AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తీవ్రమైన కడుపునొప్పితో ఆస్పత్రికి వెళ్లిన ఇద్దరు పిల్లల తండ్రి..! సర్జరీ చేసిన వైద్యులు షాక్‌.. ఏం జరిగిదంటే..

46 ఏళ్ల ఒక వ్యక్తి హెర్నియా చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్లాడు. అతనికి ఆపరేషన్‌ చేసేందుకు ఏర్పాటు చేసిన వైద్యులు.. అతని పొత్తి కడుపులో సరిగా అభివృద్ధి చెందని గర్భాశయం, అండాశయాలను ఉన్నట్టుగా గుర్తించారు. అది చూసిన వైద్యులు ఒకింత ఆశ్చర్యపోయారు. వెంటనే అతని కుటుంబ సభ్యులకు విషయం వివరించారు.

తీవ్రమైన కడుపునొప్పితో ఆస్పత్రికి వెళ్లిన ఇద్దరు పిల్లల తండ్రి..! సర్జరీ చేసిన వైద్యులు షాక్‌.. ఏం జరిగిదంటే..
Surgery
Jyothi Gadda
|

Updated on: Aug 18, 2024 | 6:44 PM

Share

ఇద్దరు పిల్లల తండ్రి అయిన ఒక వ్యక్తి ఇటీవల గత కొద్ది రోజులుగా విపరీతమైన కడుపు నొప్పితో అవస్థపడుతున్నాడు. తరచూ వేధిస్తున్న కడుపునొప్పితో అతడు ఆస్పత్రికి వెళ్లి డాక్టర్‌ను సంప్రదించాడు. కాగా, ఆ వ్యక్తికి చాలా కాలంగా కడుపు నొప్పి వస్తున్న కారణంగా అతని పలు రకాల టెస్టులు నిర్వహించారు వైద్యులు. అల్ట్రాసౌండ్ కూడా చేశారు. కడుపులో కణతి లాంటి మాంసపు ముద్దను గుర్తించారు. అతని కడుపులో హెర్నియా పెరిగినట్టుగా భావించిన వైద్యులు..అతనికి సర్జరీ చేయాలని సూచించారు. ఈ మేరకు ఆపరేషన్ నిర్వహించారు. కానీ, సర్జరీ సమయంలో అతని కడుపులో మహిళల్లో ఉన్నట్టుగా గర్భాశయం, అండాశయాలు ఉండటం గమనించి వైద్యులు కంగుతిన్నారు. ఈ విచిత్ర సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో చోటు చేసుకుంది. చివరకు ఏమైందో పూర్తి వివరాల్లోకి వెళితే..

ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో 46 ఏళ్ల ఒక వ్యక్తి హెర్నియా చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్లాడు. అతనికి ఆపరేషన్‌ చేసేందుకు ఏర్పాటు చేసిన వైద్యులు.. అతని పొత్తి కడుపులో సరిగా అభివృద్ధి చెందని గర్భాశయం, అండాశయాలను ఉన్నట్టుగా గుర్తించారు. అది చూసిన వైద్యులు ఒకింత ఆశ్చర్యపోయారు. వెంటనే అతని కుటుంబ సభ్యులకు విషయం వివరించారు. అనంతరం అతనికి సర్జరీ నిర్వహించారు. ఆ వ్యక్తి శరీరం నుంచి గర్భాశయం, అండాశయాలను వైద్యులు బయటకు తీశారు. బాధిత వ్యక్తి వివాహమై ఇద్దరు పిల్లల కూడా ఉన్నారని తెలిసింది. అతడు తీవ్రమైన కడుపునొప్పి కారణంగా హెర్నియా సర్జరీ కోసం ఆస్పత్రికి వెళ్లగా, అతనికి ఇలాంటి ఊహించని పరిస్థితి ఎదురైంది.

గోరఖ్‌పూర్‌లని బీఆర్‌డీ వైద్య కళాశాల సర్జన్‌ ప్రొఫెసర్‌ డా. నరేంద్ర దేవ్ నేతృత్వంలో బాధితుడికి ఆపరేషన్‌ నిర్వహించారు వైద్యులు. ఈ సర్జరీ సమయంలోనే పొత్తికడుపు నుంచి అభివృద్ధి చెందని గర్భాశయాన్ని వెలికితీశారు. అయితే, బాధిత వ్యక్తికి ఎలాంటి స్త్రీ లక్షణాలు లేవని కుటుంబీకులు చెబుతుండగా, ఇది అతని శరీరంలో పుట్టుకతో వచ్చే లోపమని, స్త్రీ లక్షణాలేమీ కనిపించలేదని డాక్టర్ చెబుతున్నారు. ఇది జన్యుపరమైన రుగ్మత కావచ్చునని వైద్యుల ప్రాథమికంగా నిర్ధారించారు. శస్త్రచికిత్స చేయించుకున్న వ్యక్తి కోలుకుంటున్నాడని వైద్యులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!
భారత కరెన్సీ మహిమ.. పేదల్ని ధనవంతులుగా మార్చేస్తోంది!
భారత కరెన్సీ మహిమ.. పేదల్ని ధనవంతులుగా మార్చేస్తోంది!
సిబిల్ స్కోర్ తక్కువుండి ఇబ్బంది పడుతున్నారా..? ఈ పనులు చేస్తే..
సిబిల్ స్కోర్ తక్కువుండి ఇబ్బంది పడుతున్నారా..? ఈ పనులు చేస్తే..