Kolkata Doctor Murder: ‘అసలెందుకు వాళ్లు అలా చెప్పారు?’ వైద్యురాలి హత్యాచారం కేసులో ఎన్నో అనుమానాలు

కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీలో అత్యాచారం, హత్యకు గురైన ట్రైనీ మహిళా డాక్టర్ కేసులో తవ్వేకొద్దీ సంచలన విషయాలు బయటికి వస్తున్నాయి. డాక్టర్ మృతి చెందిన అనంతరం ఆమె తండ్రికి శుక్రవారం ఉదయం ఆసుపత్రి నుంచి ఫోన్ వచ్చింది. తన కూతురు సూసైడ్‌ చేసుకుని చనిపోయిందని చెస్ట్ మెడిసిన్ డిపార్ట్‌మెంట్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ తనకు ఫోన్‌లో తెలిపారని మృతురాలి తండ్రి చెప్పారు..

Kolkata Doctor Murder: 'అసలెందుకు వాళ్లు అలా చెప్పారు?' వైద్యురాలి హత్యాచారం కేసులో ఎన్నో అనుమానాలు
Kolkata Doctor Rape Murder
Follow us

|

Updated on: Aug 14, 2024 | 11:53 AM

కోల్‌కతా, ఆగస్టు 14: కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీలో అత్యాచారం, హత్యకు గురైన ట్రైనీ మహిళా డాక్టర్ కేసులో తవ్వేకొద్దీ సంచలన విషయాలు బయటికి వస్తున్నాయి. డాక్టర్ మృతి చెందిన అనంతరం ఆమె తండ్రికి శుక్రవారం ఉదయం ఆసుపత్రి నుంచి ఫోన్ వచ్చింది. తన కూతురు సూసైడ్‌ చేసుకుని చనిపోయిందని చెస్ట్ మెడిసిన్ డిపార్ట్‌మెంట్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ తనకు ఫోన్‌లో తెలిపారని మృతురాలి తండ్రి చెప్పారు. అనంతరం తన కుమార్తె మృతదేహం సెమినార్ హాల్‌లో అర్ధనగ్నంగా, గాయాలతో కనిపించిందని తెలిసింది. ఆ తర్వాత ఆమెపై అత్యంత క్రూరంగా అత్యాచారం చేసి, హత్య చేసినట్లు దర్యాప్తు అధికారులు వెల్లడించారని మృతురాలి తండ్రి మీడియాకు తెలిపారు. వీటన్నింటి నేపథ్యంలో తన కూతురు మృతిని ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ఆసుపత్రి యాజమన్యం యత్నించినట్లు మృతురాలి తండ్రి ఆరోపించారు. అయితే తనకు ఫోన్‌ చేసిన అధికారి తన పేరును మాత్రం వెల్లడించలేదని ఆయన తెలిపారు. తమ కూతురి మృతదేహం లభ్యమైన తర్వాత కాలేజీ యాజమాన్యం ఈ విషయాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నించిందన్న వైద్యురాలి తండ్రి వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.

ఆసుపత్రికి చేరుకున్న తర్వాత కూడా తమ కూతురి మృతదేహాన్ని చూసేందుకు అనుమతించలేదని మహిళ తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. తమ కూతుర్ని చూడనివ్వమని వాళ్ళ కాళ్ళ మీద కూడా పడ్డానని, కానీ వాళ్ళు వాళ్లెవ్వరూ అనుమతించలేదన్నారు. చివరికి సంఘటన జరిగిన రోజు మధ్యాహ్నం 2 గంటలకు ఆమెను చూసేందుకు అనుమతించారని కన్నీరుమున్నీరుగా విలపించారు. రాత్రి ఫోన్‌ చేసి భోజనం చేయమని బాధితురాలు తన తల్లికి చెప్పిందని కుటుంబ సభ్యులు మీడియాకు తెలిపారు. తమ కూతురికి ఏడాది పెళ్లి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని.. కానీ ఇంతలో దారుణం జరిగిందని రోధించారు. ఆసుపత్రిలోని అధికారుల ప్రమేయం లేకుండా బయటి వ్యక్తులు ఇంతటి దారుణానికి పాల్పడే అవకాశం లేదని కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, కోల్‌కతా పోలీస్ కమీషనర్ వినీత్ గోయల్ బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వచ్చనప్పుడు ఈ అనుమానాలను లేవనెత్తారు. తమ కుమార్తెను తిరిగి బతికించుకోలేమని, కానీ తమ కుమార్తెకు న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

