Watch: వామ్మో..అలల ఒడ్డున అందమైన భవనం.. అమాంతంగా మింగేసిన సముద్రం..షాకింగ్ వీడియో వైరల్
ఈ ఇల్లు 1973లో నిర్మించరని తెలిసింది. పెద్దగా విరుచుకుపడే అలలు, ప్రాణాంతక ఉప్పెనలు, బీచ్ కోత, సముద్రపు అలలు అన్నీ సాధారణమే. అయితే ఘటన జరిగిన సమయంలో ఆ ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. ఈ వీడియోను ఇప్పటి వరకు 8 మిలియన్ల మందికి పైగా వీక్షించారు.
సముద్రం ఒడ్డున నిర్మించిన ఇళ్లను చూసి ప్రజలు ఎంతో ఉత్సాహం, సాంత్వన పొందుతారు. ఇందుకోసం ఎక్కడెక్కడి నుంచో సముద్ర తీరాలకు టూర్లకు వెళ్తుంటారు. బీచ్ ఇళ్లల్లో గడపాలని, అక్కడ కూర్చొని సముద్రం సుందర దృశ్యాలను చూసేందుకు ఆరాటపడుతుంటారు. సముద్రం ఒడ్డున సాయంత్రాలు, ఉదయం సూర్యడి లే లేద కిరణాలను చూస్తూ పర్యాటకులు పట్టరాని ఆనందాన్ని ఆస్వాదిస్తుంటారు. కానీ, కొన్నిసార్లు ఇటువంటి సుందరమైన అనుభూతులే ఊహించని ప్రమాదాలుగా మారుతుంటాయి. ముఖ్యంగా తుఫాను సంభవించినప్పుడు బీచ్ ఇళ్లల్లో ఉన్నవారి పరిస్థితి భయానకంగా ఉంటుంది. ఇటీవల అలాంటి ఒక వీడియో వెలుగులోకి వచ్చింది. అందులో ఒక అందమైన ఇల్లు అకస్మాత్తుగా సముద్రంలో పేకమేడలా కూలిపోయింది. పూర్తి వివరాల్లోకి వెళితే…
వైరల్ వీడియోలో ముందుగా నార్త్ కరోలినాలోని సుందరమైన తీరప్రాంతంలో నిర్మించిన ఇంటిని చూసి నెటిజన్లు ముచ్చటపడుతున్నారు. అంతలోనే ఆ అందమైన ఇళ్లు ఆనవాళ్లు కూడా లేకుండా సముద్రంలోకి అదృశ్యమైంది. కోలిన్ రగ్ అనే వినియోగదారు ఈ వీడియోను తన అధికారిక X హ్యాండిల్‌లో పోస్ట్ చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోను ఆదివారం పోస్ట్ చేశారు.
ఈ వీడియోలో సముద్రం ఒడ్డున ఓ అందమైన ఇల్లు కట్టి ఉంది. దాని లొకేషన్‌ను చూస్తుంటే ఇక్కడి వ్యూస్‌ని చూసేందుకు జనాలు భారీగా వస్తుంటారని తెలుస్తోంది. ఈ వీడియోను షేర్ చేసిన కోలిన్ రగ్ క్యాప్షన్‌లో ఇలా వ్రాశాడు.. నార్త్ కరోలినా ఔటర్ ఒడ్డున ఉన్న అట్లాంటిక్ మహాసముద్రంలో ఒక బీచ్ హౌస్ ఇలా నేలమట్టమైంది”ఈ సంఘటన ఎర్నెస్టో హరికేన్ కారణంగా జరిగిందని రాశారు.
JUST IN: Beachfront home falls into the Atlantic Ocean on North Carolina’s Outer Banks.
The incident was thanks to Hurricane Ernesto which is off the coast in the Atlantic.
The unfortunate owners purchased the 4 bed, 2 bath home in 2018 for $339,000.
The home was built in… pic.twitter.com/MvkQuXz5SG
— Collin Rugg (@CollinRugg) August 17, 2024
ఈ ఇంటి యజమానులు దీనిని 2018లో $339,000 (2,84,32,302.90 భారత కరెన్సీ)కి కొనుగోలు చేశారని సమాచారం. ఈ ఇల్లు 1973లో నిర్మించరని తెలిసింది. పెద్దగా విరుచుకుపడే అలలు, ప్రాణాంతక ఉప్పెనలు, బీచ్ కోత, సముద్రపు అలలు అన్నీ సాధారణమే. అయితే ఘటన జరిగిన సమయంలో ఆ ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. ఈ వీడియోను ఇప్పటి వరకు 8 మిలియన్ల మందికి పైగా వీక్షించారు.
గత నాలుగేళ్లలో రోడంతేలో ఇది ఏడో ఘటన అని నేషనల్ పార్క్ సర్వీసెస్ తెలిపింది. దీంతో పాటు ఈ ప్రాంతానికి దూరంగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఈ తుఫాను కారణంగా రోడంతె చుట్టుపక్కల అనేక ఇతర ఇళ్లు కూడా దెబ్బతిన్నాయి. ఇటువంటి సంఘటనలతో బీచ్‌లలో చెత్తాచెదారం, హానికరమైన వ్యర్థాలు, చెక్క పలకలతో ప్రజలకు మరింత ప్రమాదకరంగా మారుతుందని అంటున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..