AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jio IPO: దేశంలోనే అతిపెద్ద ఐపీఓకు సిద్ధమవుతున్న జియో.. లిస్టింగ్‌ తేదీ ఇదేనా?

JIO IPO: జియో విలువ గతంలో అంచనా వేసిన దానికంటే ఇప్పుడు తక్కువగా ఉంది. దీనికి ఒక కారణంగా స్టాక్ మార్కెట్ అస్థిరత, పెద్ద ఐపీఓల పట్ల పెట్టుబడిదారుల ఆసక్తిలో మార్పులను పేర్కొన్నారు. జూన్‌లో కంపెనీ తన తొలి ఐపీఓ పత్రాలను దాఖలు చేసినప్పుడు..

Jio IPO: దేశంలోనే అతిపెద్ద ఐపీఓకు సిద్ధమవుతున్న జియో.. లిస్టింగ్‌ తేదీ ఇదేనా?
Jio Ipo
Subhash Goud
| Edited By: |

Updated on: Oct 15, 2026 | 6:02 PM

Share

రిలయన్స్ ఇండస్ట్రీస్ డిజిటల్ , విభాగానికి చెందిన ‘జియో ప్లాట్‌ఫార్మ్స్’ (Jio Platforms) ఐపీఓ (IPO)కి రావడానికి సిద్ధమవుతోంది. ఇది భారత మార్కెట్ చరిత్రలోనే అతిపెద్ద IPOగా నిలిచే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఐపీఓ ప్రారంభం కాకముందే గ్రే మార్కెట్‌లో జియో షేర్లపై విపరీతమైన క్రేజ్ కనిపిస్తోంది. ప్రస్తుతం గ్రే మార్కెట్ ప్రీమియం (GMP) దాదాపు రూ.200 వద్ద వర్తకమవుతోంది. రాయిటర్స్ నివేదిక ప్రకారం, జియో ప్లాట్‌ఫార్మ్స్ ఈ ఐపీఓ ద్వారా మార్కెట్ నుంచి దాదాపు రూ. 30,200 కోట్లు నిధులు సమీకరించాలని యోచిస్తోంది.

గతంతో పోలిస్తే జియో విలువ ఎందుకు తగ్గింది?

నివేదిక ప్రకారం, జియో విలువ గతంలో అంచనా వేసిన దానికంటే ఇప్పుడు తక్కువగా ఉంది. దీనికి ఒక కారణంగా స్టాక్ మార్కెట్ అస్థిరత, పెద్ద ఐపీఓల పట్ల పెట్టుబడిదారుల ఆసక్తిలో మార్పులను పేర్కొన్నారు. జూన్‌లో కంపెనీ తన తొలి ఐపీఓ పత్రాలను దాఖలు చేసినప్పుడు, దాని విలువ సుమారు $131 బిలియన్లు, లేదా దాదాపు రూ.13 లక్షల కోట్లుగా అంచనా వేశారు. ఇప్పుడు నివేదిక దాని విలువను సుమారు $106 బిలియన్లు, లేదా రూ.10.3 లక్షల కోట్లుగా అంచనా వేసింది. అయితే ఈ మార్పుపై రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇంకా అధికారిక ప్రకటన జారీ చేయలేదు.

జియో ఐపీఓ ఎప్పుడు ప్రారంభమవుతుంది?

లైవ్‌మింట్ నివేదిక ప్రకారం, జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓ అక్టోబర్ 21న ప్రారంభమై అక్టోబర్ 23న ముగియనుంది. షేర్లు అక్టోబర్ 28న లిస్ట్ కానున్నాయి. యాంకర్ ఇన్వెస్టర్ల కోసం బిడ్డింగ్ అక్టోబర్ 19న ప్రారంభం కానుంది. అయితే, ఈ తేదీలు, ధరలకు సంబంధించి కంపెనీ అధికారిక ప్రకటన కోసం ఎదురుచూస్తోంది.

ఐపీఓ నిధులను కంపెనీ దేనికి ఉపయోగిస్తుంది?

ఈ ఐపీఓ ద్వారా సేకరించిన నిధులలో దాదాపు రూ. 27,500 కోట్లను తన టెలికాం సబ్సిడరీ సంస్థ అయిన ‘రిలయన్స్ జియో ఇన్ఫోకామ్’ రుణాలను చెల్లించడానికి ఉపయోగించాలని కంపెనీ భావిస్తోంది. దీనివల్ల కంపెనీపై రుణ భారం భారీగా తగ్గుతుంది. అంతేకాకుండా, ఇందులో కొత్త షేర్లను జారీ చేయనున్నారు.

ఈ IPO ఎందుకు అంత ప్రత్యేకం?

  • విస్తృతమైన కస్టమర్ బేస్: మార్చి నాటికి జియో ప్లాట్‌ఫార్మ్స్‌కు దాదాపు 52.44 కోట్ల వినియోగదారులు ఉన్నారు.
  • వ్యాపార విస్తరణ: జియో కేవలం మొబైల్ నెట్‌వర్క్‌కే పరిమితం కాకుండా ఫిక్స్‌డ్ బ్రాడ్‌బ్యాండ్, క్లౌడ్ సేవలు, ఎంటర్‌టైన్‌మెంట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగాలలో విస్తరించింది.
  • ఆదాయంలో పెరుగుదల: ముగిసిన ఆర్థిక సంవత్సరంలో కంపెనీ కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం 14.6% పెరిగి రూ.1.47 లక్షల కోట్లకు చేరగా, నికర లాభం 15.1% పెరిగి రూ.30,050 కోట్లకు చేరింది. ఈ ఐపీఓ విజయవంతంగా లిస్ట్ అయితే, మార్కెట్ క్యాపిటలైజేషన్ (విలువ) పరంగా ఇది భారతదేశంలోని టాప్-4 అతిపెద్ద కంపెనీలలో ఒకటిగా చేరే అవకాశం ఉంది.

