Building Collapse: బాబోయ్.. నాలుగంతస్తుల నివాస భవనం.. నిలువునా కుప్పకూలింది.. షాకింగ్‌ వీడియో

కళ్యాణ్‌జీ క రాస్తా ప్రాంతంలోని ఓ ఇంటి ప్రహరీ గోడ కూలిపోయింది. ఆ తర్వాత కొద్దిసేపటికే నాలుగంతస్తుల భవనం కూడా కూలిపోయింది. ఈ భవనం కూలిపోవడంతో పక్కనే ఉన్న ఇతర ఇళ్లు కూడా భారీగా దెబ్బతిన్నాయని స్థానికులు భయబ్రాంతులకు గురవుతున్నారు. తొలుత ఆ పక్క గోడ కూలిపోవడంతో పక్కనే ఉన్న మరో ఇంటి సపోర్టుపై ఆ ఇల్లు నిలిచి ఉందని గుర్తించిన అధికారులు...

Building Collapse: బాబోయ్.. నాలుగంతస్తుల నివాస భవనం.. నిలువునా కుప్పకూలింది.. షాకింగ్‌ వీడియో
Jaipur Building Collapse
Follow us
Jyothi Gadda

|

Updated on: Aug 16, 2024 | 6:02 PM

సోషల్ మీడియాలో ఒక షాకింగ్‌ వీడియో వైరల్‌ అవుతోంది. ఆ వీడియోలో నాలుగంతస్తుల భవనం పేకమేడల కూలిపోవటం కనిపించింది. ఈ ఘటన రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో జరిగినట్టుగా తెలిసింది. సమాచారం మేరకు జైపూర్‌లోని పార్కోట్‌లోని కళ్యాణ్‌జీ క రాస్తా ప్రాంతంలోని ఓ ఇంటి ప్రహరీ గోడ కూలిపోయింది. ఆ తర్వాత కొద్దిసేపటికే నాలుగంతస్తుల భవనం కూడా కూలిపోయింది. ఈ భవనం కూలిపోవడంతో పక్కనే ఉన్న ఇతర ఇళ్లు కూడా భారీగా దెబ్బతిన్నాయని స్థానికులు భయబ్రాంతులకు గురవుతున్నారు.

తొలుత ఆ పక్క గోడ కూలిపోవడంతో పక్కనే ఉన్న మరో ఇంటి సపోర్టుపై ఆ ఇల్లు నిలిచి ఉందని గుర్తించిన అధికారులు… పరిస్థితి ప్రమాదకరంగా ఉందని ముందుగా స్థానికుల్ని అప్రమ్తతం చేశారు. అర్థరాత్రి ఆ ఇంటిని ఖాళీ చేయించారు. సమీపంలోని ఇతర ఇళ్లను కూడా ఖాళీ చేయించారు. భద్రతను దృష్టిలో ఉంచుకుని ఆ ఇంటి పరిసరాల్లోకి ఎవరూ వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు.. అందిన సమాచారం మేరకు దాదాపు 15 మందిని ఇక్కడి నుంచి తరలించారని తెలిసింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..