విచారణ ప్రకారం.. రాత్రి షిఫ్ట్‌లో ఉన్న మహిళా వైద్యురాలు నలుగురు సహోద్యోగులతో కలిసి గురువారం రాత్రి డిన్నర్ చేసినట్లు విచారణలో తేలింది. దీంతో పోలీసులు సదరు నలుగురు సహోద్యోగులను కూడా విచారిస్తున్నారు. సివిక్‌ వాలంటీర్‌గా పనిచేసే సంజయ్ రాయ్‌ అనే వ్యక్తి ఆసుపత్రికి తరచూ వస్తుంటాడు. ప్రస్తుతానికి సంజయ్ రాయ్‌ని మాత్రమే పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ కేసులో ఇతరుల ప్రమేయం ఉన్నట్లు రుజువైతే మరో నాలుగు-ఐదు రోజుల్లో వారిని కూడా కస్టడీలోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు. మరోవైపు మహిళా వైద్యురాలు సూసైడ్‌ చేసుకుని చనిపోయిందని ఆమె కుటుంబ సభ్యులకు ఎందుకు చెప్పారో తెలుసుకోవడానికి ఆసుపత్రిలోని చెస్ట్ మెడిసిన్ డిపార్ట్‌మెంట్ చీఫ్‌ను ప్రశ్నిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ కేసులో ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో ఆరోజు రాత్రి అసలేం జరిగిందనే విషయంపై అధికారులు నోర్లు మెదపకపోవడంపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. ప్రిన్సిపల్ డాక్టర్ సందీప్ ఘోష్ ఆగస్టు 13 రాజీనామా చేశారు. సోషల్‌ మీడియాలో తనపై వస్తున్న ఆరోపణలు భరించలేకనే రిజైన్‌ చేస్తున్నట్లు చెప్పిన డాక్టర్ సందీప్‌.. అనంతరం నాలుగు గంటల వ్యవధిలోనే కోల్‌కతాలోని మరో మెడికల్‌ కాలేజీలో ప్రిన్సిపాల్‌గా నియామకం పొందాడు. కలకత్తా నేషనల్ మెడికల్ కాలేజీకి చెందిన విద్యార్థులు ఈ చర్యను తీవ్రంగా వ్యతిరేకించారు. ఒక క్యాంపస్‌లో భద్రత కల్పించడంలో విఫలమైన ప్రిన్సిపాల్‌ను మరో క్యాంపస్‌కి ఎలా నియమిస్తారని ప్రశ్నించారు. ప్రిన్సిపాల్‌ను విధుల్లోకి రానివ్వబోమని ప్రిన్సిపల్‌ ఆఫీస్‌కు తాళం వేశారు. నర్సులు, సెక్యూరిటీ ఉన్నా.. ఈ సంఘటన ఎలా జరిగిందని ప్రశ్నిస్తున్నారు. ఖచ్చతంగా ఆసుపత్రిలోని అధికారుల ప్రమేయం ఉందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసు విచారణను సీబీఐ విచారణకు అప్పగించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

మెక్సికోలో కూలిన పిరమిడ్‌.. వినాశనానికి సంకేతమా.? వీడియో వైరల్..
మెక్సికోలో కూలిన పిరమిడ్‌.. వినాశనానికి సంకేతమా.? వీడియో వైరల్..
మరింత ఈజీగా బ్యాంక్​ లోన్స్.! సిబిల్ స్కోర్ ఉన్నవారికి ఈజీగా లోన్
మరింత ఈజీగా బ్యాంక్​ లోన్స్.! సిబిల్ స్కోర్ ఉన్నవారికి ఈజీగా లోన్
ఆవుకు గ్రాండ్ బర్త్ డే సెలెబ్రేషన్|చాయ్ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్..
ఆవుకు గ్రాండ్ బర్త్ డే సెలెబ్రేషన్|చాయ్ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్..
ఇదెక్కడి రచ్చ.. రోడ్డుపై బస్సు డ్రైవర్‌తో గొడవపడ్డ దర్శకుడు..
ఇదెక్కడి రచ్చ.. రోడ్డుపై బస్సు డ్రైవర్‌తో గొడవపడ్డ దర్శకుడు..
నిహారిక కోసం రంగంలోకి దిగిన చరణ్‌-మహేష్|చిక్కుల్లో సూర్య, విక్రమ్
నిహారిక కోసం రంగంలోకి దిగిన చరణ్‌-మహేష్|చిక్కుల్లో సూర్య, విక్రమ్
బంగ్లాదేశ్ అక్రమ చొరబాట్లను అడ్డుకున్న బీఎస్‌ఎఫ్‌.!
బంగ్లాదేశ్ అక్రమ చొరబాట్లను అడ్డుకున్న బీఎస్‌ఎఫ్‌.!
మేం తగ్గం... సింహాలపైకి దూసుకెళ్లిన కుక్కలు
మేం తగ్గం... సింహాలపైకి దూసుకెళ్లిన కుక్కలు
మనుషులను తీసుకెళ్లే చైనా డ్రోన్ వచ్చేసింది.! 2 వేల కేజీల లోడ్‌..
మనుషులను తీసుకెళ్లే చైనా డ్రోన్ వచ్చేసింది.! 2 వేల కేజీల లోడ్‌..
డ్రోన్‌ మంటల్లో 'జపోరిజియా' అణు విద్యుత్‌ ప్లాంట్.. ఆరోపణలు.
డ్రోన్‌ మంటల్లో 'జపోరిజియా' అణు విద్యుత్‌ ప్లాంట్.. ఆరోపణలు.
ఆ ఊళ్లో కాకులు మగవాళ్లనే ఎందుకు తంతున్నాయి.? వీడియో వైరల్..
ఆ ఊళ్లో కాకులు మగవాళ్లనే ఎందుకు తంతున్నాయి.? వీడియో వైరల్..