తెలుసుకోవాల్సిన వివరాలు:

రిలయన్స్‌కు చెందిన జియో ప్లాట్‌ఫామ్స్ వాటాల విక్రయం అక్టోబర్ 21న ప్రారంభమై, 23న ముగియనుందని నివేదికలు చెబుతున్నాయి; అక్టోబర్ 19న పెద్ద పెట్టుబడిదారుల బిడ్డింగ్, 28న వాటాల కేటాయింపు, నగదు వాపసు, మార్కెట్‌లో నమోదు జరగవచ్చని సమాచారం.

ఒక్కో వాటా ధర రూ.1,065–రూ1,119గా, కనీస దరఖాస్తు 12 వాటాలుగా నివేదికల్లో పేర్కొన్నారు; తుది ధర, పరిమాణాన్ని అధికారిక పత్రాల్లో నిర్ధారించాలి.

ఈ విక్రయంలో కొత్త వాటాల జారీ ఉంటుందని, పాత వాటాదారుల వాటాల విక్రయం ఉండదని నివేదికలు పేర్కొంటున్నాయి; సుమారు రూ30,213 కోట్ల విలువతో ఇది 2024లోని హ్యుందాయ్ సంస్థ రూ.27,870 కోట్ల విక్రయాన్ని మించి దేశంలోనే అతిపెద్దదిగా నిలవవచ్చని అంచనా.

దరఖాస్తు చేయాలనుకునేవారు తమ పెట్టుబడి యాప్ లేదా బ్యాంకు ద్వారా యూపీఐ లేదా ఏఎస్బీఏ పద్ధతిలో దరఖాస్తు చేయవచ్చు; అర్హులైన రిలయన్స్ వాటాదారుల ప్రత్యేక కోటా వివరాలు, ధరలు, తేదీలను అధికారిక పత్రాల్లో నిర్ధారించాలి.. అనధికారిక గ్రే మార్కెట్ అంచనాలు లాభాలకు హామీ కావు.

ఇది కూడా చదవండి: Electric Blankets: ధర తక్కువ.. ఉపయోగం ఎక్కువ.. చలికాలంలో ఎలక్ట్రిక్ బ్లాంకెట్స్‌..!

ఇది కూడా చదవండి: MDR Charges: వినియోగదారులకు గుడ్‌న్యూస్‌.. కీలక నిర్ణయం.. యూపీఐ పేమెంట్లపై ఎండీఆర్‌ ఛార్జీలు వాయిదా

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
హిమాలయాల్లో మెఘా ఇంజినీరింగ్ మరో సంచలనం..!
హిమాలయాల్లో మెఘా ఇంజినీరింగ్ మరో సంచలనం..!
డ్రగ్స్‌పై యుద్ధం ప్రకటించిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి..!
డ్రగ్స్‌పై యుద్ధం ప్రకటించిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి..!
వాట్సాప్‌లో బెస్ట్ ఫీచర్.. రెండు ఫోన్‌ కెమెరాలు ఒకేసారి..!
వాట్సాప్‌లో బెస్ట్ ఫీచర్.. రెండు ఫోన్‌ కెమెరాలు ఒకేసారి..!
ఫ్రిజ్‌లో అస్సలు పెట్టకూడని ఆహారాలు ఏంటో తెలుసా..?
ఫ్రిజ్‌లో అస్సలు పెట్టకూడని ఆహారాలు ఏంటో తెలుసా..?
బిల్లుపై పోరుకు కాంగ్రెస్ రెడీ.. మధ్యలో ట్విస్ట్ ఇచ్చిన మిత్రులు!
బిల్లుపై పోరుకు కాంగ్రెస్ రెడీ.. మధ్యలో ట్విస్ట్ ఇచ్చిన మిత్రులు!
కార్తీక శనివారం వేంకటేశ్వర స్వామి పూజ.. ఇంట్లోనే ఇలా పూజిస్తే..
కార్తీక శనివారం వేంకటేశ్వర స్వామి పూజ.. ఇంట్లోనే ఇలా పూజిస్తే..
బంగారంపై రుణం తీసుకున్న వారికి బ్యాంకుల నుంచి నోటీసులు.. ఎందుకంటే
బంగారంపై రుణం తీసుకున్న వారికి బ్యాంకుల నుంచి నోటీసులు.. ఎందుకంటే
జియో, ఎయిర్‌టెల్‌కు ట్రాయ్ బిగ్ షాక్.. ఇకపై లెక్క మారాల్సిందేనా ?
జియో, ఎయిర్‌టెల్‌కు ట్రాయ్ బిగ్ షాక్.. ఇకపై లెక్క మారాల్సిందేనా ?
Hyundai Ioniq Pతో Tata Nexon మార్కెట్​ తగ్గుతుందా?
Hyundai Ioniq Pతో Tata Nexon మార్కెట్​ తగ్గుతుందా?
జనవరి నుంచే జలగండం..? జలాశయాల్లో జీరో లెవల్స్.. హైదరాబాద్ అంతటా..
జనవరి నుంచే జలగండం..? జలాశయాల్లో జీరో లెవల్స్.. హైదరాబాద్ అంతటా..