ఓఆర్‌ఆర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం..అక్కడికక్కడే ఐదుగురు మృతి.. మరో పదిమందికి పైగా..
ప్రమాదంలో మరో పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను హాస్పిటల్‌కు తరలించారు. కాగా, తుక్కుగూడ నుంచి శంషాబాద్ వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు సమాచారం.
రంగారెడ్డి జిల్లాలో ఘోర రోర్డు ప్రమాదంచోటు చేసుకుంది. శంషాబాద్ మండలం పెద్ద గోల్కొండ ఓఆర్ఆర్ పై ఈ ప్రమాదం జరిగింది. పెద్ద గోల్కొండ ఔటర్ రింగు రోడ్డుపై తుఫాన్ వాహనాన్ని అతివేగంతో వచ్చిన ఓ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో మరో పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను హాస్పిటల్‌కు తరలించారు. కాగా, తుక్కుగూడ నుంచి శంషాబాద్ వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు సమాచారం. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..