TGPSC Jobs: ‘జాబ్‌ క్యాలెండర్‌ ప్రకారంగానే ఉద్యోగాలు భర్తీ చేస్తాం’ టీజీపీఎస్సీ ఛైర్మన్‌ మహేందర్‌రెడ్డి

తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలు షెడ్యూల్‌ ప్రకారంగానే భర్తీ చేస్తామని, ఇందులో ఎలాంటి మార్పు లేదనీ టీజీపీఎస్సీ ఛైర్మన్‌ డాక్టర్‌ ఎం మహేందర్‌రెడ్డి తెలిపారు. గురువారం (ఆగస్టు 15) స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కమిషన్‌ కార్యాలయంలో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం కమిషన్‌లో పనిచేస్తున్న పోలీసు సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా..

TGPSC Jobs: 'జాబ్‌ క్యాలెండర్‌ ప్రకారంగానే ఉద్యోగాలు భర్తీ చేస్తాం' టీజీపీఎస్సీ ఛైర్మన్‌ మహేందర్‌రెడ్డి
TGPSC Chairman Mahender Reddy
Follow us
Srilakshmi C

|

Updated on: Aug 16, 2024 | 6:16 AM

హైదరాబాద్‌, ఆగస్టు 16: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలు షెడ్యూల్‌ ప్రకారంగానే భర్తీ చేస్తామని, ఇందులో ఎలాంటి మార్పు లేదనీ టీజీపీఎస్సీ ఛైర్మన్‌ డాక్టర్‌ ఎం మహేందర్‌రెడ్డి తెలిపారు. గురువారం (ఆగస్టు 15) స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కమిషన్‌ కార్యాలయంలో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం కమిషన్‌లో పనిచేస్తున్న పోలీసు సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన ఉద్యోగులనుద్దేశించి మాట్లాడుతూ.. జాబ్‌ క్యాలెండర్‌ ప్రకారం గానే ఉద్యోగ నియామకాలు చేపట్టాలని అన్నారు. అందులో పేర్కొన్న విధంగా గడువులోగా పనులు పూర్తిచేయాలని, ఈ మేరకు అవసరమైన నైపుణ్యాలు పెంచుకోవాలని సూచించారు. ఈ మేరకు ఉద్యోగాల భర్తీ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.

కాగా ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్లు, పరీక్షల నిర్వహణకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల 2024-25 విద్యా సంవత్సరానికి జాబ్‌ క్యాలెండర్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. మొత్తం 20 రకాల ఉద్యోగాలకు సంబంధించి రిక్రూట్‌మెంట్ వివరాలను ఇందులో పొందుపరిచింది. జాబ్‌ క్యాలెండర్‌లో నోటిఫికేషన్‌ విడుదల చేసే నెలతోపాటు, నియామక పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారనే వివరాలు, పరీక్ష నిర్వహించే బోర్డు, తేదీలు, ఉద్యోగ అర్హతలు.. వంటి తదితర వివరాలను పొందుపరిచారు. తాజా జాబ్‌ క్యాలెండర్‌ ప్రకారం టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు అక్టోబర్ 21 నుంచి 27 వరకు జరగనున్నాయి.

టీజీపీఎస్సీ గ్రూప్ 3 పరీక్షలు నవంబర్ 17 నుంచి 18 వరకు జరుగుతాయి. ఏడాదికి రెండు సార్లు టెట్‌ పరీక్ష నిర్వహిస్తామని ఇప్పటికే రాష్ట్ర సర్కార్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అ ప్రకారంగా జాబ్‌ క్యాలెండర్‌లో కూడా వివరాలను పొందుపరిచారు. 2025 సంవత్సారానికి తొలి విడత టెట్‌ పరీక్ష జనవరిలో ఉంటుంది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ అక్టోబర్ 2024లో విడుదల చేస్తారు. ఇక రెండో విడత టెట్‌ పరీక్ష జూన్‌ 2025లో నిర్వహిస్తారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ ఏప్రిల్‌ 2024 నెలలో విడుదల చేస్తారు. ఇక టీజీపీఎస్సీ గ్రూప్ Iకు కూడా అక్టోబర్ 2024 మరో కొత్త నోటిఫికేషన్‌ ఇచ్చేందుకు కమిషన్‌ నిర్ణయించింది. ప్రిలిమ్స్ పరీక్ష ఫిబ్రవరి 2025లో ఉంటుంది. టీజీపీఎస్సీ గ్రూప్ I-మెయిన్స్ అక్టోబర్ 2025లో నిర్వహిస్తారు. ఇతర వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.