Female Constable Crime: అత్త, పిల్లలను చంపిన మహిళా పోలీస్‌.. ఆమెను హత్య చేసి భర్త సూసైడ్‌!

ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులు ఓ ఇంట్లో శవమై కనిపించిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. మృతుల్లో మహిళా కానిస్టేబుల్‌, ఆమె ఇద్దరు పిల్లలు, అత్త, భర్త ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నలుగురి మృతదేహాలు ఒక గదిలో కనిపించగా.. మరొకరు వేరే గదిలో ఉరి వేసుకున్నట్లు సమాచారం. మహిళా పోలీసు కానిస్టేబుల్ తొలుత అత్తగారిని, ఇద్దరు పిల్లలను హత్య చేసిందని, ఆ తర్వాత ఆవేశంతో భర్త ఆమెను హత్య చేసి..

Female Constable Crime: అత్త, పిల్లలను చంపిన మహిళా పోలీస్‌.. ఆమెను హత్య చేసి భర్త సూసైడ్‌!
Bihar Female Cop Murder Case
Follow us
Srilakshmi C

|

Updated on: Aug 15, 2024 | 9:33 AM

పాట్నా, ఆగస్టు 15: ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులు ఓ ఇంట్లో శవమై కనిపించిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. మృతుల్లో మహిళా కానిస్టేబుల్‌, ఆమె ఇద్దరు పిల్లలు, అత్త, భర్త ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నలుగురి మృతదేహాలు ఒక గదిలో కనిపించగా.. మరొకరు వేరే గదిలో ఉరి వేసుకున్నట్లు సమాచారం. మహిళా పోలీసు కానిస్టేబుల్ తొలుత అత్తగారిని, ఇద్దరు పిల్లలను హత్య చేసిందని, ఆ తర్వాత ఆవేశంతో భర్త ఆమెను హత్య చేసి, ఆపై తాను ఆత్మహత్య చేసుకున్నట్లు ఉన్న ఓ సూసైడ్ నోట్ కూడా లభ్యమైంది. ఈ ఘటన బీహార్‌లోని భాగల్‌పూర్‌లోని ప్రభుత్వ క్వార్టర్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

మహిళా కానిస్టేబుల్‌ నీతూ కుమారి దారుణానికి పాల్పడింది. తన ఇద్దరు పిల్లలు, అత్త గొంతు కోసి చంపింది. దీందో ఆగ్రహించిన భర్త ఆమె గొంతు కోసి హత్య చేశాడు. ఆ తర్వాత సీలింగ్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మహిళా కానిస్టేబుల్‌ నీతూ కుమారి తన కుటుంబంతో కలిసి పోలీస్‌ క్వార్టర్స్‌లో నివసిస్తున్నది. ఆమెకు నాలుగున్నర ఏళ్ల శివాంశ్, మూడున్నర ఏళ్ల శ్రేయ పిల్లలున్నారు. భర్త పంకజ్ తల్లి ఆశాదేవి (65) కూడా వారితో కలిసి ఒకే ఇంట్లో ఉంటుంది. అయితే ఏం జరిగిందో తెలియదు గానీ మంగళవారం (ఆగస్టు 13) ఉదయం 9 గంటల సమయంలో పాలు పోసే వ్యక్తి ఆ ఇంటి కాలింగ్‌ బెల్‌ నొక్కాడు. ఎవరూ బయటికి రాకపోవడంతో ఇరుకు పొరుగు వారికి విషయం చెప్పాడు. సాయంత్రం అవుతున్న ఆ ఇంటి నుంచి అలికిడి రాకపోవడంతో అదే క్వార్టర్స్‌లో నివసించే పోలీస్‌ సిబ్బందికి అనుమానం తలెత్తింది. దీంతో తలుపులు పగులగొట్టి ఇంట్లోకి వెళ్లి చూడగా.. షాకింగ్ దృశ్యం వారికంట పడింది.

ఇవి కూడా చదవండి

మహిళా కానిస్టేబుల్‌ నీతూ కుమారి, ఆమె పిల్లలు, అత్త రక్తపు మడుగులో శవాలై కనిపించారు. ఆమె భర్త పంకజ్‌ మృతదేహం సీలింగ్‌కు వేలాడుతూ కనిపించాడు. అదే గదిలో నీతూ భర్త పంకజ్‌ రాసిన సూసైడ్‌ నోట్‌ను పోలీసులు గుర్తించారు. అందులో నీతూ కుమారి వేరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుందని పంకజ్‌ ఆరోపించాడు. అందుకే ఆమె తన తల్లిని, ఇద్దరు పిల్లలను చంపినట్లు సూసైడ్‌ నోట్‌లో పేర్కొన్నాడు. ఆవేశంలో ఆమెను చంపి, తాను కూడా సూసైడ్‌ చేసుకుంటున్నట్లు తెలిపాడు. పోలీసులు సంఘటనా స్థలంలోని మృతదేహాలను స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించినట్లు ఓ పోలీస్‌ అధికారి తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.