చూసే డాక్టర్ ఉన్నారంటే నమ్మగలరా..? ఈ ట్రెండ్ కేవలం ఒకటి రెండేళ్లుగా కాదు దాదాపు 42 ఏళ్లుగా కొనసాగుతోంది. మాండ్యకు చెందిన డాక్టర్ శంకర గౌడ అలియాస్ “5 రూపాయల డాక్టర్” గురించి ఇక్కడ తెలుసుకుందాం..

కర్నాటకలోని మాండ్యలో నివాసముంటున్న డాక్టర్ శంకర్‌ గౌడ పేరు పెద్దగా తెలియదు కానీ,.. ఐదు రూపాయల డాక్టర్ అని చెబితే చాలు.. చిన్న పిల్లవాడు కూడా దగ్గరుండి అతని వద్దకు తీసుకువెళతాడు. ఐదు రూపాయల డాక్టర్‌గా శంకర్‌గౌడ దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ప్రముఖ డాక్టర్‌. ఎంబీబీఎస్ చేసిన తర్వాత డాక్టర్ గౌడ మాండ్యాలో పని చేయకుండా వైద్యం చేయడం ప్రారంభించారు. పొలం, ఇంటి పనులు ముగించుకుని రోగులను చూసేందుకు కూర్చుంటాడు. ఒక నివేదిక ప్రకారం, అతను ఒక్కరోజులో 400 నుండి 500 మంది రోగులకు చికిత్స చేస్తాడు. వైద్యం కోసం సుదూర ప్రాంతాల నుంచి రోగులు డాక్టర్ గౌడ్ వద్దకు వస్తుంటారు.

డాక్టర్ శంకర గౌడ స్కిన్ స్పెషలిస్ట్. ఇతను ఫీజు కేవలం ఐదు రూపాయలు మాత్రమే వసూలు చేస్తున్నప్పటికీ పేదల నుండి ఆ ఐదు రూపాయలు కూడా తీసుకోడట. అంతేకాదు.. తను తీసుకుంటున్న ఐదు రూపాయల ఫీజు కూడా మందులు కొనుగోలు చేసి నిరుపేద రోగులకు పంపిణీ చేస్తున్నాడు. దీంతో ఆయనను ఆ ప్రాంత ప్రజలు ఎంతో గౌరవిస్తారు. సమాజం పట్ల ఆయనకున్న అంకితభావానికి గానూ ఆయనకు ప్రజల్లో ఎనలేని గౌరవం ఉంది.

ఇవి కూడా చదవండి

2012 సంవత్సరంలో డాక్టర్ శంకరగౌడ్‌కు గుండెపోటు వచ్చింది. అతను చాలా రోజులు ఆసుపత్రిలో ఉన్నాడు. ఈ సమయంలో అతని సన్నిహితులు, కుటుంబ సభ్యులతో పాటు పెద్ద సంఖ్యలో ప్రజలు ఆసుపత్రి వద్ద మోహరించారు. అతను త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ప్రజల ప్రార్థనలు ఫలించి డాక్టర్ శంకరగౌడ్ కోలుకుని ఇంటికి వచ్చారు. డాక్టర్ గౌడ ప్రస్తుతం రోగులకు ఐదు రూపాయలకే వైద్యం అందిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..