Watch: వారెవ్వా..ట్రాఫిక్ పోలీసుల మజాకా..! లంచం డబ్బులు దర్జాగా కూర్చొని పంచుకుంటున్నారు..
మొత్తానికి వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు సైతం పెద్ద సంఖ్యలో స్పందించారు. ట్రాఫిక్ పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కంచె చేను మేసింది అంటే..ఇదేమరీ అంటూ కొందరు కామెంట్ చేయగా, రక్షించేవాడే భక్షిస్తున్నట్టుగా ఉందంటూ మరికొందరు తీవ్రంగా విమర్శించారు.
దేశ రాజధాని ఢిల్లీలో పోలీసులు లంచం డబ్బులు పంచుకుంటున్న వీడియో వైరల్‌గా మారింది. ఢిల్లీలో ‘ఖాకీ’ కళంకితమైందంటూ నెటిజన్లు వీడియోను విపరీతంగా షేర్ చేస్తున్నారు. ఈ వ్యవహారంపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సుమోటోగా స్పందించి కీలక చర్యలు తీసుకున్నారు. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా సోషల్ మీడియాలో వైరల్ వీడియోపై స్పందించారు. సంబంధిత పోలీసులను తక్షణమే సస్పెండ్ చేశారు. ఈ వీడియోలో ముగ్గురు పోలీసులు లంచం డబ్బు పంచుకుంటున్నట్టు స్పష్టం కనిపించారు. ఈఘటన ఘాజీపూర్ ప్రాంతానికి సంబంధించినదిగా తెలిసింది. ఇక్కడ పోలీస్ స్టేషన్ ముందు ఒక గుడిసెలో ముగ్గురు ట్రాఫిక్ పోలీసులు లంచం నగదు ముగ్గురు పంచుకుంటూ సీసీ కెమెరాకు చిక్కారు.
వైరల్ వీడియోలో మొదటి వీడియోలో పోలీసు ఒక వ్యక్తితో వాదించుకోవడం కనిపిస్తుంది. కాసేపటి తర్వాత పోలీసు సిగ్నల్ ఇవ్వడంతో ఆ వ్యక్తి డబ్బును టేబుల్‌పై పెట్టాడు.. పోలీసు అతనిపై నిఘా ఉంచాడు. ఆ వ్యక్తి వెళ్ళిపోగానే లెక్క సరిగా ఉందోలేదోనన్నట్టుగా సదరు పోలీసు తాపీగా కూర్చుని ఆ డబ్బు లెక్కించాడు..
రెండో వీడియోలో ముగ్గురు పోలీసులు కలిసి కూర్చుని ఉండటం కనిపిస్తుంది.. ఈ సమయంలో, మొదటి పోలీసు వారికి డబ్బును పంచిపెడుతున్నాడు. మిగిలిన ఇద్దరు వారి వాటా తీసుకుంటూ నవ్వుకుంటున్నారు. ఎవరు షేర్ చేశారో తెలియదు.. గానీ, వీడియోమాత్రం నెట్టింట పెను దుమారం రేపింది. ఈ కేసులో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఈ ఘటనకు సంబంధించిన వీడియోపై ట్విట్టర్‌లో స్పందిస్తూ.. ఇద్దరు ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేసినట్లు తెలిపారు. వైరల్ వీడియోను పరిగణనలోకి తీసుకుని, ప్రాథమిక విచారణ తర్వాత, ముగ్గురు పోలీసులను సస్పెండ్ చేశామని, వారిపై శాఖాపరమైన విచారణ జరుపుతున్నట్లు చెప్పారు.
#Delhi #WATCH गाजीपुर थाने के सामने ट्रैफिक पुलिस वालों ने झौपड़ी को बनाया हुआ था उगाही का अड्डा। देखें कैसे लोगों को वहां लाकर लेते थे रिश्वत, फिर कमाई को आपस में बांट लेते थे। आरोपी ट्रैफिक पुलिसकर्मी कल्याणपुरी सर्कल के हैं।@SandhyaTimes4u @NBTDilli @CPDelhi #DelhiPolice pic.twitter.com/7i7yYR2JlB
— Kunal Kashyap (@kunalkashyap_st) August 17, 2024
మొత్తానికి వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు సైతం పెద్ద సంఖ్యలో స్పందించారు. ట్రాఫిక్ పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కంచె చేను మేసింది అంటే..ఇదేమరీ అంటూ కొందరు కామెంట్ చేయగా, రక్షించేవాడే భక్షిస్తున్నట్టుగా ఉందంటూ మరికొందరు తీవ్రంగా విమర్శించారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..