AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తిరుమల శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు ప్రారంభం..3 రోజులపాటు ఈ సేవలు రద్దు

ఆగస్టు 15 సెలవురోజు కావడం, శుక్రవారం వరలక్ష్మీవ్రతం పండుగ రావడం, ఆ తరువాత శనివారం, ఆదివారంతో వరుస సెలవులతో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతోంది. తిరుమలలో భక్తుల రద్దీ నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, ప‌విత్రోత్స‌వాల్లో భాగంగా ఆగ‌స్టు 14న అంకురార్ప‌ణ కార‌ణంగా

తిరుమల శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు ప్రారంభం..3 రోజులపాటు ఈ సేవలు రద్దు
Srivari Temple
Jyothi Gadda
|

Updated on: Aug 15, 2024 | 9:11 PM

Share

తిరుమల శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు గురువారం నుంచి శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారిని పవిత్ర మండపంలోని యాగశాలకు తీసుకువచ్చి హోమాలు తదితర వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం సంపంగి ప్రాకారంలో వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో విగ్రహాలకు అభిషేకం చేశారు. వేద పండితులు పంచసూక్తాలను పఠించారు. ఆ తర్వాత మొదటిరోజు పవిత్ర ప్రతిష్ట , మధ్యాహ్నం స్వామి, అమ్మవార్లకు విశేష సమర్పణ చేశారు.

పవిత్రోత్సవాల కారణంగా ఆలయంలో తిరుప్పావడ, కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలను టీటీడీ రద్దు చేసింది. ఈ కార్యక్రమంలో తిరుమల పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, ఆల‌య డిప్యూటీ ఈవో లోకనాథం ఇతర అధికారులు పాల్గొన్నారు.

కలియుగదైవం శ్రీవెంకటేశ్వరస్వామి వారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల రద్దీ పెరిగింది. ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం సెలవురోజు కావడం, శుక్రవారం వరలక్ష్మీవ్రతం పండుగ రావడం, ఆ తరువాత శనివారం, ఆదివారంతో వరుస సెలవులతో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతోంది. తిరుమలలో భక్తుల రద్దీ నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, ప‌విత్రోత్స‌వాల్లో భాగంగా ఆగ‌స్టు 14న అంకురార్ప‌ణ కార‌ణంగా సహస్రదీపాలంకార సేవను టీటీడీ ర‌ద్ధు చేసింది. అదేవిధంగా, ఆగ‌స్టు 15న తిరుప్పావడతోపాటు ఆగ‌స్టు 15 నుండి 17వ తేదీ వ‌ర‌కు కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలు ర‌ద్ద‌య్యాయి. భక్తులు ఈ విషయాలను గమనించగలరు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..