Telangana: ఫోన్ మాట్లాడుతూ.. చంకలో హీటర్ పెట్టుకుని, స్విచ్ ఆన్ చేశాడు!
ఒక్కోసారి ఏమరుపాటులో మనకే తెలియకుండా కొన్ని తప్పులు చేస్తుంటాం. కానీ అవే మన పాలిట శాపాలుగా మారుతుంటాయి. తాజాగా ఓ వ్యక్తి చేసిన చిన్న తప్పిదం ఏకంగా అతని ప్రాణాన్నే బలి తీసుకుంది. అలా ఒకవైపు ఫోన్ మాట్లాడుతూ.. యథాలాపంగా మరో పని చేపట్టే అలవాటున్న వారికి ఇది హెచ్చరిక లాంటిదే. ఓ మొబైల్ ఫోన్ మాట్లాడుతూ.. అనాలోచితంగా విద్యుత్ హీటర్‌ను చంకలో పెట్టు్కుని స్విచ్..
ఖమ్మం, ఆగస్టు 12: ఒక్కోసారి ఏమరుపాటులో మనకే తెలియకుండా కొన్ని తప్పులు చేస్తుంటాం. కానీ అవే మన పాలిట శాపాలుగా మారుతుంటాయి. తాజాగా ఓ వ్యక్తి చేసిన చిన్న తప్పిదం ఏకంగా అతని ప్రాణాన్నే బలి తీసుకుంది. అలా ఒకవైపు ఫోన్ మాట్లాడుతూ.. యథాలాపంగా మరో పని చేపట్టే అలవాటున్న వారికి ఇది హెచ్చరిక లాంటిదే. ఓ మొబైల్ ఫోన్ మాట్లాడుతూ.. అనాలోచితంగా విద్యుత్ హీటర్‌ను చంకలో పెట్టు్కుని స్విచ్ ఆన్ చేశాడు. అంతే.. షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ షాకింగ్ ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. మూడో పట్టణ పోలీసు స్టేషన్ ఇన్‌స్పెక్టర్ రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం..
ఖమ్మం జిల్లా స్థానిక కాల్వ ఒడ్డునున్న హనుమాన్ గుడి సమీపంలో దోనెపూడి మహేశ్‌బాబు (40) అనే వ్యక్తి కొబ్బరికాయల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండేవారు. ఆదివారం రాత్రి 8.30 గంటల సమయంలో ఆయన ఇంట్లో పెంపుడు కుక్కకు స్నానం చేయించాలని అనుకున్నాడు. దీంతో వాష్‌రూంలో వేడినీళ్ల కోసం హీటర్ ఆన్ చేయబోయాడు. ఇంతలో అతడి ఫోన్ రింగ్ అయ్యింది. దీంతో మహేశ్ ఫోన్ మాట్లాడుతూ.. హీటర్‌ను నీటిలో బదులు చంకలో పెట్టుకున్నాడు. అనంతరం స్విచ్ ఆన్ చేశారు. దీంతో ఒక్కసారిగా విద్యుదాఘాతానికి గురై కింద పడిపోయారు.
సమీపంలో ఉన్న ఆయన తొమ్మిదేళ్ల కుమార్తె భయంతో పెద్దగా కేకలు వేస్తూ పరులు తీసింది. దీంతో అప్రమత్తమైన భార్య దుర్గాదేవి ఏం జరిగిందోనని పరుగు పరుగునరాగా వాష్ రూంలో మహేశ్ పడిపోయి కనిపించాడు. వెంటనే దుర్గాదేవి స్థానికుల సహాయంతో మహేశ్‌బాబును ఆసుపత్రికి తరలించింది. కానీ అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. దీంతో భార్య దుర్గాదేవి కన్నీరుమున్నీరుగా విలపించింది. చిన్నపాటి ఏమరపాటు ఎంత పనిచేసిందంటూ రోధించింది. కాగా మహేశ్‌బాబు దంపతులకు ఇద్దరు కుమార్తెలు సంతానం.