AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇలా తయారవుతున్నారు ఎంట్రా..పంద్రాగస్టు నాడు స్వీట్లు ఇవ్వలేదని టీచర్లను కొడతారా..?

ఒక పాఠశాలలో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జెండా ఎగురవేసిన అనంతరం విద్యార్థులందరికీ లడ్డూలు పంచిపెట్టారు. ఇంతలో ఒక్కసారిగా ముందుకు దూసుకు వచ్చిన ఒక బాలుడు అక్కడి టీచర్లతో గొడవకు దిగాడు. తనకు లడ్డూలు ఇవ్వలేదని ఆరోపిస్తూ..ఉపాధ్యాయులతో వాగ్వాదానికి దిగాడు. టీచర్లతో దురుసుగా ప్రవర్తించి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అనంతరం గ్రామ సమీపంలో ఇద్దరు ఉపాధ్యాయులు

ఇలా తయారవుతున్నారు ఎంట్రా..పంద్రాగస్టు నాడు స్వీట్లు ఇవ్వలేదని టీచర్లను కొడతారా..?
Sweets
Jyothi Gadda
|

Updated on: Aug 16, 2024 | 4:53 PM

Share

ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా పండగ వాతావరణం నెలకొంది. స్కూళ్లు, కాలేజీల్లో విద్యార్థులు, చిన్నారులు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఎక్కడికక్కడ జెండాలు ఎగురవేసి చిన్నారులకు మిఠాయిలు పంచారు. అయితే బీహార్‌లోని బక్సర్ జిల్లాలోని ఓ గ్రామంలో మాత్రం విద్యార్థులు రెచ్చిపోయి ప్రవర్తించారు. పంద్రాగస్టు పండుగ వేళ స్కూల్‌లో తమకు మిఠాయిలు ఇవ్వలేదని ఆగ్రహించిన విద్యార్థులు స్కూల్‌ టీచర్‌పై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన ప్రస్తుతం సంచలనంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

బక్సర్ జిల్లాలోని చౌగైలోని మురార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక పాఠశాలలో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జెండా ఎగురవేసిన అనంతరం విద్యార్థులందరికీ లడ్డూలు పంచిపెట్టారు. ఇంతలో ఒక్కసారిగా ముందుకు దూసుకు వచ్చిన ఒక బాలుడు అక్కడి టీచర్లతో గొడవకు దిగాడు. తనకు లడ్డూలు ఇవ్వలేదని ఆరోపిస్తూ..ఉపాధ్యాయులతో వాగ్వాదానికి దిగాడు. టీచర్లతో దురుసుగా ప్రవర్తించి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అనంతరం గ్రామ సమీపంలో ఇద్దరు ఉపాధ్యాయులు పంకజ్‌కుమార్‌, హనన్‌కుమార్‌లను పట్టుకుని కొట్టాడని తెలిసింది.

ఇకపోతే, ఈ విషయమై స్థానిక పోలీసులు ఇచ్చిన వివరణ మరోలా ఉంది.. ఉపాధ్యాయులను కొట్టిన విషయం తమకు తెలుసునని చెప్పారు. కానీ, ఇప్పటి వరకు ఉపాధ్యాయులు తమపై జరిగిన దాడి విషయమై ఎలాంటి ఫిర్యాదు ఇవ్వలేదని చెప్పారు. తమకు కంప్లైట్‌ వచ్చిన వెంటనే చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇదిలా ఉంటే, తమపై దాడికి పాల్పడిన నిందితుడు బంజరియా గ్రామ నివాసిగా టీచర్లు చెబుతున్నారు. అతడు తమ పాఠశాల విద్యార్థి కాదని ఉపాధ్యాయులు చెబుతున్నారు. స్కూల్‌లో విధ్వంసం సృష్టించేందుకు కావాలనే అక్కడికి వచ్చాడని ఆరోపించారు. ఏది ఏమైనప్పటికీ ఈ ఘటనపై గ్రామంతోపాటు పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. సాధారణంగా అన్ని పాఠశాలల్లో ఈ సందర్భంగా జెండా ఆవిష్కరణ, సాంస్కృతిక కార్యక్రమాలు, స్వీట్ల పంపిణీ నిర్వహిస్తారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

లండన్‌‌‌‌ వీధుల్లో.. ఇదేం దరిద్రంరా బాబు..! ఎక్కడ చూసినా మరకలే
లండన్‌‌‌‌ వీధుల్లో.. ఇదేం దరిద్రంరా బాబు..! ఎక్కడ చూసినా మరకలే
200MP కెమెరా, బిగ్ బ్యాటరీతో Xiaomi 17 Ultra లాంఛ్, ధర ఎంతంటే?
200MP కెమెరా, బిగ్ బ్యాటరీతో Xiaomi 17 Ultra లాంఛ్, ధర ఎంతంటే?
తెలంగాణలో సంక్రాంతి సెలవులు అప్పుడే.. ఈసారి ఏకంగా 9 రోజులు.?
తెలంగాణలో సంక్రాంతి సెలవులు అప్పుడే.. ఈసారి ఏకంగా 9 రోజులు.?
మీనా కూతురు నైనిక ఎంత పెద్దదైపోయిందో చూశారా? ఫొటోస్ వైరల్
మీనా కూతురు నైనిక ఎంత పెద్దదైపోయిందో చూశారా? ఫొటోస్ వైరల్
కోహ్లీకే షాకిచ్చిన ఈ లేటెస్ట్ సెన్సేషన్ బౌలర్ ఎవరో తెలుసా?
కోహ్లీకే షాకిచ్చిన ఈ లేటెస్ట్ సెన్సేషన్ బౌలర్ ఎవరో తెలుసా?
ఆదిరెడ్డి యూట్యూబ్ సంపాదన ఎంతో తెలుసా.. ?
ఆదిరెడ్డి యూట్యూబ్ సంపాదన ఎంతో తెలుసా.. ?
పీఎఫ్ అకౌంట్ లేనివారి కోసం కేంద్రం కొత్త స్కీమ్.. చేరితే అన్నీ..
పీఎఫ్ అకౌంట్ లేనివారి కోసం కేంద్రం కొత్త స్కీమ్.. చేరితే అన్నీ..
ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!
ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా