AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అంబానీ ఇంట్లో ఉద్యోగం కావాలా.? కావాల్సిన అర్హతలివే.. జీతం ఏకంగా కోట్లలోనే..

ఈ భవనానికి అట్లాంటిక్ మహాసముద్రంలోని పౌరాణిక ద్వీపం యాంటిలియా పేరును పెట్టారు. యాంటిలియా ఇల్లు మొత్తం 27 అంతస్తులతో నిర్మించారు. భారీ భూకంపాలను సైతం ఈ ఇల్లు తట్టుకోగలదు. రికార్టు స్కేలుపై 8 తీవ్రతతో వచ్చినా చెక్కు చెదరదు. ఇకపోతే, అంబానీ ఇంటి నిర్వహణ అంత ఈజీ కాదు. అంబానీ ఇంట్లో ఎంత మంది నివసిస్తున్నారు.?

అంబానీ ఇంట్లో ఉద్యోగం కావాలా.? కావాల్సిన అర్హతలివే.. జీతం ఏకంగా కోట్లలోనే..
Amabanis House
Jyothi Gadda
|

Updated on: Aug 16, 2024 | 6:52 PM

Share

రిలయన్స్ గ్రూప్ అధినేత ముఖేష్ అంబానీ గురించి ప్రపంచవ్యాప్తంగా పరిచయం అవసరంలేదు. రిలయన్స్ ఇండస్ట్రీస్‌ను ఈరోజు అత్యున్నత స్థాయికి తీసుకెళ్లిన ముకేశ్ అంబానీ..ప్రపంచంలోనే టాప్-10 ధనవంతుల్లో ఒకరిగా కొనసాగుతున్నారు. ఇకపోతే, ముఖేష్ అంబానీ ఫ్యామిలీకి సంబంధించి ఏ చిన్న విషయం కూడా వార్తే అవుతుంది. తాజాగా వారి ఇంట్లో పనిచేసేవారికి ఎంత జీతం ఇస్తారు.? అందుకు కావాల్సిన అర్హతలేమిటి..? వారి జీవన విధానం ఎలా ఉంటుంది..? ఇలాంటి సందేహాలు కూడా సర్వత్ర వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఇలాంటి వార్తలు అనేకం వైరలవుతుంటాయి. ఈ క్రమంలోనే అంబానీ కుటుంబం నివస్తున్న యాంటిలియాలో పనిమనుషుల జీత భత్యాల గురించి వార్త ఇంటర్‌నెట్‌లో చక్కర్లు కొడుతుంది.

ముఖేష్ అంబానీ ఇంటి పేరు ఆంటిలియా. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదిగా గుర్తింపు పొందింది. ముంబైలో ఉన్న ఈ ఇంటి నిర్మాణం 2010లో పూర్తయింది.  ఈ భవనానికి అట్లాంటిక్ మహాసముద్రంలోని పౌరాణిక ద్వీపం యాంటిలియా పేరును పెట్టారు. యాంటిలియా ఇల్లు మొత్తం 27 అంతస్తులతో నిర్మించారు. భారీ భూకంపాలను సైతం ఈ ఇల్లు తట్టుకోగలదు. రికార్టు స్కేలుపై 8 తీవ్రతతో వచ్చినా చెక్కు చెదరదు. ఇకపోతే, అంబానీ ఇంటి నిర్వహణ అంత ఈజీ కాదు. అంబానీ ఇంట్లో ఎంత మంది నివసిస్తున్నారు.?

ఈ ఇంటిని ఎలా మేనేజ్ చేస్తారు అనే విషయాలు సహజంగానే చాలా మంది సాధారణ ప్రజల్లో తలెత్తుతాయి. అంబానీ ఇంట్లో వంట చేయాలంటే డిగ్రీ లేదంటే డిప్లమో ఉండాలి. ఆయన ఇంట్లో పనిచేసే సిబ్బంది సుమారు 600 మంది వరకు ఉంటారు. వంట చేసేవారి వేతనం నెలకు రూ.2 లక్షలుగా ఉంటుందట. పైగా వారికి పలురకాల ఇంటర్వ్యూలు, టెస్టులు ఉంటాయని తెలిసింది.

ఇవి కూడా చదవండి

ఇకపోతే, వన్స్‌ ఇక్కడ ఉద్యోగం వచ్చిందంటే.. వారి దశ తిరిగినట్టే అంటున్నారు కొందరు మీడియా వర్గాలు. ముకేశ్ అంబానీ ఇంట్లో పనిచేసే సిబ్బందికి రాయల్ సౌకర్యాలు లభిస్తాయంటున్నారు. సిబ్బందికి ఉండడానికి ప్రైవేట్ రూమ్ కేటాయిస్తారు. అంతేకాదు.. ఆంటిలియాలో పనిచేసే సిబ్బందికి భారీ జీతం లభిస్తుంది. యాంటిలియాలో స్వీపర్లు కూడా నెలకు దాదాపు రూ.2 లక్షల వరకు సంపాదిస్తున్నారట. ఈ జీతంలో వైద్య, విద్యా భత్యం  కూడా ఉంటాయని సమాచారం.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..