AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హోటల్ గదిలో మంచం ముందు అద్దం ఎందుకు పెడతారో తెలుసా..? ఆ రహస్యం తెలిస్తే నోరెళ్లబెడతారు..!

Hotel Room Mirror Psychology: హోటల్ యాజమాన్యాలు కస్టమర్ల సౌకర్యం, వెలుతురు కోసం అద్దాలను అమర్చినప్పటికీ మన రక్షణ మన చేతుల్లోనే ఉంచుకోవాలి. రూమ్‌కి వెళ్లిన వెంటనే ఈ చిన్న మిర్రర్ టెస్ట్ చేయడం వల్ల సురక్షితంగా, ప్రశాంతంగా ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు.

Venkata Chari
|

Updated on: Aug 03, 2026 | 1:25 PM

Share
మనం దూర ప్రాంతాలకు ప్రయాణించినప్పుడు లేదా విహారయాత్రలకు వెళ్లినప్పుడు హోటల్ గదుల్లో బస చేయడం చాలా సహజం. గదిలోకి అడుగుపెట్టగానే పరుపుకు ఎదురుగా పెద్ద అద్దం కనిపించడం మీరు ఎప్పుడైనా గమనించారా? కేవలం అందం కోసం అనుకుంటే పొరపాటే. దాని వెనుక వ్యాపార సూత్రాలు, ఇంటీరియర్ డిజైనింగ్ మెళుకువలు దాగున్నాయి.

1 / 5
తిరుగులేని ప్లాన్..! మనం హోటల్ రూమ్‌కి వెళ్లినప్పుడు అక్కడి వస్తువులను పెద్దగా పట్టించుకోం. సేదతీరడం మాత్రమే మన లక్ష్యం. హోటల్ ప్రతి విషయంలోనూ ఒక ప్రత్యేక ప్రణాళిక ఉంటుంది. మంచం ముందు అద్దం ఉంచడం వెనుక ప్రధాన కారణం వెలుతురును పెంచడం. కిటికీల ద్వారా వచ్చే ప్రకృతి సిద్ధమైన కాంతి అద్దంలో ప్రతిబింబించి గది మొత్తం ప్రసరిస్తుంది. అదనపు లైట్లు వాడకుండానే రూమ్ ఎంతో ప్రకాశవంతంగా, ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

2 / 5
చిన్న గదిని పెద్దదిగా చూపే మాయాజాలం..! చిన్న సైజు గదులను కూడా విశాలంగా చూపించడానికి ఇంటీరియర్ డిజైనర్లు ఈ అద్భుతమైన ట్రిక్ ఉపయోగిస్తారు. అద్దం గది లోతును ప్రతిబింబించడం వల్ల చిన్న గది కూడా చాలా పెద్దదిగా అనిపిస్తుంది. ఇది వినియోగదారుడికి మానసికంగా గొప్ప అనుభూతిని ఇస్తుంది. ప్రయాణికులు త్వరగా తయారవ్వడానికి కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.

3 / 5
ఫెంగ్ షుయ్ నియమాలు ఏమని చెప్తున్నాయి..? రూమ్ అందంగా కనిపిస్తున్నప్పటికీ ఇందులో కొన్ని ప్రతికూలతలు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చైనీస్ వాస్తు శాస్త్రమైన ఫెంగ్ షుయ్ ప్రకారం నిద్రపోయే పరుపుకు ఎదురుగా అద్దం ఉంచకూడదు. ఇది గదిలో ప్రతికూల శక్తిని పెంచి ప్రశాంతమైన నిద్రను దూరం చేస్తుంది. అర్ధరాత్రి కళ్లు తెరిచినప్పుడు అద్దంలో స్వంత నీడలు కనిపిస్తే ఒక్కసారిగా భయపడే ప్రమాదం ఉంది.

4 / 5
సీక్రెట్ కెమెరాల కాలంలో జాగ్రత్త సుమా..! అందానికి అతీతంగా హోటల్ గదుల్లో భద్రత చాలా ముఖ్యం. అక్కడ ఉన్నది సాధారణ అద్దమా లేక దొంగ చూపులు చూసే టూ-వే మిర్రరా అనేది నిర్ధారించుకోవడం అవసరం. అద్దం మీద మీ వేలిని ఉంచినప్పుడు వేలికి, లోపలి ప్రతిబింబానికి మధ్య కాస్త ఖాళీ ఉంటే అది సురక్షితమైన అద్దం. ఖాళీ లేకుండా వేలి కొన ప్రతిబింబాన్ని తాకితే మాత్రం వెంటనే అప్రమత్తం కావాలి.

5 / 5
Follow Us